మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

Feb 12 2026 11:26 AM | Updated on Feb 12 2026 11:26 AM

మహా శ

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

రామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్‌ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజుర్‌నగర్‌ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు.

నేటి బంద్‌కు

కాంగ్రెస్‌ మద్దతు

నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

దాడులకు పాల్పడితే గుణపాఠం తప్పదు

మాజీ ఎమ్మెల్యేలు

భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ : అధికార బలంతో కాంగ్రెస్‌ పార్టీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తగిన గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో ఎన్నికల సమయం ముసిగిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్‌, జమీల్‌, చాంద్‌పాషాపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జావిద్‌, ఆయన అనుచరులు కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. బాధితులు చికిత్స పొందుతుంటే వారిని హతమార్చాలని ఆస్పత్రిలోకి వచ్చి మరుణాయుధాలతో మరోసారి దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడులపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్‌ చేశారు. దాడులకు పాల్పడిన జావిద్‌, ఆయన అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా 20వ వార్డులో దొంగ ఓట్లు వేయించారని, దీనిని బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నందుకు పోలీసులు సమక్షంలోనే వారిపై దాడులకు పాల్పడ్డారని, ఈ వార్డులో రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నల్లమోతు సిదార్థ, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, హతీరాం, మెసిన్‌అలీ, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, పోకల రాజు తదితరులు ఉన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఓపీఓల నిరసన

మిర్యాలగూడ టౌన్‌ : పీఓలు, ఏపీఓల మాదిరిగానే తమకు కూడా రూ.1300 పారితోషికం ఇవ్వాలని కోరుతూ బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోగల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద ఓపీఓలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా తాము కూడా పీఓలు, ఏపీఓల మాదిరిగానే రెండు రోజులుగా విధులు నిర్వహించామని తమకు రూ.1000 పారితోషికం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.ఈ విషయంపై మున్సిపల్‌ కమిషన ర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకే తాము ఓపీఓలకు రూ. వెయ్యి చొప్పున ఇచ్చామని, ఒక వేళ కలెక్టర్‌ ఆదేశిస్తే మరో రూ.300 పంపిస్తామని స్పష్టం చేశారు.

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు1
1/1

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement