షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చిట్టంకుంట గ్రామంలో జరిగే బంధువుల శుభకార్యానికి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అంతకు ముందు భీముడు కుటుంబ సభ్యులు వేడి నీటి కోసం ఇంట్లోని బాత్‌రూంలో కరంట్ హీటర్ పెట్టి మర్చి పోయి వెళ్లారు. దాంతో బకిట్లోని నీరు అతిగా వేడి కావడంతో హీటర్ కాలిపోయి బాత్‌రూంతోపాటు బెడ్‌రూంలో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వారి ఇంట్లోంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫర్నీచర్‌తో పాటు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.


