ఫ ఓటెయ్‌.. చికెన్‌ తీసుకో | - | Sakshi
Sakshi News home page

ఫ ఓటెయ్‌.. చికెన్‌ తీసుకో

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

ఫ ఓటెయ్‌.. చికెన్‌ తీసుకో

ఫ ఓటెయ్‌.. చికెన్‌ తీసుకో

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్‌ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్‌ తీసుకెళ్లండి అంటూ ఆఫర్‌ ప్రకటించారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా చికెన్‌ షాపులకు వెళ్లి టోకెన్‌ ఇచ్చి చికెన్‌ తీసుకున్నారు. దాంతో చికెన్‌ షాపులు కిటకిటలాడాయి. షాపుల నిర్వాహకులు ముందుగానే కోళ్లను తెప్పించుకొని, టోకెన్‌తో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్‌ ఏర్పాటు చేసి చికెన్‌ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement