నల్లగొండ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే.. | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే..

Feb 12 2026 11:26 AM | Updated on Feb 12 2026 11:26 AM

నల్లగొండ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే..

నల్లగొండ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌దే..

నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి చరిత్ర సృష్టించబోతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని నల్లగొండ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి కార్పొరేషన్‌ ఎన్నిక కావడంతో ప్రతి వార్డులో ప్రచారానికి వెళ్లానని.. అక్కడ పేదలకు ఎన్నో హామీలిచ్చానని తెలిపారు. ప్రతి డివిజన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించేందుకు ప్రత్యేక రూమ్‌ను ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు స్వీకరించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండలో బొట్టుగూడ హైస్కూల్‌ తరహాలో మిగతా 18 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యా విధానం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన దగ్గరకు వస్తే.. ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తానని తెలిపారు. మేయర్‌ ఎన్నిక తర్వాత నల్లగొండ కార్పొరేషన్‌లో 100 ఎకారల భూమిని సేకరించి దేవరకొండ రోడ్డులో 4 వేలు, నార్కట్‌పల్లి రోడ్డులో 4 వేల ఇందిరమ్మ ఇళ్లను 75 గజాల్లో కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హపీజ్‌ఖాన్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని చరిత్ర సృష్టిస్తాం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement