విశాఖపట్నం : చల్లటి గాలి, మబ్బుపట్టిన ఆకాశం... మాంసప్రియుల మనసు ఎటు పరిగెడుతుందో తెలుసా? నేరుగా ఫిషింగ్ హార్బర్ వైపు! ఇంటి దగ్గర వంట గిన్నెలు సిద్ధం చేసుకుని, బ్యాగులు పట్టుకుని బయల్దేరిన జనం హార్బర్లో బారులు తీరారు.
ఇది మాములు రద్దీ కాదు... నెలల తరబడి ఎదురుచూసిన వేట సీజన్ మొదలైన సందడి.
అక్టోబర్ నుంచి జూన్ వరకు సముద్రంలో మౌనంగా ఉన్న పడవలు, ఈ వారం నుంచి మళ్లీ గర్జించాయి. వలలు సముద్రంలో పడ్డాయంటే చాలు.. ఏం చిక్కుతాయో అని ఒడ్డున నిలబడ్డ జనం కళ్లు పెద్దవి చేసుకుని చూశారు.
ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితమే వచ్చింది. ట్యూనా, వంజరాలు, గులివిం దలు, ఎర్రరంగు రొయ్యలు... ఒక్కటేమిటి, రంగురంగుల చేపల హరివిల్లు ఒడ్డుకు చేరింది.
రొయ్యలు, పీతల దగ్గర అయితే మరీ క్యూలైన్లు. 'ఎన్నాళ్లయింది ఇలాంటి ఫ్రెష్ క్యాచ్ చూసి' అంటూ కొందరు మురిసిపోతే, బేర సారాలతో మరికొందరు సందడి చేశారు.
-ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


