లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌ | A mother and her child a miraculous escape in Kerala | Sakshi
Sakshi News home page

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

Jun 22 2026 6:02 PM | Updated on Jun 22 2026 7:03 PM

A mother and her child a miraculous escape in Kerala

కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు

రోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ  కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  నిజంగా లక్‌ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

 

 

ఇదీ చదవండి: ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement