భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ, కారునుఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బాద్‌నగర్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచక్ వసా సమీపంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అధికారులు తెలిపారు. ఉజ్జైన్ వైపు వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా కార్‌ను ఢీకొనడంతో, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతి చెందినవారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.


