జమ్మూ.. డిప్యూటీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి | Scorpio From Jammu And Kashmir Deputy Chief Minister’s Convoy Hits Bihar Man, Police Launch Probe | Sakshi
Sakshi News home page

జమ్మూ.. డిప్యూటీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Aug 9 2026 3:02 PM | Updated on Aug 9 2026 4:10 PM

scorpio part of jk deputy chief ministers convoy runs over man

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగి తీవ్రంగా గాయపడిన భరత్ కాపర్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు భరత్ కాపర్ , బీహార్‌లోని సమస్తిపూర్ నివాసి అని తెలుస్తోంది.  

నిన్న శనివారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో జమ్మూ శివారు ప్రాంతమైన గంగ్యాల్‌లో రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఆయన్ను ఢీకొట్టింది.  అయితే  జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరిని ఆయన నివాసంలో దించి వస్తున్న కాన్వాయ్‌లోనిదే ఆ స్కార్పియో వాహనమని తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో నగర ప్రాంతాల్లో అధికారిక కాన్వాయ్‌ల రాకపోకలు, రోడ్డు భద్రతపై ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement