డీలిమిటేషన్‌ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్‌ కీలక నిర్ణయం | Punjab SAD, BJP alliance Sukhbir Badal supports delimitation bill | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్‌ కీలక నిర్ణయం

Aug 8 2026 6:50 PM | Updated on Aug 8 2026 7:32 PM

Punjab SAD, BJP alliance Sukhbir Badal supports delimitation bill

చంఢీగఢ్: శిరోమణి అకాలీ దళ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకవచ్చిన డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తమ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో,  శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన ఒక రోజు అనంతరమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మద్దతుతో రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి–బీజేపీ కూటమి మళ్లీ ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు SAD మద్దతు ఇస్తుంది. ఈ మేరకు శిరోమణి అకాలీ దళ్..  చండీగఢ్‌లో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది” అని బాదల్ ‘ఎక్స్’లో తెలిపారు.

పార్లమెంట్ ముందున్న కీలక అంశాలపై సవివరంగా చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయమైన, సమతుల్య డీలిమిటేషన్ జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసిందని  ఆయన పేర్కొన్నారు.

గతంలో డీలీమిటేషన్‌కు వ్యతిరేకంగా

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆసమయంలో  పంజాబ్‌కు ఈ బిల్లు వివక్ష చూపుతోందని అకాలీ దళ్ ఆరోపించింది. పంజాబ్‌కు సీట్ల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే లభిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇటీవల మోదీతో భేటీ అయిన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ డీలిమిటేషన్‌ బిల్లులకు మద్దతు తెలపడం విశేషం.

2020లో తెగిపోయిన దాదాపు రెండున్నర దశాబ్దాల బంధం

బీజేపీ–శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిన పొత్తు 2020లో తెగిపోయింది. అప్పట్లో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీ దళ్.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement