స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 ఏళ్లు గడిచినా ఆ గ్రామానికి ప్రభుత్వ బస్సు మాత్రం రాలేదు. ఎట్టకేలకు తొలిసారి బస్సు కుర్తాల్ గ్రామంలోకి రావడంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పూల వర్షం కురిపిస్తూ.. మంగళహారతులు ఇస్తూ.. డప్పుల మోతతో నృత్యాలు చేస్తూ గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బస్సుకు భావోద్వేగంతో స్వాగతం పలికారు.
బస్సు డ్రైవర్, కండక్టర్‌లకు తలపాగాలు చుట్టి.. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రాజస్థాన్‌లోని కేక్రి ప్రాంతంలోని కుర్తాల్, కేరోట్ గ్రామాలకు ఈ బస్సు రాక చారిత్రక క్షణమని పలువురు సోషల్ మీడియాలో నెటిజన్లు అభివర్ణించారు. కుర్తాల్ సమీపంలోని కేరోట్ గ్రామాలు దశాబ్దాలుగా బస్సు సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేరుగా ఆ గ్రామానికి చేరుకున్న తొలి ప్రభుత్వ బస్సు ఇదే.
पहली बार रोडवेज की बस गाँव में आई तो गांव वालों की खुशी का ठिकाना नहीं रहा.गांव में बस के प्रवेश करने पर ग्रामीणों ने फूल बरसाए, बस की आरती उतारी, पटाखे फोड़े और चालक-परिचालक का साफा व माला पहनाकर सम्मान किया.
राजस्थान के केकड़ी जिले में स्थित केरोट और कूरथल गांव में उत्सव का… pic.twitter.com/Azwz4CVbhw— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 6, 2026
ఈ బస్సు రాకతో సమీప పట్టణాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అంతకుముందు గ్రామస్థులు పూర్తిగా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. ఈ హృదయానికి హత్తుకునే దృశ్యాలు వైరల్‌గా మారాయి.


