breaking news
government
-
నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్‌సభలో విపక్షాల ఆగ్రహం
-
ట్రంప్ బాంబ్.. 6 వేల మంది వీసాలు రద్దు
-
30 రోజులు కస్టడీలో ఉంటే.. పీఎం, సీఎంల పదవి పోయినట్లే.. నేడు లోక్‌సభకు కీలక బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఎంతో కీలకం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల తొలగింపునకు సంబంధించిన బిల్లు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులకు సైతం వర్తిస్తుంది. ఐదేళ్లు, అంతకు మించినకాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని వరుసగా 30 రోజులు అరెస్టు అయినా లేదా కస్టడీలో ఉన్నా ఒక నెలలోపు వారు తమ పదవిని కోల్పోవలసి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. అంటే వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నత పదవుల్లోని వారు ఉంటే వారు 31వ రోజు రాజీనామా చేయాలి లేదా వారు ఆటోమేటిక్‌గా తొలగించబడతారని బిల్లు తెలిపింది.ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలు ఉన్నాయో ఇంకా వివరించనప్పటికీ, వారిపై ఆరోపించిన నేరానికి కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉండాలి. ఇది హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలను కూడా వర్తిస్తుంది. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ బిల్లు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లో కొత్త 5(A) నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది.దాని ప్రకారం ఎవరైనా మంత్రిపై ఐదేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరం చేశాడనే ఆరోపణ మేరకు అరెస్టు అయితే, లేదా కస్టడీలో ఉంటే, ప్రధానమంత్రి సలహా మేరకు ముప్పై ఒకటో రోజు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగిస్తారు. ముప్పై ఒకటో రోజులోపు రాష్ట్రపతి ప్రకటించకపోయినా, ఆ తర్వాత వచ్చే రోజు నుండి ఆటోమేటిక్‌గా వారు తొలగింపబడతారని బిల్లులో ఉంది. కాగా లోక్‌సభలో కేంద్రం రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు, జమ్మూ అండ్ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. -
విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా వాతావరణ శాఖ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవునున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని ప్రైవేట్,ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. -
ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రధాని మోదీ బంపరాఫర్
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ వినియోగించే వస్తువులపై విధించే పన్నును తగ్గించడంతో పాటు దేశంలో యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నా దేశ యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana) పేరుతో ఈ కొత్త పథకం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ కొత్త పథకం ఈ రోజు నుంచే అమలులోకి వస్తోంది. ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందుతున్న యువతకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తద్వారా ద్వారా 3.5 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రూ.15 వేలు కేంద్రం ఎలా ఇస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ. 15,000 వరకు పొందవచ్చు. రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు అర్హులు. ఆరు నెలల సర్వీస్ తర్వాత మొదటి విడత .. మరో ఆరునెలల సర్వీస్‌లో రెండో విడుత కింద అందిస్తుంది.రూ.15వేలను ఎలా డ్రా చేసుకోవచ్చుసేవింగ్స్ను ప్రోత్సహించేలా కేంద్రం అందించే రూ.15వేలులో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో నిర్ణీత కాలం వరకు ఉంచుతుంది. ఆ తర్వాత మొత్తాన్ని సదరు ఉద్యోగి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ చెల్లింపు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ఉపయోగించి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) మోడ్ ద్వారా జరుగుతాయి. -
భారత్‌కు రేటింగ్ బూస్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వ క్రమశిక్షణను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ అనుకూల పరపతి విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటూ.. భారత సార్వబౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి ‘బీబీబీ’ స్టేబుల్ అవుట్‌లుక్ (స్థిరమైన దృక్పథం)కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థను నిర్జీవమైనదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన కొన్ని రొజులకే.. ఎస్అండ్పీ తన చర్యతో అసలు నిజమేంటో నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత భారత రేటింగ్‌ను ఎస్అండ్పీ అప్‌గ్రేడ్ చేయడం గమనార్హం. 2007 జనవరిలో భారత సావరీన్ రేటింగ్‌ను బీబీబీ మైనస్ (అతి తక్కువ పెట్టుబడుల గ్రేడ్)కు తగ్గిస్తూ ఎస్అండ్పీ నిర్ణయం ప్రకటించింది. ఆ తర్వాత రేటింగ్ సవరణ మళ్లీ ఇదే. గతేడాది మే నెలలో భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి సానుకూలానికి మారుస్తూ.. వచ్చే 24 నెలల్లో రేటింగ్ అప్‌గ్రేడ్ ఉండొచ్చంటూ సంకేతం పంపింది. దీర్ఘకాల అన్సాలిసైటెడ్ (స్వచ్ఛంద) సావరీన్ క్రెడిట్ రేటింగ్స్‌ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి.. స్వల్పకాల రేటింగ్స్‌ను ఏ–3 నుంచి ఏ–2కు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అప్‌గ్రేడ్ చేసింది. దీనివల్ల భారత కంపెనీలు మరింత తక్కువ రేట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే వెసులుబాటు లభిస్తుంది. బీబీబీ అన్నది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్. తన రుణాలను సౌకర్యవంతంగానే చెల్లించగలదని ఇది సూచిస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు ‘‘ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు చూపుతున్న దేశాల్లో భారత్ ఇక ముందూ తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయాల తీరు గత ఐదారేళ్ల కాలంలో మెరుగుపడింది. అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎదుర్కోతగినదే. 50% టారిఫ్‌ల విధింపు వృద్ధిని ఏమంత కిందకు తోసేయదు. వాణిజ్య ఎగుమతులపై భారత్ తక్కువగా ఆధారపడి ఉన్నది. 60% ఆర్థిక వృద్ధి దేశీ వినియోగం రూపంలోనే ఉంటోంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వృద్ధి సరైన దిశలోనే ఉన్నందున ద్రవ్య స్థిరీకరణకు మరింత నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలని సూచించింది.ఇక ముందూ ఇదే ఒరవడి..: ఆర్థిక శాఖ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గా, చైతన్యంగా, బలంగా ఉందని రేటింగ్ అప్‌గ్రేడ్ రుజువు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు ద్రవ్య స్థిరీకరణకు భారత్ ప్రాధాన్యం ఇచి్చందని, దీని ఫలితమే రేటింగ్ అప్‌గ్రేడ్ అంటూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పేర్కొంది. చురుకైన ఈ వృద్ధిని భారత్ ఇక ముందూ కొనసాగిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలు చేపడుతుందని తెలిపింది. -
ఏపీ ప్రభుత్వ వాహనంలో టాలీవుడ్ హీరోయిన్ షికార్లు
ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అధికారులు మాత్రమే ప్రభుత్వ వాహనాల్లో తిరిగేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త డిఫరెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రీసెంట్గా పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్.. దర్జాగా ప్రభుత్వ వాహనంలో షికార్లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.ఇటీవల భీమవరంలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరైంది. అయితే ఆమె వేరే ఏ కారులో వచ్చిన పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రభుత్వ వాహనంలో దర్జాగా తిరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారని నెటిజన్లు, ప్రజలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.గత నెల 24న థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేసింది. మరో సినిమా చేయకుండా ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌పైనే ఉండిపోయింది. కానీ ఏ మాత్రం ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో చెప్పుకోదగ్గ పాత్రేం కాదు. అలానే ఫ్లాప్ కావడం కూడా ఓ రకంగా ఈమెకు మైనస్ అయిందని తెలుస్తోంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అమ్మాయిలకు ప్రభుత్వ కారులు సరఫరా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నులను ఇలా సొంత మనుషులకు వాడుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు#NidhiAgerwal #PawanKalyan #AndhraPradesh #HHVM #UANow #GovtCars pic.twitter.com/eS6ePG4zOl— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 11, 2025 -
దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్‌ను సీనియర్లు చితకబాదారు. కర్రతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. కరెంట్ వైర్‌తో షాక్ ఇచ్చేందుకు సీనియర్లు యత్నించారు.దాడి దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారంటూ అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల్ దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన 7వ తేదీన జరిగింది. -
ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులుగత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం. -
నితీశ్ సర్కారుపై కేంద్రమంత్రి చిరాన్ పాసవాన్ ఘాటు విమర్శలు
-
వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్న ట్రంప్ ప్రభుత్వం
-
Bharat Bandh: సమ్మెకు దిగిన 25 కోట్ల కార్మికులు.. ప్రజాసేవలకు విఘాతం
న్యూఢిల్లీ: ఈరోజు(బుధవారం) దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనులు, ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది.కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు దేశవ్యాప్త భారీ సమ్మెకు సిద్ధమయ్యారు. రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతుతో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ రంగాల్లో తీవ్ర ప్రభావంబ్యాంకింగ్,బీమా సేవలుపోస్టల్ కార్యకలాపాలుబొగ్గు గనులు, పారిశ్రామిక ఉత్పత్తిప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణాప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ యూనిట్లుగ్రామీణ ప్రాంతాల్లో రైతుల నిరసనలుస్వల్ప ప్రభావంపాఠశాలలు, కళాశాలలుప్రైవేట్ కార్యాలయాలురైలు సేవల్లో స్వల్ప ఆటకందేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారని ఏఐటీయూసీ నేత అమర్జీత్ కౌర్ తెలిపారు. ప్రభుత్వం తమ 17 అంశాల డిమాండ్ జాబితాను విస్మరించిందని, గత పదేళ్లలో ఒక్క వార్షిక కార్మిక సమావేశాన్ని కూడా నిర్వహించలేదని కౌర్ పేర్కొన్నారు. భారత్ బంద్ దేశవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం కలిగిస్తుందని, ముఖ్యంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ మీడియాకు తెలిపారు.సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లుఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ (CITU)హింద్ మజ్దూర్ సభ (HMS)స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)మద్దతు పలుకుతున్న సంఘాలుసంయుక్త కిసాన్ మోర్చా తదితర రైతు సంఘాలుగ్రామీణ కార్మిక సంఘాలురైల్వేలు, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఉక్కు పరిశ్రమల ప్రభుత్వ రంగ సిబ్బందిపార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కోడ్ల కారణంగా కార్మికుల హక్కులు దెబ్బతింటాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ మొదలైన విధానాలను కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి. 2020, 2022, 2024లలో జరిగిన ఈ తరహా దేశవ్యాప్త సమ్మెలలో లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం
-
మహారాష్ట్రలోని దేవేంద్ర సర్కార్ పై కొత్త వివాదం
-
జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..
న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఈరోజు(జూన్ 16) జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది(2026) అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. ఆదివారం జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తదనంతరం జనాభా లెక్కలను గణించే తేదీలను ఖరారు చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తరువాత జరుగుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న జనగనణ పలు కీలక అంశాలను వెల్లడించనుంది. 1948 జనాభా గణన చట్టం ప్రకారం దీనిని నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది.జనాభా గణన రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన (2026) ఉంటుంది. దీనిలో జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్‌ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు.దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్‌గా ఉండనుంది. ఇందుకోసం 16 భాషలలో కూడిన మొబైల్ యాప్‌లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కుల సమూహాలను కవర్ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం -
కొలంబియా తీరుపై ఎంపీ శశి థరూర్ అసంతృప్తి
-
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్ భారత కాన్సులేట్‌లో ప్రసంగించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్ పేర్కొన్నారు.పహల్గామ్లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స -
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: కంబాల దిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.వైయస్ఆర్ జిల్లా, కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.… pic.twitter.com/d7nJHV37Z6— Roja Selvamani (@RojaSelvamaniRK) May 24, 2025 -
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. అమరావతిలో నిర్మాణాల కోసం స్టీల్ ప్లాంట్ ఉక్కును విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉక్కును వదిలి వేర్వేరు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. సచివాలయం, ఐకానిక్ భవనాల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ ఉపయోగించాలని నిర్ణయించారు.స్టీల్ కోసం రాయగడ బళ్లారి తమిళనాడు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడటం అంటే పక్క రాష్ట్రాల్లో ఉక్కును కొనడమా?. స్టీల్ ప్లాంట్ ఉక్కు అమరావతి నిర్మాణాలకు పనికిరాదా? అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ఉక్కును కొనుగోలు చేస్తే స్టీల్ ప్లాట్‌కు మేలు జరుగుతుందని కార్మికులు అన్నారు. -
మావోయిస్టులపై మారణకాండ : చర్చలు జరపాలి
ప్రభుత్వం మావోయిస్టులపై జరుపుతున్న యుద్ధాన్ని, మారణకాండను చర్చల ఆధారంగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది! వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మావోయిస్టు ముప్పును నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. ప్రస్తుతం 400 మంది సాయుధ కేడర్ మాత్రమే మిగిలి ఉన్నారని, ఎక్కువ భాగం ఆయుధాలు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నామని కూడా చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే మావోయిస్టుల వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం, శాంతి భద్రతల సమస్య ఏమీ లేదు. అయినా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ సంభాషణకు సీపీఐ (మావోయిస్ట్) సంసిద్ధత వ్యక్తం చేయటం ప్రాముఖ్యాన్ని సంత రించుకుంది. దాన్ని సులభతరం చేయడానికి, చర్చల కాలంలో యుద్ధాన్ని నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. అయితే, మావోయిస్టులు ఎటువంటి షరతులు ముందుకు తేక పోతేనే బీజేపీ నేతృత్వంలోని ప్రభు త్వం చర్చలకు వెళుతుందని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అన్నారు. చర్చలలో మావోయిస్టు సమస్యకు తగిన పరి ష్కారం చూపి అమాయక ఆదివాసీల జీవనం సాఫీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించాలి.– మన్నవ హరిప్రసాద్ సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్, పొలిట్ బ్యూరో సభ్యుడు -
ఓపెన్ ఆఫర్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అంశంలో ప్రభుత్వానికి మినహాయింపు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇందుకు అనుమతించింది. స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీగా మారి్పడి చేసుకునే ప్రతిపాదన నేపథ్యంలో కంపెనీలో ప్రభుత్వ వాటా 34 శాతంపైగా పెరగనుంది. దీంతో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 49 శాతానికి చేరనుంది. అయితే ప్రజా ప్రయోజనార్ధమే ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాలో వాటాను పెంచుకుంటున్న కారణంగా ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపును ప్రకటించినట్లు సెబీ హోల్ టైమ్ సభ్యులు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి కంపెనీ మేనేజ్మెంట్ లేదా బోర్డులో చేరే యోచనలేని నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా యాజమాన్య నియంత్రణలో మార్పులకు చోటులేదని తెలియజేశారు. వెరసి ప్రభుత్వ వాటా పబ్లిక్ హోల్డింగ్‌గా పరిగణనలోకి రానున్నట్లు వెల్లడించారు. గత నెలలో ప్రభుత్వం రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 36,950 కోట్లను ఈక్విటీగా మారి్పడి చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2021 టెలికం సహాయక ప్యాకేజీలో భాగంగా బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రతిపాదించింది. -
Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్ టైమింగ్స్
బెంగళూరు,సాక్షి: మార్చి తొలి వారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కలబురగి డివిజన్లోని ఏడు జిల్లాల్లో, బెళగావి డివిజన్లోని విజయపుర, బాగల్కోట్ జిల్లాల్లో వేడిగాలుల కారణంగా 2025 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ కార్యాలయ సమయాలను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. The Karnataka government has issued an order to change the government office timings from 8 am to 1.30 pm in April and May 2025 in 7 districts of Kalaburagi division and Vijayapura and Bagalkot districts of Belagavi division due to heatwave. Earlier proposal was kept by the… pic.twitter.com/5E6CkvfvPV— ANI (@ANI) April 2, 2025 -
మత్య్సకారుల సంక్షేమానికి గత YSRCP ప్రభుత్వం కృషి
-
2025 జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తింపు
-
దక్షిణ కొరియాలో బూడిదవుతున్న 20 అడవులు
సియోల్: అమెరికాలోని అడవుల్లో కార్చిర్చు రగలిన ఉదంతాలు మరువక ముందే ఇప్పుడు దక్షిణ కొరియా(South Korea) అడవుల్లో మంటలు చెలరేగాయి. మొత్తం 20కి పైగా అడవులు మంటల గుప్పిట్లో ఉన్నాయి. ఆగ్నేయ కొరియా ద్వీపకల్పంలో వ్యాపించిన మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ భారీ అగ్నిప్రమాదాల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. దక్షిణ కొరియాలో తగలబడుతున్న అడవులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కార్చిచ్చు ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని అడవుల్లో వ్యాపించిన మంటలు అధికారులతో పాటు, స్థానికులను వణికిస్తున్నాయి. మంటలను ఆర్చేందుకు అగ్నిమాపక సిబ్బంది(Fire fighters), సహాయక సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. బలమైన గాలులు మంటలు మరింతగా వ్యాపించడానికి కారణంగా నిలుస్తున్నాయి. South Korea hit with multiple forest fires, two firefighters deadMore than 20 wildfires have flared across the country including the deadly one in the southeast of the Korean Peninsula.#SouthKorea #Wildfire pic.twitter.com/J5rVTjMiGB— DD News (@DDNewslive) March 23, 2025దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం ప్రారంభమైన మంటలు శనివారం మధ్యాహ్నం నాటికి 275 హెక్టార్ల (680 ఎకరాలు) విస్తీర్ణంలోని అడవులను దహించివేసాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 200 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సూర్యాస్తమయానికి ముందే మంటలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్-మోక్ ఆదేశించారు. దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్ని ప్రభావిత ప్రదేశాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: తరతరాలకు చెరగని ‘టాపర్ల’ చిరునామా.. -
Telangana: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను సైతం విలీనం చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 స్కై్వర్ కిలోమీటర్ల పరిధిని 12 జోన్లుగా విభజించి.. భావినగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను తొలగించి, ఫ్యూచర్‌సిటీ డెవలెప్మెంట్ అథారిటీలో విలీనం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ డెవలెప్మెంట్ అథారిటీ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్(ఆమనగల్లు) వరకు 330 ఫీట్ల రేడియల్ గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. అంతర్జాతీయ హంగులతో సుమారు 30 వేల ఎకరాల్లో కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కూడా విలీనం చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొన్ని గ్రామాల ప్రజలైతే ఏకంగా అఖిలపక్షంగా ఏర్పడి ధర్నాలకు సైతం దిగుతుండడం విశేషం. బతుకులు మారతాయనే.. ఐటీ, ఇండ్రస్టియల్ పరిశ్రమల రాకతో సమీప భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కనీస అభివృద్ధికి నోచుకోని తమ గ్రామాలను కొత్తసిటీలో కలపడం ద్వారా తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయనే ఆశ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాగా ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్‌సిటీ కోసం ఇప్పటికే 13,973 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరికొంత భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కృత్రిమమేథ (ఏఐ) సిటీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వాణిజ్య భవనం సహా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, క్రికెట్ స్టేడియం తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఇందులో చోటు కలి్పంచనుంది. ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో కొత్తగా మహేశ్వ రం మండలం రావిర్యాల గ్రామం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూసేకరణకు నోటిఫి కేషన్ జారీ చేసింది. అదనంగా తిమ్మాపూర్‌లో 600 ఎకరాలు, పంజాగూడలో 300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కన్సల్టెన్సీకి నోటిఫికేషన్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా వెళ్లే గ్రీన్ఫిల్డ్ రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఫేజ్–1లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్ పేట వరకు 19.02 కిలోమీటర్ల మేర రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఫేజ్–2లో భాగంగా మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు ఆర్ఆర్ఆర్ వరకు 22.30 కిలోమీటర్లు రూ.2,365 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న టెక్నికల్ బిడ్లను ఆహ్వానించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను నాటే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 21న టెక్నికల్ బిడ్స్ తెరవనున్నారు. తాజాగా రోడ్డు నిర్మాణ సమయంలో పనులు పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సరీ్వసులకు టెండర్లు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ⇒ మహేశ్వరం మండలంలో 31 పంచాయతీలు ఉండగా, వీటిలో హర్షగూడ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయింది. తాజాగా తుమ్మలూరు, మహబత్నగర్ను ఫోర్త్‌సిటీలో విలీనం చేశారు. ఇదే మండలం నుంచి మరికొన్ని విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి.⇒ కందుకూరు మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావుద్ గూడతండా, పెద్దమ్మతండా పంచాయతీలను సైతం ఫోర్త్‌సిటీలో కలపాలని కోరుతున్నారు. -
వేల కోట్ల అప్పులతో అమరావతి నిర్మిస్తున్న కూటమి సర్కారు
-
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేసింది.మొత్తం రూ.4 వేల కోట్ల ఆస్తుల్లో ఇళ్లు,1525ఎకరాల భూమి డాక్యుమెంట్లతో పాటు 1100 కేజీల వెండి,వెయ్యి కిలోలకుపైగా బంగారం,వజ్రాలు ఉన్నాయి.అక్రమాస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను చివరిగా తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికల దోషిగా తేలిన విషయం తెలిసిందే. అయితే శిక్ష పడేలోపే జయలలిత మరణించారు.శశికల మాత్రం ఈ కేసులో శిక్ష అనుభవించారు.తమిళనాడు ప్రభుత్వానికి అందిన వాటిలో జయలలితకు చెందిన బంగారు కిరీటమిది..జయలలిత బంగారు ఒడ్డానం..దీనిలో వజ్రాలను నెమలి ఆకారంలో పొదగడం విశేషం.ఇది జయలలితకు బహుకరించిన బంగారు కత్తి..ఇది జయలలిత రూపంతో ఉన్న బంగారు బొమ్మ.. -
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబయి:‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి డిసైడయింది.‘లవ్ జిహాద్’పై చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, లవ్ జిహాద్ ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.కాగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు.దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలొచ్చాయి.అప్పట్లో లవ్‌జిహాద్‌పై తీవ్రంగా చర్చ జరిగింది.దీంతో ఈ అంశంపై ఇటీవలే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే సూచించారు. -
వైఎస్ జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు
-
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాం
సాక్షి, అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు స్పష్టం చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.తొక్కిసలాటపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిషన్ నివేదికను గర్నవర్‌కు సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని చెప్పారు. కమిషన్ గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమవుతుందని తెలిపింది. తాను కమిషన్ ఏర్పాటును మాత్రమే అడగటంలేదని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్ చేసేలా ఆదేశాలివ్వాలని కూడా కోరానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు
హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్.. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ ఆక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందించడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామమని చెప్పారు. -
అనర్హులకు పథకాలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు. -
రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు హామీలు
-
‘సైఫ్’పై దాడి ఘటన..మంత్రి కీలక ప్రకటన
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్‌పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్‌పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట.. -
కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు: పాడి కౌశిక్ రెడ్డి
-
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్ పై పవన్ ప్రశంసలు
-
టంగ్ స్లిప్పైన కాంగ్రెస్ కార్యకర్తలు
-
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
అన్నదాతల ప్రాణాలపై కూటమి నిర్లక్ష్యం
-
తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది.పాలరాతి నిర్మాణాలుసంభాల్లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కనుగొంది. దానిని 1978లో మూసివేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ సందర్భంగా సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ సైట్లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సైట్ గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతో పాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.అత్యంత జాగ్రత్తగా తవ్వకాలుబిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈమెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.మెట్ల బావి అంటే ఏమిటి?మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్లబావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్లబావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. #WATCH | Uttar Pradesh | Visuals from the Chandausi area of Sambhal where excavation work was carried out yesterday at an age-old Baori by the Sambhal administration pic.twitter.com/ILqA8t3WPW— ANI (@ANI) December 23, 2024తీర్థయాత్రా స్థలంగా సంభాల్సంభాల్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.పాత ఫైళ్ల వెలికితీతసంభాల్కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్‌లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ, బీఆర్ఎస్ చార్జిషీట్
-
సీఎం పీఠం కోసం ఏక్నాథ్ షిండే పట్టు
-
EPFO: కొత్త రూల్.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే క్రమంలో 100 శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!మొదటి దశలో యజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు సహజ వనరులు కావని తేల్చి చెప్పింది. వీటిని ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలులేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో వివాదాస్పద అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది.ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది 1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి.. అని తీర్పును తెలియజేసింది ధర్మాసనం. ప్రైవేటు ఆస్తులను సమాజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా, లేదా అనే అంశంపైర్పు వెలువడింది. మొత్తం మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బీవీ నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసీ ఉన్నారు. వీరిలో జస్టిస్ బీసీనాగరత్న పాక్షికంగా ఏకీభవించగా..జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు. -
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
గుంటూరు జీజీహెచ్ సూపరిటెండెంట్ ఓవరాక్షన్.. సీనియర్ డాక్టర్ల ఆగ్రహం
సాక్షి,గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ ఓవరాక్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించకపోయినా తానే సూపరింటెండెంట్ అంటూ ఎస్ఎస్వీ రమణ హడావిడి చేశారు. అయితే ఎస్ఎస్వీ రమణ వ్యవహారంపై సీనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ రౌడీ షీటర్ నవీన్ చేతిలో హ త్యకు గురైన మృదుల సహానా కేసు విషయంలో ప్రభుత్వం చెప్పింది చేయలేదని కక్షగట్టి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. కిరణ్ కుమార్ స్థానంలో ఎస్ఎస్వీ రమణను జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. కొత్త సూపరింటెండెంట్ నియామకంపై డీఎంఈ.. జీజీహెచ్కీ సమాచారం ఇవ్వలేదు.రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు.ఆమెకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దారుణలపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్కు ఫిర్యాదు చేయనున్నారు.మంగళవారం మద్యాహ్నం 2గంటలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవిలు.. ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్తో భేటీ కానున్నారు.ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా జరిగిన దురాగతాల నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై వైఎస్సార్సీసీ మహిళ నేతలు జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. -
మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు సూచించారు. -
పాక్‌లో హిందూ గుడికి మోక్షం.. 64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం
ఇస్లామాబాద్: ఇస్లామిక్ దేశం పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్‌లోని నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మిస్తుండడం విశేషం.1960లోనే ఈ గుడి మూతపడింది. అయితే నరోవల్ జిల్లాలోని హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. గుడి నిర్మాణానికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిందని డాన్ పత్రిక వెల్లడించింది.ద ఎవాక్యూ ట్రస్ట్‌ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దానికి ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. బావోలీ సాహిబ్ గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్ ధర్మస్థాన్ కమిటీ అధ్యక్షుడు సావన్ చంద్ అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఆగ్రహం
-
TG: డిజిటల్ హెల్త్ కార్డులపై సివిల్ సప్లై శాఖ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్:డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా,పలు మాధ్యమాల్లో సర్య్కులేట్ అవుతున్న దరఖాస్తు అసలైనది కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.ఈ మేరకు కమిషనర్ కార్యాలయం సోమవారం(అక్టోబర్7) ఒక ప్రకటన విడుదల చేసింది.ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు డిజైన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న దరఖాస్తులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ‘హైడ్రా’ మాదిరిగా ‘నిడ్రా’ -
TGPSC ఆఫీస్ ముందు పోస్టర్ల కలకలం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు పోస్టర్లను అతికించారు.ఆ పోస్టర్లలలో తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.అంతేకాదు గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు, టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లు కనిపించాయి. పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు. -
85 ఏళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో పేలిన బాంబు.. 87 విమానాల రద్దు
టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్‌లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.తాజాగా అక్టోబర్ 2న సౌత్‌వెస్ట్ జపాన్‌లోని మియాజాకి విమానాశ్రయం రన్‌వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్‌వేని షట్‌డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్‌వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్‌వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంమియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.85ఏళ్ల క్రితం యుద్ధంరెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది. -
పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు.. హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. అక్రమ నిర్మాణాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని హై కోర్టు చెప్పిందని అన్నారు. పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదని తెలిపారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. గత ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నాం. అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు కట్టినవాటి విషయంలో ఆయా శాఖలు స్పందిస్తాయి.నిరుపేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సీరియస్
-
ఆప్ మద్దతు లేకుండా కుదరదు: హర్యానా ఎన్నికలపై కేజ్రీవాల్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మద్దతు లేకుండా హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు కాదని అన్నారు.శుక్రవారం జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్ గుజ్జర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ అధినేత.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాషాయ పాలకులు అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు, . ఈసారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు.‘హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఆప్ మద్దతుతోనే సాధ్యమవుతుంది. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుంది. తమ పార్టీ తోడ్పాటు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంటుంది’ అని రోడ్‌షోలో పార్టీ మద్దతుదారులను ఉద్ధేశించి పేర్కొన్నారు.‘కేజ్రీవాల్ నిజాయితీ లేని వ్యక్తి అని ప్రజలు అనుకుంటే, నాకు ఓటు వేయకండి. నీ నేను మీరు వారు నమ్మితే, అప్పుడు మాత్రమే నాకు ఓటు వేయండి., ఢిల్లీ ప్రజలు నన్ను తిరిగి ఎన్నుకున్న తర్వాతే తిరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. నేను అనుకుంటే సీఎం సీటులో ఉండిపోగలను. కానీ నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ప్రజలే నిర్ణయించుకుంటారు. ఏ నాయకుడూ ఈ స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించలేదని నేను భావిస్తున్నాను’ అని కేజ్రీవాల్ తెలిపారు.చదవండి: జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎజవాన్ల మృతిఇదిలా ఉండగా 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానాలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటిటోపాటు , ఆప్, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 31, జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్, ఆప్ పొత్తుతో బరిలోకి దిగాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. వేర్వేరుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాలను ఆదేశించింది.దేశంలోని ప్రేవేటు స్థలాల్లో అనధికారిక బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిలిపివేయాలని తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల ఇప్పటికే కూల్చివేసేందుకు ప్రక్రియ పూర్తయిన పనులు ప్రభావితం కావచ్చని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయగా.. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఆపడం వల్ల.. స్వర్గమేమి ఊడిపడదంటూ (పెద్ద నష్టం ఏం జరగదని) జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, చెరువులు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. వీటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.‘తదుపరి తేదీ వరకు ఈ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూదు. అయితే బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలకు ఈ ఉత్తర్వులు వర్తించవు’ అని కోర్టు స్పష్టం చేసింది.కాగా వివిధ నేరాలకు పాల్పడిన నిందితుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కూల్చివేత డ్రైవ్‌లను సవాలు చేస్తూ దాఖలైన వరుస పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజా ఉత్తర్వులు వెలువరించింది.అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. వరుసగా జమ్మూ కశ్మీర్, హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్‌కు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. -
పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన
-
మీకూ ఇదే గతి.. జగన్ వార్నింగ్
-
సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్
-
కూటమి రాజకీయ కక్ష.. అటకెక్కనున్న CBSE
-
ఏఐ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : ఏఐ ఆధారిత రంగాల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండ్రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టాం. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల్లో నిష్ణాతులైన నిపుణులకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అందరికి అవకాశం ఇస్తున్నాం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.రెండ్రోజుల ఏఐ సదస్సుఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును ఇవాళ, రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తోంది.Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in the Inauguration of AI Global Summit 2024 at HICC, Hyderabad https://t.co/QNTBD3RqRf— Telangana CMO (@TelanganaCMO) September 5, 2024 -
Canada: ట్రూడో ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ..
కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో కీలక మిత్రపక్షం జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ట్రూడో లిబరల్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది.ఈ మేరకు న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.. ‘ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ తేలికగా విజయం సాధిస్తుందని చూపుతున్నాయి. అయినప్పటికీ ప్రధాని ట్రూడో దీనిని గ్రహించలేకపోతున్నారు. ట్రూడో ప్రతీసారి కార్పొరేట్ దురాశకు గురవుతున్నారని పదే పదే రుజవవుతోంది. లిబరల్ పార్టీ నేతలను ప్రజలను నిరాశపరిచారు. కెనడియన్లు వారికి మరో అవకాశం ఇవ్వరు.ఒప్పందం పూర్తయింది. లిబరల్ నేతలు చాలా బలహీనంగా ఉన్నారు, చాలా స్వార్థపరులు. ప్రజల కోసం పోరాడాల్సింది పోయి కన్జర్వేటివ్‌లను, వారి ప్రణాళికలను అడ్డుకునేందుకు కార్పొరేట్ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తోంది ఈ ప్రభుత్వం. ఇక్కడ పెద్ద కంపెనీలు, వాటి సీఈవీలతో ప్రభుత్వం పనిచేస్తుంది.. పేద ప్రజల నుంచి సొమ్మును దోచి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోంది. వారు ప్రజలను నిరాశపరిచారు. కానీ ఇది ప్రజల సమయం. భవిష్యత్తులో పెద్ద యుద్ధం జరగబోతుంది. ఎన్డీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు.అయితే 2025 వరకు ట్రూడోకు తమ మద్దతు ఉంటుందని ఎన్డీపీ ఒప్పందం చేసుకుంది. కానీ వచ్చే ఎన్నికల్లో ట్రూడో పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతుండటంతో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2015 నుంచి కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో కొనసాగుతున్నారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్నప్పటికీ ట్రూడోకు తక్షణ ప్రమాదం ఏం లేదు. ప్రధాని పదవీవిరమణ చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాల్సిన రిస్క్ కూడా లేదు. కానీ ట్రూడో బడ్జెట్లను ఆమోదించాలంటే విశ్వాస ఓట్లను తట్టుకుని నిలబడాలంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్లోని ఇతర ప్రతిపక్ష శాసనసభ్యుల నుంచి మద్దతు సంపాదించాల్సి ఉంటుంది. The deal is done. The Liberals are too weak, too selfish and too beholden to corporate interests to stop the Conservatives and their plans to cut. But the NDP can. Big corporations and CEOs have had their governments. It's the people's time. pic.twitter.com/BsE9zT0CwF— Jagmeet Singh (@theJagmeetSingh) September 4, 2024 -
బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ప్రశాంత్ కిశోర్
పట్నా: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో బీహార్‌లో ప్రభుత్వాన్ని తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కూడా తమ పార్టీకి చెందినవారేనని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన్ సూరజ్‌తో బరిలోకి దిగనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వర్గానికి చెందిన 40 మందిని అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పోరాటం ఆర్జేడీతో కాదని ఎన్డేతోనేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'వక్ఫ్ సవరణ బిల్లు-2024'ను లోక్‌సభలో ప్రవేశపెట్టారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనికి మద్దతు తెలిపారన్నారు.తమ లాంటివారు రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని, జేపీసీలో చర్చ జరుగుతోందన్నారు. అయితే భవిష్యత్‌లో నితీష్ కుమార్ తిరిగి మహాకూటమిలోకి వస్తారని, ముస్లింల గురించి మాట్లాడే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలను వీటన్నింటినీ గమనిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. -
వరద బీభత్సం: వాలంటీర్లు లేక ప్రజల అష్టకష్టాలు
సాక్షి,విజయవాడ: ఏపీలో వాలంటీర్లు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాలంటీర్ల సేవలు లేక రాష్ట్రంలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. తుపాన్లు, వరదల సమయంలో బాధితులకు గతంలో వాలంటీర్లు అండగా నిలిచేవారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం అందుబాటులో ఉన్న వాలంటీర్లను కూడా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వినియోగించడం లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు తమకు సమస్యలు లేవని బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో విపత్తుల వేల వాలంటీర్లు విస్తృతంగా సేవలందించారని చెబుతున్నారు. వాలంటీర్లపై కక్ష ప్రజలకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి.. గన్మెన్ల సరెండర్
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్‌కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్‌బాబు సిఫారసు చేశారు. రమేష్‌బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్‌కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
బాబు మళ్లీ ఫెయిల్..
-
ప్రపంచాన్ని వణికిస్తున్న దోమలు
ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తుంటారు. ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు.వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తుందని 1897లో శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది. ప్రపంచ దోమల దినోత్సవం- 2024ను ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.దోమల నివారణకు కలుషితమైన నీటి వినియోగాన్ని నివారించాలి. దోమలు తేమగా ఉండే ప్రదేశాలలోను, నీరు నిలిచే ప్రదేశాలలోను త్వరగా వృద్ధి చెందుతాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు లాంటివి వినియోగించడం ఉత్తమం.వర్షాకాలంలో దోమల్ని తరిమికొట్టే చిట్కాలు -
పాకిస్తాన్లో మంకీపాక్స్ వ్యాప్తి.. అప్రమత్తమైన ప్రభుత్వం
పాకిస్తాన్లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదైన నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రజలు మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.పాక్ ప్రధాని ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఒక మంకీపాక్స్ వ్యాధి కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారందరికీ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే, దేశంలోకి ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండాలని హెల్త్ కోఆర్డినేటర్ అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి 10 నుంచి 15 రోజులు పడుతుందన్నారు. బాధితుడిని క్వారంటైన్లో ఉంచడం మంచిదని సూచించారు. -
అసలు దోషులను తప్పిస్తున్నారు..
-
సీబీఐ చేతికి బాబు కేసులు?
-
అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానిది కొత్త రికార్డు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది వరకు 5వేల900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న "మార్పు" అని బుధవారం(ఆగస్టు14) ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు.‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ చురకంటించారు. -
కారణాల్లేకుండా ఎలా తిరస్కరిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కోర్సుల విలీనం దరఖాస్తులను ఎలాంటి కారణాలు చూపకుండా ఎలా తిరస్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ దరఖాస్తులను పరిశీలించి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండకూడదని స్పష్టం చేసింది. కాలేజీ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడం జాప్యమైతే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లోనూ మార్పులు చేయొచ్చని వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్న సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేసింది. అలాగే దరఖాస్తులను తిరస్కరిస్తూ జూలై 26న ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కచ్చితమైన కారణాలను వెల్లడించాలని చెప్పింది. బీటెక్/బీఈలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం సర్కార్‌దేనని తీర్పునిచ్చారు. రీయింబర్స్మెంట్ సాకు సరికాదు..సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పలు కాలేజీలు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, ఎస్.శ్రీరామ్, శ్రీరఘురామ్, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తిరస్కరించడం సరికాదు.అధ్యాపకులు, ఇతర వసతులు లాంటి అన్ని అంశాలను ఏఐసీటీఈ నిపుణుల తనిఖీ కమిటీ పరిశీలించింది. పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకు అనుమతి కోరుతున్నాం. దీంతో ఒక్క సీటు కూడా అదనంగా పెరగడం లేదు. ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్మెంట్ భారం అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎలాంటి కారణం చెప్పకుండానే అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరాకరించారు’ అని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. కాలేజీలు కోరిన విధంగా సీట్లు పెంచుకుంటూపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. సీట్ల పెంపు, విలీనంపై నిర్ణయం తీసుకునే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని కోర్సుల్లో ఇప్పటికీ చాలా ఖాళీ సీట్లు ఉన్నాయి. ఇంకా పెంచాలని కోరడం సరికాదు. అప్పీళ్లను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం పేర్కొన్న కీలక అంశాలు‘అప్పీల్ చేసిన కాలేజీలకు తిరస్కరించి, మరికొన్ని కాలేజీలకు అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం. విద్యా చట్టంలోని సెక్షన్ 20ను పరిశీలించిన సింగిల్ జడ్జి.. దరఖాస్తుల తిరస్కరణ అధికారం ప్రభుత్వానికి ఉందని అభిప్రా యపడ్డారు. కొన్ని విద్యాసంస్థలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చినట్లయితే.. అదే తప్పును పునరావృతం చేయడానికి దాన్ని కారణంగా పేర్కొనవద్దు. అధికారుల నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఇచ్చిన ఆమోదాన్ని ఎందుకు రద్దు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. చట్టప్రకారం ప్రతి కాలేజీ దరఖాస్తును పరిశీలించాలి. కానీ, అధికారులు అలా వ్యవహరించలేదు. జూలై 26న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటులో సింగిల్ జడ్జి పొరపడ్డారు. అందువల్ల కాలేజీల దరఖాస్తులను తిరస్కరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేస్తున్నాం’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. -
ప్రైవేటుపరం..! బాబు, పవన్ వాటాలు బయటపడ్డ నిజాలు
-
కుక్కలదాడి ఘటనలపై హరీశ్‌రావు కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడి ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు 10) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం వెంటనే కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000
జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కారు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం నూతన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. -
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
Sri Lanka: ముస్లింలకు క్షమాపణ చెప్పిన శ్రీలంక
కోవిడ్ సమయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకు శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా వారికి క్షమాపణలు చెప్పింది. కరోనా బారినపడి మృతి చెందిన ముస్లింలను బలవంతంగా దహనం చేసినందుకు తమను క్షమించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగబోవని ప్రభుత్వం ముస్లింలకు భరోసా ఇచ్చింది.భవిష్యత్తులో ముస్లింలు లేదా మరే ఇతర కమ్యూనిటీ ప్రజలు అనుసరించే అంత్యక్రియల ఆచారాల విషయంలో ఉల్లంఘన జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఖననం లేదా దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కొత్త చట్టం హామీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక సభలోని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. దేశ జనాభాలో ముస్లిం జనాభా 10 శాతం అని, కోవిడ్ కాలంలో జరిగిన ఘటనలపై ముస్లింలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.కోవిడ్ కాలంలో శ్రీలంక ప్రభుత్వం కరోనా మృతులను ఖననం చేసేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా విమర్శించింది. ముస్లింలు, కాథలిక్కులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. -
లోకల్ కోటా దుమారం..
-
రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి
-
వైఎస్ జగన్ చొరవతో ఏపీలో పెట్టుబడుల ప్రవాహం
-
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్‌ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పార్లమెంట్ రౌండప్.. విపక్షాల వాకౌట్
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారం(జులై 3)తో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. విపక్షాల వాకౌట్‌పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను విడిచి వెళ్లారన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్నితిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభ మంగళవారమే నిరవధిక వాయిదా పడటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది. కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల దాడి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మరోసారి కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి పవర్లోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. మళ్లీ తామే అధికారంలోకి రావడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను మూడోవంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు.. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. తమ పాలనలో కేవలం మూడవ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయిందన్నారు.ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థవృద్ధిలో భారత్‌ను ప్రపంచంలో పది నుంచి ఐదో స్థానానాకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుస్తామని ప్రధాని చెప్పారు. మణిపూర్, నీట్‌లపై స్పందించిన ప్రధాని..మణిపూర్, నీట్ అంశాలపై సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో ప్రధాని రాజ్యసభలో ఈ అంశాలపై స్పందించారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీపైనా ప్రధాని మాట్లాడారు. నీట్లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుధామూర్తికి ప్రశంసలు..దాత, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై ప్రధాని బుధవారం సభలో ప్రశంసలు కురిపించారు. సుధామూర్తి దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి విలువైన సూచనలిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో మహిళల కోసం ఎన్నో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. -
డిజిటల్ సమాచారం తొలగింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను ఆ లేఖలో కేటీఆర్ జత చేశారు. సీఎంగా కేసీఆర్ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్ 2014 – డిసెంబర్ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
TG: ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం(జులై1) బదిలీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయలను ప్రభుత్వం నియమించింది. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ప్రభుత్వోద్యోగుల వార్నింగ్..
-
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్‌లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్‌లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్‌గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
Israel: ప్రజా ఆందోళనలు.. ముందస్తు ఎన్నికలకు డిమాండ్
ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.ఇజ్రాయెల్‌లోని కప్లాన్ స్ట్రీట్‌లో ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్మాన్ ఈ ఆందోళనల్లో పాల్గొని, దేశం కోసం ప్రజలంతా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిన్ బెట్ మాజీ అధిపతి యువల్ డిస్కిన్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ‘దేశ చరిత్రలో అత్యంత చెత్త , విజయవంతం కాని ప్రధాన మంత్రి’ అని పేర్కొన్నారు. వెంటనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిస్కిన్ 2005 నుండి 2011 వరకు షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షునిగా పనిచేశారు. అధికార లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటిన్స్కీ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే నినాదాలు కలిగిన బ్యానర్లు పట్టుకున్నారు. మరికొందరు గాజాలో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ర్యాలీ అనంతరం పలువురు ఆందోళనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనాల టైర్లను తగులబెట్టారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం మౌంటెడ్ పోలీసు సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. హమాస్ చేతిలో బందీలైనవారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్‌లో నిరసన కవాతు నిర్వహించారు. -
టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది- కొండా రాజీవ్
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ప్రారంభించిన ఎన్డీయే సర్కారు
-
పెరగనున్న చక్కెర ధర
ఇకపై తీపి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల మధ్య చక్కెర మిల్లల నిర్వహణ వాటి యజమానులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు కనీసం రూ. 42కి పెంచాలని నేషనల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్)ప్రభుత్వాన్ని కోరింది.మరోవైపు అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే 2024-25 సీజన్‌కు చక్కెర కనీస అమ్మకపు ధర (ఎంఎస్పీ) ను పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చక్కెర ధరను పెంచినట్లయితే, దాని ప్రభావం రిటైల్ మార్కెట్లో కనిపిస్తుంది. దీంతో చక్కెర ధర పెరిగేందుకు అవకాశముంది. చక్కెర ధర కిలోకు రూ.3 నుంచి 4 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.2019 నుండి చెరకు కనీస అమ్మకపు ధర కిలోకు రూ. 31 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరకు రైతులకు చెల్లించే న్యాయమైన,లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని పెంచింది. ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చెరకు కనీస అమ్మకపు ధరను సర్దుబాటు చేయడం అవసరమని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.42కి పెంచితే చక్కెర పరిశ్రమ లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. -
పదవుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు
-
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
తెలంగాణ రాష్ట్ర గీతం ఖరారు
-
సమస్యల వలయంలో తెలంగాణ ప్రభుత్వం
-
అధికారిక రాజముద్రను ఖరారు చేసిన సీఎం రేవంత్ సర్కార్
-
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ. 2.1 లక్షల కోట్లను అత్యధిక మిగులును చెల్లించనుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.87,420 కోట్లతో పోలిస్తే ఈసారి రెండితలు కన్నా అధికం. రికార్డ్ మొత్తంలో ఆర్బీఐ చెల్లించనున్న డివిడెండ్ ప్రభుత్వం తన బడ్జెట్ లోటు లక్ష్యమైన 5.1 శాతం జీడీపీని చేరుకోవడంలో సహాయపడుతుంది.ఆర్బీఐ చెల్లించనున్న డివిడెంట్‌తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చనుంది. దీంతో ప్రభుత్వం వివిధ అంశాలల్లో గణనీయమైన ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం కలగనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే రుసుము, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం నుంచి ఆర్బీఐ ఏటా డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం(మే19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రైసీ మృతి పట్ల చాలా దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇందులో భాగంగా రైసీకి గౌరవ సూచకంగా భారత్ మంగళవారం (మే 21) సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా ఖొమేనీ కన్నుమూసినపుడు కూడా భారత్ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించింది. -
51 ఏళ్ల వయసులో మరోసారి ప్రభుత్వ ఉద్యోగం!
రాజేంద్ర సింగ్.. మొదట భారత ఆర్మీలో సైనికుడు. తరువాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు బ్యాంకులో క్లర్కు. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు.వయసు మీదపడ్డాక మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణగఢ్ పట్టణంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రాజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులలోని ఐదుగురు భారతీయ సైన్యంలో చేరారని, మొదట తన తండ్రి, తరువాత ముగ్గురు సోదరులు, ఇప్పుడు తన పెద్ద కుమారుడు సైన్యంలో చేరారన్నారు.ఇండియన్ ఆర్మీలో 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాత 2014లో ఎస్బీఐ లక్ష్మణ్‌గఢ్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఆల్వార్ అండ్ సికార్ జోన్‌లోని బ్యాంకులో క్లర్క్ పోస్ట్ దక్కించుకున్నారు. ఇందుకు నిర్వహించిన పోటీ పరీక్షలో రాజస్థాన్‌లో నాల్గవ ర్యాంక్ సాధించారు.సైన్యం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాజేంద్ర సింగ్ తన భార్య అమృతా దేవి ప్రోత్సాహంతో 51 ఏళ్ల వయస్సులో మరోమారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇందుకోసం ఎస్బిఐ నిర్వహించిన పోటీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని రాజేంద్ర సింగ్ తెలిపారు. రాజేంద్ర సింగ్ 1991లో భారత సైన్యంలో సైనికుడిగా నియమితులయ్యారు. సైన్యంలో 18 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత 2009లో హవల్దార్ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2014లో ఎస్బీఐలో గార్డ్‌గా నియమితులయ్యారు. 2024, మార్చి 28న జరిగిన ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. రాజేంద్ర సింగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితేష్ బీఎస్ఎఫ్లో సైనికుడు. చిన్న కుమారుడు కార్తీక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. -
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
2024 లోక్‌సభ ఎన్నికల మూడు దశలు ఇప్పటికీ ముగిశాయి. మిగిలిన నాలుగు దశల ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో పంజాబ్‌లోని భఠిండా లోక్ సభ స్థానంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఈ స్థానం నుంచి ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు బీజేపీ టికెట్ ఇచ్చింది.ఈ నేపధ్యంలో ఆమె రాజీనామాను కేంద్ర సిబ్బంది శాఖ ఆమోదించింది. అయితే పంజాబ్ ప్రభుత్వం ఆమెకు మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఉద్యోగంలో కొనసాగాలని కోరింది. అయితే పరమ్‌పల్ కౌర్ ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ తాను ఖచ్చితంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.తనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసిందని, జూన్ ఒకటిన పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తాను రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెబుతానని ఆమె తెలిపారు. తనకు నోటీసు పంపించి, ఆప్ ప్రభుత్వం సమయాన్ని వృథా చేసుకుంటున్నదని ఆమె ఆరోపించారు. రిటైర్మెంట్ తర్వాత ఏమి చేయాలన్నది తన ఇష్టమని ఆమె పేర్కొన్నారు.పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు పంపిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం రూల్ 16 (2) ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించలేమని, అందుకే వీఆర్ఎస్ ఆమోదించడానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేమని పేర్కొంది. ఆమెను రిటైర్డ్‌గా పరిగణించలేమని, ఆమె వెంటనే విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
Lok sabha elections 2024: ఉగ్రవాదులకు చావుదెబ్బ: మోదీ
రిషికేశ్/జైపూర్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావుదెబ్బ తిన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముష్కర మూకలను మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. ఫీర్ ఏక్ భార్ మోదీ సర్కారు(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో, రాజస్తాన్‌లోని కరౌలీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కేంద్రంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని, అందుకే వారంతా తనను దూషిస్తున్నారని ఆక్షేపించారు. -
సకల సౌకర్యాలతో అభివృద్ధిపథంలో నందిగామ
-
విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్ రౌత్
ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి ఎక్కడుందో వెతికారు. దారావీ స్లమ్ ఏరియా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్ చెప్పారు. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు -
ఆ లోక్‌సభ సీటులో విజయం.. కేంద్రంలో అధికారం?
దేశ రాజధాని ఢిల్లీలోని ఆ లోక్‌సభ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారో వారే కేంద్రంలో అధికారం చేపడతారట. కొన్నాళ్లుగా ఇలానే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ ఈ స్థానం. 2009 పార్లమెంట్ ఎన్నికలకు కొంతకాలం ముందు ఈ సీటు ఉనికిలోకి వచ్చింది. ఈ స్థానంపై ఇప్పటి వరకు మూడు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో ఎన్నికలకు ఈ స్థానం ఎదురు చూస్తోంది. ఈ సీటుకు సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఈ సీటును గెలుచుకున్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2014, 2019లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలబెట్టడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే ఈసారి బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కమల్జిత్ సెహ్రావత్, కాంగ్రెస్ మద్దతు కలిగిన ఆప్ నేత మహాబల్ మిశ్రా మధ్య గట్టిపోటీ నెలకొంది. 2014లో ఆప్ రెండో స్థానంలో ఉండగా, 2019లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని బీజేపీ రెండుసార్లు సొంతం చేసుకుంది. 2014లో బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 2.68 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి బీజేపీ వర్మకు టికెట్ కేటాయించలేదు. బీజేపీకి చెందిన సెహ్రావత్‌కు ఇవి మొదటి లోక్‌సభ ఎన్నికలు. ఒకవేళ సెహ్రావత్ ఎన్నికైతే ఆమె ఈ స్థానానికి తొలి మహిళా ఎంపీ అవుతారు. పశ్చిమ ఢిల్లీ 24.88 లక్షల మంది ఓటర్లు కలిగిన అతిపెద్ద లోక్‌సభ స్థానం. దేశ రాజధాని ఓటర్లలో ఇది దాదాపు 17 శాతం. ఇందులో 13.27 లక్షల మంది పురుషులు, 11.61 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి. -
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
Babu - Ramoji : బిల్లీ కేసులో కళ్లు మూసుకున్న పిల్లి
మోసాల చంద్రబాబునీ, ఆయన మీసాలొత్తే రామోజీరావును ఎన్ని ఏనుగులను కట్టీ విడదీయలేం. నీతిమాలిన అవిభాజ్య కవలలు వాళ్లిద్దరూ! కుటిల రాజకీయాల అవిభక్త కుటుంబ వ్యాపారం వాళ్లిద్దరిదీ చంద్రబాబుపై ఎవరైనా కేసు వేస్తే.. కే సు వేసినవాళ్లే దొంగలు, దోషులు అని నిస్సిగ్గుగా ఒంటిమీద రాసుకుని తిరుగుతారు రామోజీ. చంద్రబాబు ‘దోషి’ అని స్వయంగా కోర్టే తీర్పు ఇచ్చినా.. కోర్టును తప్పుదారి పట్టించారని కూడా అసత్యాలను ప్రచారం చేయగలరు రామోజీ! ‘‘850 ఎకరాల స్కామ్‌లో చంద్రబాబుకు హైకోర్టు షాక్’’ అన్నది తాజా వార్త. ‘‘చంద్రుడిపై స్కామ్ మచ్చ’’ అనేది రామోజీ పెట్టే తిరగమోత! బాబుపై ఈగను వాలనివ్వని రామోజీ.. ఇంగితం లాంటి అంగీనైనా జారవిడుచుకుంటాడు కానీ.. కోర్టు షాకిచ్చిందంటే ఒప్పకుంటాడా? బాబుని సమర్థించటం మానుకుంటాడా? విషయం ఏంటంటే.? చంద్రబాబు తన హయాంలో ఒక సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన కోర్టు తీర్పొకటి 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు (2024 మార్చి 7) వెలువడింది. 2004 మే నెలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను ఈ తీర్పులో తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయమై తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. విపరీతం ఏంటంటే.? చంద్రబాబు కొమ్ము కాస్తున్న రామోజీరావుకు ఇదొక వార్తగా కనిపించకపోవటం! ఆ స్థానంలో అదే కోర్టు ఇచ్చిన ఇంకో వార్తతో చంద్రబాబు స్కామ్ నుంచి తెలుగు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు రామోజీ! ‘‘ఎమ్మెల్సీల నియామకంలో ప్రభుత్వానికి చుక్కెదురు’’ అనేదే ఆ వార్త. సరే, చంద్రబాబు గురించీ, రామోజీ గురించి, వారిద్దరి మధ్య ఉన్న బలీయమైన అనుబంధం గురించి తెలియంది ఎవరికి? కనుక బాబు గారికీ, బిల్లీ రావుగారికి మధ్య ఉన్న బాంధవ్యం ఏమిటో కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి చూద్దాం. 1995 ఏపీ రాజకీయాల్లోని ముఖ్య ఘట్టం.. మామ గారికి అల్లుడు గారు పొడిచిన వెన్నుపోటు. ఆ సమయంలో చంద్రబాబుకు పరిచయమైన వ్యక్తే బిల్లీ రావు. ఉరఫ్ అహోబిల రావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చేసిన పని.. బిల్లీకి ‘కుప్పం’ ప్రాజెక్టును కట్టబెట్టటం! బిల్లీది కృష్ణా జిల్లాలోని కొండపల్లి. మద్రాస్ ఐఐటీలో చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. అమెరికా చదువు పూర్తవగానే తిరిగి ఇండియా వచ్చేశారు. బిల్లీ రావుకు తెలియంది లేదు అన్నట్లే ఉంటాయి ఆయన మాటలు. 1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే, సరిగ్గా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్న సమయంలోనే బాబుకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి బంధం బలపడుతూ వచ్చింది. వివిధ దేశాల్లో విస్త్రృతంగా పర్యటించటం, పెద్దపెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం బిల్లీ హాబీ. ఇదే క్రమంలో ఈయనకు ఫ్లోరిడాలోని ఐఎంజీ యాజమాన్యమైన మార్క్ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూక్రీగర్ పరిచయమయ్యాడు. బాబుకు క్రీగర్‌ను పరిచయం చేసి... ఆయన్ను ఐఎంజీబీ (ఇండియా) కంపెనీకి నామమాత్రపు చైర్మన్ గా చేసి... బాబు– బిల్లీ ఇద్దరూ చక్రం తిప్పారు. ఐఎంజీబీకి భూములు దక్కాక... క్రీగర్‌ను నేరస్తుడనే ముద్ర వేసి కంపెనీ నుంచి తొలగించటంతో ఆయన బిల్లీపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ బిల్లీ–బాబుల బంధం, బలం తెలిశాక తప్పుకున్నారు. ఇజ్రాయెల్ పేరిట కుప్పంలోను, అమెరికా పేరిట ఐఎంజీని సృష్టించి హైదరాబాద్‌లోను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పథకం వేసిన వారు చంద్రబాబు–బిల్లీ రావు. కేబినెట్ అనుమతి లేకుండా... అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీకి భూములు కట్టబెట్టిన చంద్రబాబును నేడు కోర్టు తప్పు పట్టిందంటే పట్టదా? అయినా గానీ రామోజీకి చీమ కుట్టినట్లయినా ఉండదా?! తప్పించుకున్న సీబీఐ! ఐఎంజీ కుంభకోణం బయటపడ్డాక.. ఒప్పందాన్ని రద్దు చేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం.. 2007లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో విడుదల చేసింది. కానీ సీబీఐ మాత్రం దీనిపై దర్యాప్తు జరపడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు! చంద్రబాబును దోషిగా రుజువు చేసేందుకు సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఆయన్ను విచారించడానికి గానీ, అరెస్టు చెయ్యటానికి గానీ సీబీఐ ముందుకెళ్లలేదు. ‘‘మా దగ్గర తగినంత సిబ్బంది లేరు. తగిన వనరులు లేవు. అందుకని దర్యాప్తు జరపలేం’’ అని ప్రభుత్వానికి సమాధానమిచ్చి తప్పించుకుంది. విచిత్రమేంటంటే... అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇంఛార్జిగా ఉన్నది జగన్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన వి.వి.లక్ష్మీనారాయణే!. అసలు ఆయనకు బాబుపై ఎందుకు అంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా... దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం చేశారు? సమాధానం లేని ప్రశ్నలైతే కావు. తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే... ఈ వ్యవస్థెందుకు? ఈ దర్యాప్తు సంస్థలెందుకు? కుప్పం ప్రాజెక్టు కథేంటి?! బిల్లీకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో... ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రాజెక్టును మొదట అప్పగించారు. అది ఘోరంగా విఫలం అయింది. కుప్పంలో 9,572 ఎకరాల్లో ఇజ్రాయెల్ తరహా సేద్యాన్ని అమలు చేసి... రెండోదశలో రంగారెడ్డి జిల్లాలో అమలు చేసి... ఆ తర్వాత దాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని 1997లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను బిల్లీ, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ ప్యాట్రావుకు చెందిన ‘బీహెచ్‌సీ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించేశారు చంద్రబాబు. సేద్యంలో ఇజ్రాయెల్ తరహా విప్లవాన్ని తెస్తామని, ఆకాశాన్ని కిందికి దించుతామని రకరకాల డప్పులు వాయించింది ఈ కంపెనీ. ఆ డప్పుల చప్పుడును రాష్ట్రమంతటికీ వినిపించేలా – రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోబోతోందంటూ – ఊదరగొట్టించేశారు రామోజీరావు. కానీ కుప్పంలో మాత్రం పరిస్థితి అడ్డం తిరిగింది. ఆ ప్రాజెక్టుకు రూ.19 కోట్లు ఖర్చుచేశారు. దీన్లో కొంత టెక్నాలజీకి, కొంత మౌలిక సదుపాయాలకు, మరికొంత యంత్రాలకు అంటూ మొత్తం బిల్లీ చేతిలో పోసేశారు. ప్రాజెక్టు కోసమని రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూముల్లో సరిహద్దులను మళ్లీ గుర్తించలేనంతగా చెరిపేశారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేశారు. దాంతో చుట్టుపక్కల భూముల్లో కూడా భూసారం నాశనమైపోయింది. చుట్టుపక్కల రైతులు అప్పటిదాకా 200 అడుగుల బోర్లు వేస్తే... ఈ భూముల్లో ఏకంగా 600 అడుగుల లోతున బోర్లు వేయవలసి వచ్చింది. దీంతో చుట్టూ ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు బోరుమన్నారు. ఎకరానికి రూ.30,000– 50,000 వరకూ ఫలసాయం అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసినా... ఎకరాకు రూ.3 నుంచి 5 వేలు కూడా దిగుబడి సాధించలేకపోయారు. ఈ వైఫల్యాల గురించి కూడా రామోజీరావు ఒక్క మాటా రాయలేదు! ఆయన నాడూ అంతే, ఈనాడూ అంతే.. ఏనాడూ అంతే. బిల్లీ, బాబుల ఆలింగనం కంటే కూడా గాఢమైనది రామోజీ, చంద్రబాబుల పరిష్వంగనం. -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
ఢిల్లీ బడ్జెట్: మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక
దేశరాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా ‘అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. #WATCH | Delhi Finance Minister Atishi reaches the Vidhan Sabha ahead of the Budget presentation. pic.twitter.com/73fBsKG9a9 — ANI (@ANI) March 4, 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించాం’ అని అన్నారు. #DelhiBudget | "In 2014, the per capita income of Delhi was Rs 2.47 lakhs and today the per capita income of Delhi has reached 4.62 lakhs which is two and a half times more than the national average...Today, I am going to present a budget of Rs 76,000 crores," says Delhi Finance… pic.twitter.com/RMjQlA9EMA — The Times Of India (@timesofindia) March 4, 2024 ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి అతిషి ప్రతిపాదించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్లో ఉత్తీర్ణత సాధించగా, 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. -
ఈవీలకు ప్రత్యేక మీటర్.. విద్యుత్ కనెక్షన్లలో కీలక మార్పులు!
దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్‌టాప్ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులొస్తే అదనపు మీటర్ వినియోగదారులు మీటర్ రీడింగ్‌లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్‌ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు. కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్‌దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
భారతదేశంలోని ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. ‘ఆధార్’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే, పిల్లలకు ఐదేళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్లో నాలుగైదు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్ పాత్రలేఖ్, బన్నా గుప్తా, రామేశ్వర్ ఓరాన్ సహా మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూషణ్ బడా, దీపికా పాండే, రామచంద్ర సింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం. మంత్రి పదవికి భూషణ్ బడా, దీపికా పాండే పేర్లు దాదాపు ఖాయమని, రామచంద్ర సింగ్ లేదా ప్రదీప్ యాదవ్ పేర్లపై చర్చ జరగుతోంది. బసంత్ సోరెన్ 2020లో జరిగిన దుమ్కా ఉపఎన్నికల్లో విజయం సాధించి, మొదటిసారి అసెంబ్లీకి చేరుకోగా, అతని పెద్ద కోడలు సీతా సోరెన్ జామా నుండి మూడవసారి ఎన్నికయ్యారు. జేఎంఎంలో హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, కోడలు సీతా సోరెన్లలో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ లేదా మరేదైనా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా సోరెన్‌కు మంత్రి హోదా ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. -
డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తాం..
-
కొత్తగా 59 వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం
గడచిన ఏడాది అంటే 2023లో 59 వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం దక్కింది. తాజాగా ‘అమెరికా పౌరసత్వం- 2023’ నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2023లో అమెరికా 59,000 మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది. అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటి స్థానంలో ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 30, 2023తో ముగిసే సంవత్సరం) సుమారు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు యూఎస్ పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షలకు మించిన మెక్సికన్లు, 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. యూఎస్ పౌరసత్వం మంజూరుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా వలస, జాతీయత చట్టం (ఐఎన్ఏ)లో నిర్దేశించిన నిర్దిష్ట అర్హతలకు అనుగుణంగా ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (ఎల్పీఆర్)గా ఉండాలి. అలాగే అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం, లేదా మిలటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలు పౌరసత్వాన్ని పొందేందుకు అర్హతలుగా ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో అమెరికా పౌరసత్వం అందుకున్నవారిలో చాలా మంది ఐదేళ్ల చట్టబద్ద నివాసం ద్వారా అర్హత పొందినవారేనని నివేదిక వెల్లడించింది. అయితే అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్ల వ్యవధికే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. -
నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?
2024, జనవరి 28.. లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌తో కూడిన మహాకూటమి ప్రభుత్వానికి ముగింపు పలికిన బీహార్ సీఎం నితీష్.. బీజేపీ మద్దతుతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపధ్యంలో నితీష్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నేడు బీహార్ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంది. దీనినే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు ఉండాలి. అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. జనవరి 28న మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు, ఆయనకు బీజేపీ మద్దతు లేదు. ఆయన పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన 78 మంది ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకి అందించింది. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్‌కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్‌భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. -
పాక్‌లో నవాజ్- బిల్వాల్ ప్రభుత్వం?
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. పాక్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాలేదు. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ పార్టీ 71 సీట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. ఈ నేపధ్యంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని సమాచారం. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ లాహోర్‌లో పీఎన్ఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో బయటపడుతోన్న పలువురు ఉన్నతాధికారుల బాగోతం
-
ఏపీ అప్పులు..పచ్చ అబద్ధాలు పచ్చి నిజాలు
-
తెలంగాణ ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది: ఖర్గే
త్రిస్సూర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమబద్ధంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి విభాగాలను ఆయుధాలుగా వాడుకుంటోందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గాను ఆదివారం ఆయన కేరళ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. త్రిస్సూర్‌లోని తెక్కునాడు మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘మహాజన సభ’నుద్దేశించి మాట్లాడారు. సమావేశంలో 25వేలకు పైగా బూత్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బ ణం విపరీతంగా పెరిగాయని, దేశంలో పేద, ధనిక అంతరాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. -
ఇరాన్లో మరో 4 అణు విద్యుత్ ప్లాంట్లు
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం మొత్తం 5 వేల మెగావాట్ల సామర్థ్యముండే నాలుగు అణు విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. దేశ తూర్పు తీర పట్టణం సిరిక్ సమీపంలో వీటి నిర్మాణం మొదలైందని ఇరాన్ అణు విభాగం అధిపతి మహ్మద్ ఎస్లామి తెలిపినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. సుమారు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1.64 లక్షల కోట్లు) వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో 4 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఎస్లామి చెప్పారు. తొమ్మిదేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత ఏటా 35 టన్నుల అణు ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. రష్యా సహకారంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల అణుప్లాంట్ ఇరాన్లో ఇప్పటికే పనిచేస్తోంది. -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
ఈనెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు. 1943, జూలై 4న సింగపూర్‌లోని క్యాథే భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్‌లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
పేదింటి పద్దు రూ.25 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది. వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు.. తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. -
Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ
షోలాపూర్/: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు. బోయింగ్ క్యాంపస్ ప్రారంభం దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు. బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్ తాజా నిదర్శనమన్నారు. భారత్ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2023ను ప్రారంభించారు. 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. మహిళలే వృద్ధి సారథులు భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్ ప్రకటించింది. పైలట్ శిక్షణకు మహిళలకు స్కాలర్íÙప్లు ఇస్తామని పేర్కొంది. సిద్ధూ, అది సహజం! ‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్ క్యాంపస్ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్ తదితరులు చిరునవ్వులు చిందించారు. -
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ న్యాయ విచారణల ఆంతర్యం ఏంటి ?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఏంటి ? న్యాయ విచారణల వెనక ఆంతర్యం ఏంటి ? గత ప్రభుత్వ తప్పిదాలపైనే రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమా ? అసలు కాగ్రెస్ ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడుతున్నాయి?.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు సాగిన గులాబీ పార్టీ పాలనలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం తాము చేసిన ఆరోపణల్ని రుజువు చేయడమే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని తాము ఇంతకాలం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ధరణి వెబ్సైట్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు చేతులు మారాయని ప్రభుత్వం భావిస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలు, లోటుపాట్లను తేల్చేందుకు కోదండ రెడ్డి అధ్యకతన ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి భారీ అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యూడిషియల్ ఎంక్వరీకి ప్రభుత్వం సిద్దమయింది. ఇందుకోసం రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆఫీస్ లలో ఏకకాలంలో విజిలెన్స్ ఎంక్వరీ మొదలు పెట్టింది. విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి ఆధారాలు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి మయంగా మారిందని, కమిషన్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంకోవైపు ప్రభుత్వ శాఖలలో బీఆర్ఎస్ నేతల సన్నిహితులు, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. అలాంటి వారు వెంటనే రిజైన్ చేసి వెల్లిపోవాలని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎంక్వరీ చేయాలని సీఎం కోరాతామని కూడా ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ఓఆర్ఆర్ టెండర్లలోను భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ టెండర్లపై విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇవేకాదు.. ఫార్ములా ఈ రేసింగ్ లో హెచ్ఎండిఏ నుంచి రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు జరిగాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరితహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. దీనిపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తున్న అన్ని శాఖలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు శాఖలపై విచారణకు ఆదేశించగా, మరికొన్ని శాఖలపై ఎంక్వరీకి సిద్ధం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఖండించారు. తాము ఆరోపించినట్లు అవినీతి జరిగింది నిజమే అని రుజువు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయింది. ఇదీ చదవండి: నల్గొండపై బీజేపీ పట్టు? -
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
‘టీఎస్పీఎస్సీ’కి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్, సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటివరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా..తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. www. telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పూరించిన దరఖాస్తును secy-ser-gad@telangana.gov. in ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు. మూడు పేజీల దరఖాస్తు టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల దరఖాస్తును రూపొందించింది. విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు, విధులు, సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అకడమిక్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగం, హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలను, నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు, విజయాలను 200 పదాల్లో వివరించాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడాలని సీఎస్ తెలిపారు. సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన చైర్మన్, మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్లను గవర్నర్ నియమిస్తారు. ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరో సభ్యురాలి రాజీనామా టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. ఆరేళ్ల పాటు కొనసాగాల్సిన తాను రెండున్నరేళ్లకే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టీఎస్పీఎస్సీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. -
10 వేల మందికి క్షమాభిక్ష!
బ్యాంకాక్: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు -
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్‌చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్‌ను మండలి వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్‌కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
పంజాబ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు! -
బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
భారతదేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బియ్యం పరిశ్రమలకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గత జులైలో బియ్యం ధరలను తగ్గించడానికి ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అంతే కాకుండా ఎగుమతి సుంకాలను సుమారు 20 శాతం వరకు పెంచింది. ఇవన్నీ దేశంలో బియ్యం కొరత రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త అని తెలుస్తోంది. -
ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు. నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్‌లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్‌లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్‌ను రాయ్‌పూర్ ఆర్టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది? -
గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం
గన్నవరం: ఎంతో కాలంగా కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం కానుంది. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేయగా.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. కనీసం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించలేదు. దీంతో చిక్కుముడిగా మారిన నిర్వాసితుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ గృహ నిర్మాణాలను సాకారం చేసే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిర్వాసిసితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వారి సమస్యల పరిష్కారానికి, నిధులు మంజూరుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విస్తరణలో దావాజీగూడెం, అల్లాపురం, బుద్ధవరంలో ఇళ్లు, స్థలాలు పోతున్న 423 కుటుంబాలకు గృహాలు నిర్మించేందుకు 2015లో టీడీపీ ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తీసుకొచి్చంది. ఈ ప్యాకేజీలో భాగంగా గృహ నిర్మాణాలకు చిన్నఆవుటపల్లి పరిధిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారు 52 ఎకరాల భూమి సేకరించారు. ఆ భూమిలో కొద్దిమేర మెరక చేసి.. మౌలిక సదుపాయల కల్పనను అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. కనీసం నిర్వాసితులకు ప్లాట్లు కూడా కేటాయించకుండా చేతులు దులుపుకుంది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించింది. రెండుసార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వంశీమోహన్ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితుల గృహ నిర్మాణాలకు రెండు దఫాలుగా రూ. 4.50 లక్షలు చొప్పన ఒక్కొక్కరికీ రూ.9 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్వాసితులు చెల్లించాల్సిన రూ.3.76 కోట్ల స్టాంప్ డ్యూటీకి మినహాయింపు కల్పించి ఉచితంగా ప్లాట్ల రిజి్రస్టేషన్ చేసి దస్తావేజులను అందజేశారు. సమస్యల పరిష్కారానికి రూ. 80.48 కోట్లు మంజూరు.. విమానాశ్రయ నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.80.48 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిలో ఎయిర్పోర్ట్ అవుట్ డ్రెయిన్ కోసం ఇళ్లు తొలగించిన 47 కుటుంబాలకు అద్దె బకాయిలు రూ.1.21 కోట్లు, ఆర్అండ్ఆర్ స్థలంలో మౌలిక సదుపాయాలకు రూ.41.20 కోట్లు, గృహ నిర్మాణాలకు రూ. 38.06 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే అద్దె బకాయిలు, నిర్వాసితులకు మొదటి విడతగా గృహ నిర్మాణాలకు చెల్లించేందుకు రూ. 17.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కాంపిటెంట్ అథారిటీ, గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి ద్వారా నిర్వాసితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. ఇంకా గృహ నిర్మాణాలకు రెండో విడత నిధులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో లెవలింగ్, రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం మిగిలిన రూ. 63.12 కోట్లు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!
కోవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆగ్నేయాసియాలోని పలు ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు తిరిగి పాత నిబంధనలు అమలుకోకి తీసుకురావాలని నిర్ణయించాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మళ్లీ మాస్క్‌లు ధరించాలని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల జ్వరాన్ని తనిఖీ చేయడానికి థర్మల్ స్కానర్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే కోవిడ్ వేరియంట్ల తరహాలోని పలు సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలని వివిధ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, సంవత్సరాంతపు, పండుగ సీజన్లలో ప్రయాణాలు మొదలైనవి వైరస్ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దేశాలకు, లేదా ప్రాంతాలకు ప్రయాణికులను వెళ్లవద్దని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండోనేషియన్లను అభ్యర్థించింది. కాగా గత వారం రోజుల్లో మలేషియాలో కోవిడ్ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు పోస్టుల వద్ద థర్మల్ స్కానర్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక!