
సాక్షి, తిరుపతి: కంబాల దిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
వైయస్ఆర్ జిల్లా, కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.… pic.twitter.com/d7nJHV37Z6
— Roja Selvamani (@RojaSelvamaniRK) May 24, 2025