‘ప్రభుత్వం కమ్మగానే ఉంది.. పాలన కూడా ఇంకా కమ్మగానే ఉంది’ | BJP MLA Adinarayana Reddy Satires On Chandrababu Ruling | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం కమ్మగానే ఉంది.. పాలన కూడా ఇంకా కమ్మగానే ఉంది’

Feb 8 2026 3:43 PM | Updated on Feb 8 2026 4:39 PM

BJP MLA Adinarayana Reddy Satires On Chandrababu Ruling

తిరుపతి:  ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.  ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపులపై వ్యంగ్యంగా స్పందించారు.  ‘ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమై ఉంటుంది. 

1983లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగానే ఉందని చెప్పారు. అదే విషయాన్ని మళ్లీ నేను చెబుతున్నా. ఎన్టీఆర్‌ పాలనపై గజ్జల మల్లారెడ్డి చెప్పిందే నేను చెబుతున్నా. కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది. ఒక కులం కాకుండా.. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్మతో పాటు అందరం ఉన్నాం. కులాలకు సంబంధంలేకుండా అందరినీ సమానంగా చూడాలి. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదు. కూటమిలో బీజేపీనే ప్రధానం..ఆ తర్వాతే టీడీపీ, జనసేన’ అంటూ వ్యాఖ్యానించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement