బీఆర్‌ నాయుడు అసమర్థుడు.. స్వామి భక్తుడే కాదు: వెల్లంపల్లి | vellampalli srinivas Serious Comments On CBN And BR Naidu | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడు అసమర్థుడు.. స్వామి భక్తుడే కాదు: వెల్లంపల్లి

Feb 8 2026 1:12 PM | Updated on Feb 8 2026 1:28 PM

vellampalli srinivas Serious Comments On CBN And BR Naidu

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా? అని ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘లడ్డూ విషయమై చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనపడటం లేదు. చంద్రబాబులో తప్పు చేశామన్న బాధ అసలే లేదు. సిగ్గూ, శరం, భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సీబీఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటల వీడియోని ఎల్లో మీడియా తప్పుగా ఎడిట్ చేసింది. కట్, పేస్ట్ వీడియోని ప్రసారం చేసి శునకానందం పొందారు. లడ్డూ ఇష్యూ మీద సంవత్సరం పైగా విచారణ జరిగింది. ఆ సిట్‌లో ఉన్నది చంద్రబాబు మనుషులే.

చివరికి లడ్డూలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ వాడారని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాసిడ్స్‌ని స్వీటులో కలుపుకుని బీఆర్ నాయుడు తినగలరా?. టీటీడీ చైర్మన్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసి తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. బీఆర్ నాయుడు తన టీవీ ద్వారా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువని చెప్పుకోవటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ సనాతని అని ఎంత చెప్పుకున్నా జనం నమ్మటం ఎప్పుడో మానేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement