టీడీపీ నేత అరాచకం.. ప్రభుత్వ హాస్టల్‌ పిల్లలతో అశ్లీల నృత్యాలు | TDP Leader Chandra Mohan Over Action At Manyam Dist | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత అరాచకం.. ప్రభుత్వ హాస్టల్‌ పిల్లలతో అశ్లీల నృత్యాలు

Feb 8 2026 12:15 PM | Updated on Feb 8 2026 3:23 PM

TDP Leader Chandra Mohan Over Action At Manyam Dist

సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంతో టీడీపీ నేతలు, వారి బంధువులు సైతం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తాజాగా టీడీపీ మహిళ ఎమ్మెల్యే బంధువు ఒకరు ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్స్‌ను సైతం తాకింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని నీలకంఠపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో అశ్లీల నృత్యాలు చేసిన విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ హాస్టల్‌ వార్డెన్‌, టీడీపీ ఎమ్మెల్యే బంధువు చంద్రమోహన్.. పిల్లలతో చెత్తగా అర్ధనగ్న డ్యాన్స్‌లు చేయించినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే బంధువు కావడంతోనే ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement