బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు! | Black Magic On MLA Bandaru Sravani | Sakshi
Sakshi News home page

బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు!

Feb 8 2026 9:29 AM | Updated on Feb 8 2026 9:29 AM

Black Magic On MLA Bandaru Sravani

అనంతపురం సెంట్రల్‌: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు చేశారన్న వదంతులు కలకలం రేపాయి. శనివారం ఉదయం అనంతపురంలోని నివాసం వద్ద జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఏపీ39 కేఎక్స్‌ 0986 నంబరు గల కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే నివాసం దగ్గర నిమ్మకాయలు మంత్రించి పరారైనట్లు చెబుతున్నారు. ఆ సమయంలో గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు వెంబడించినా దొరకలేదని అంటున్నారు. ఈ పని ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదూ అందలేదని టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement