breaking news
Bandaru Sravani Sree
-
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల బాహాబాహీ
-
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వేధిస్తున్నారు..
అనంతపురం జిల్లా: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భార్య, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు. ‘సేవ్ లోకేశ్ అన్న’ అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. స్థానిక అంశాలపై ప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో విభేదించారు. ఆమె తీరుపై పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకుగానూ అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ మరోమారు మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన తెలిపాడు. -
శింగనమల TDP MLA బండారు శ్రావణిపై కార్యకర్తల తిరుగుబాటు
-
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025