
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. సేవ్ టీడీపీ పేరుతో పచ్చ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ పచ్చ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సేవ్ టీడీపీ పేరుతో శింగనమల టూమెన్ కమిటీ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
