రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.
ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
కోహ్లి హండ్రెడ్ బాదడంతో మెన్స్ క్రికెట్‌లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓవరాల్‌గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది.


