ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రత్యక్షంగా ఈ స్టార్ ప్లేయర్ ఆటను చూసే అవకాశం నగర అభిమానులకు కలుగుతోంది.
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు. రూ. 1750 నుంచి రూ. 13500 విలువ గల టికెట్లు ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉన్నాయి.
మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. అయితే దీని కోసం ఒక్కొక్కరు సుమారు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది!


