విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పలు, భవానీలు, సాధారణ భక్తులు రావడంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కిటకిటలాడింది.
ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఈఓ శీనా నాయక్ సిబ్బందికి సూచనలు చేశారు.


