టీడీపీ బండారు శ్రావణికి చేదు అనుభవం | Singanamala People Questioned TDP MLA Bandaru Shravani Over Unresolved Issues | Sakshi
Sakshi News home page

టీడీపీ బండారు శ్రావణికి చేదు అనుభవం

Feb 1 2026 9:01 AM | Updated on Feb 1 2026 10:07 AM

Singanamala People Questioned TDP MLA Bandaru Shravani

సాక్షి, అనంతపురం: ఎన్నికల హామీలు నెరవేర్చని కారణంగా, సమస్యలు పట్టించుకోకపోవడంతో ప్రజాక్షేత్రంలో కూటమి నేతలకు భారీ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రజలు ఆమెను నిలదీశారు. దీంతో, ఘటనా స్థలంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శింగనమల మండలానికి వెళ్లారు. నాగులగుడ్డం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్న సమయంలో స్థానికులు పలు సమస్యలపై ఆమెను ప్రశ్నించారు. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం ఎప్పుడు చేస్తారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సమాధానం చెప్పలేక టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నీళ్లు నమిలారు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో ‍గ్రామస్తులు మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement