టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా! | TDP Supporters Protest Against Bandaru Sravani | Sakshi
Sakshi News home page

టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!

Apr 19 2025 9:01 AM | Updated on Apr 19 2025 10:27 AM

TDP Supporters Protest Against Bandaru Sravani

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.

వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ  రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ  కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement