తాడేపల్లి : అర్హులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. నిజమైన ఓట్లర హక్కులు కాపాడాలంటూ వైఎస్సార్‌సీపీ లేఖలో పేర్కొంది.
‘ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి. నోటీసులు ఇవ్వకుండా ఏ ఓటూ తొలగించవద్దు. ఈ మేరకు ఈసీ తక్షణ ఆదేశాలు జారీచేయాలి. రక్తసంబంధీకుల ద్వారా వెరిఫికేషన్‌కు అనుమతించండి. వీడియో-కాల్ ధ్రువీకరణ నిబంధనలు ఖరారు చేయండి.
అన్‌మ్యాప్డ్ జాబితాలను బూత్‌వారీగా ప్రచురించాలి. రాజకీయ పార్టీలకు నోటీసుల వివరాలివ్వాలి. నకిలీ ఓట్లను తక్షణమే తొలగించాలి. వలస ఓటర్లకు న్యాయం చేయండి. ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి’ అని ఎన్నికల సంఘాలకు వైఎస్సార్‌సీపీ లేఖ రాసినట్లు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.


