కొండకెంగువ: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు దెబ్బలు తాళలేక ఓ యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సాలూరు వన్‌టౌన్ పీఎస్‌లో చిత్ర హింసలకు గురి చేశారని వారు ఆరోపిస్తున్నారు. పీఎస్‌కు తీసుకెళ్లిన తర్వాత మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.
దాంతో విజయనగరం ఆస్పత్రికి తరలించారు అదే పోలీసులు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీనిపై మణికంఠ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
బంగారం చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బంధువులు.అంటున్నారు. పోలీసుల వల్లనే మణికంఠ చనిపోయాడని రామభద్రపురం మండలం కొండ కెంగువ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బంధువులు.


