సాక్షి,పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల గోడకూలి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయలయ్యాయి. దీంతో గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే గోడ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి
మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అపశ్రుతి
ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి
మరో విద్యార్థికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/musG9tMW79— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026


