సాక్షి, అనకాపల్లి: జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 నెలల చిన్నారి మృతి చెందింది. క్రిటికల్ కేర్ బ్లాక్ విభాగంలో ఎమర్జెన్సీ వార్డులో మానిటర్స్ పనిచేయకపోవడంతో చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన చిన్నారి తెగడ గ్రామానికి చెందిన నానుబిల్లి పరమేష్, సుగుణ దంపతుల రెండో కుమార్తె. చిన్నారి మృతితో ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. ఈ ఆస్పత్రిలో ఇదే క్రిటికల్ కేర్ విభాగాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాలు, నిర్లక్ష్యాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెబుతోంది.


