వైఎస్‌ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు | Students from Vemuru Bapatla District Meet YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు

Oct 1 2026 9:55 PM | Updated on Oct 1 2026 9:57 PM

Students from Vemuru Bapatla District Meet YSRCP Chief YS Jagan

తాడేపల్లి :నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లో ఉన్నత విద్యకు వెళ్లబోతున్న బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.తాము నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళుతున్న విషయాన్ని వైఎస్‌ జగన్‌కు తెలిపారు 

దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా  ఎదగాలని సూచించారు.  దీనిలో బాగంగా విద్యార్థులు స్పందిసతూ..  ‘మీ హయాంలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలు తమలాంటి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాయని’ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:  చంద్రబాబూ.. డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement