బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్‌ క్వారీ మూసివేత | MLA Buchepalli Siva Prasad Reddy Granite Quarry Closure, 350 Workers Lose Jobs Amid Government Pressure | Sakshi
Sakshi News home page

బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్‌ క్వారీ మూసివేత

Oct 1 2026 6:50 PM | Updated on Oct 1 2026 7:39 PM

Mla Buchepalli Siva Prasad Reddy Granite Quarry Closure

సాక్షి, ప్రకాశం జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులతో చీమకుర్తిలోని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేశారు. గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే బూచేపల్లిఫై  కూటమి సర్కార్‌.. రాజకీయ వేధింపులతో పాటు ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రకు తెరతీసింది. దీంతో ఇవాళ(బుధవారం) నుంచి గ్రానైట్ క్వారీని మూసివేశారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి.. ఆయన సూర్య గ్రానైట్ క్వారీని ఇవాళ నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ వేధింపులతో కార్మికులను ఇబ్బంది పెట్టలేక క్వారీని మూసి వేస్తున్నట్లు బూచేపల్లి ప్రకటించారు. ఇవాళ కార్మికులతో సమావేశమైన బూచేపల్లి.. ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాలని క్వారీలోని కార్మికులకు సూచించారు. ఇటీవల విజిలెన్స్, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు పాల్పడ్డారంటూ రూ.78 కోట్ల జరిమానా విధించింది. ఆ ఫైనాల్టీ ఆర్డర్‌ని హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

అయినా క్వారీపై చంద్రబాబు సర్కార్‌ రాజకీయ వేధింపులు ఆపలేదు. మూడు నెలలుగా క్వారీ నుండి ఒక్క రాయి కూడా కదలకుండా మైనింగ్ శాఖ నిలిపివేసింది. దీంతో ప్రతి నెలా క్వారీఫై మూడు కోట్ల భారం పడుతోంది. చివరకు క్వారీ మూసివేయాలని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నిర్ణయించారు. నేటితో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించిన యాజమాన్యం.. కార్వీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో  350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ షాపుల్లో ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement