తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. స్థానిక ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు సర్టిఫికేట్ల జారీ ఆలస్యంపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు.
కుల, కమ్యూనిటీ సర్టిఫికెట్లు, నో-డ్యూస్, ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై ఫిర్యాదు చేశారు. సర్టిఫికేట్లు అందకపోతే నామినేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ల జారీని ఆలస్యం లేకుండా చూడాలని ఎస్‌ఈసీకి విన్నవించారు. ఈ మేరకు అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌ఈసీని కోరారు. ఇందులో ఎలాంటి వివక్షతకు తావులేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సిగ్గుచేటు.. ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు?: చెల్లుబోయిన


