అన్నమయ్య జిల్లా: చీకట్లో టీచర్‌ చిల్లర వేషాలు | Annamayya District Teacher Caught Using Fake Notes To Cheat Vendors At Weekly Market, Details Inside | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా: చీకట్లో టీచర్‌ చిల్లర వేషాలు

Oct 1 2026 2:03 PM | Updated on Oct 1 2026 2:18 PM

Annamayya District Teacher Incident

AI Pic

అన్నమయ్య జిల్లా: సమాజానికి బుద్ధి చెప్పాల్సిన ఒక ఉపాధ్యాయుడు.. వారపు సంతలో నకిలీ నోట్లతో వ్యాపారులను మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడులో బుధవారం జరిగింది. వారపు సంతలో చిన్నపిల్లలు ఆడుకునే ‘పప్పర్మెంట్లు నోట్లు’ చలామణి చేస్తూ సదరు ఉపాధ్యాయుడు వ్యాపారులకు దొరికిపోయాడు.

వ్యూహాత్మకంగా రాత్రి వేళల్లోనే..
గత మూడు వారాలుగా సదరు ఉపాధ్యాయుడు సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో సంత ముగిసే వేళకు వస్తున్నాడు. చీకటి పడే సమయాన్ని ఆసరాగా చేసుకుని, వ్యాపారుల రద్దీ,  అలసటను గమనించి ఈ నకిలీ నోట్లను అంటగడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం కూడా కూరగాయల వ్యాపారుల వద్దకు వచ్చి అదే తరహా నోట్లను ఇచ్చాడు.

నిలదీసిన వ్యాపారులు.. 
ప్రతి వారం రాత్రి వేళల్లోనే వచ్చి ఇలాంటి చెల్లని నోట్లు ఇస్తుండటాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు ఈసారి అతడిని గట్టిగా నిలదీశారు. అతని వద్ద ఉన్న నకిలీ నోట్లను లాక్కుని, అందరి ముందే చింపేసి తీవ్రంగా మందలించారు. ‘సంత అయిపోయే సమయానికి వచ్చి ఇలాంటి దొంగ నోట్లు ఇస్తావా?‘ అంటూ వ్యాపారులు దుర్భాషలాడారు.ఈ మోసం బయటపడితే తన ఉద్యోగానికి, పరువుకు భంగం వాటిల్లుతుందనే భయంతో సదరు ఉపాధ్యాయుడు వ్యాపారుల కాళ్లావేళ్లా పడి క్షమించమని వేడుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానిక సంత వ్యాపారస్తుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement