breaking news
annamayaya
-
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
మదనపల్లిలో బుస కొడుతున్న కాల్ నాగులు
సాక్షి, అన్నమయ్య జిల్లా: కాల్ నాగులు మళ్లీ బుస కొడుతున్నారు. మదనపల్లిలో వడ్డీ జలగలు రెచ్చిపోతున్నాయి. కాల్ మనీ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీల పేరుతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటున్నారు. లక్ష అప్పు ఇచ్చి.. పది లక్షలు వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్నారు.అప్పు తీర్చకుంటే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్‌లు పెడుతూ వేధింపులకు దిగుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు గౌరీ ఆవేదన వ్యక్తం చేశారు.కాల్ మనీ బాధితుల్లో టీడీపీ కార్యకర్త నాగమణి కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోతుంది. కాల్‌మనీపై హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇంత వరకు చర్యలు లేవని బాధితురాలు నాగమణి అంటున్నారు. -
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్.. అగ్నిప్రమాదం కేసుకు రాజకీయ రంగు
సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్‌గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు. -
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్‌ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్‌కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాలు మిల్పిటాస్లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో 3రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమంలో వివిధ నగరాలనుండి వచ్చిన వందలాది కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమానికి ప్రియ తనుగుల, మమత కూచిభొట్ల, వాణి గుండ్లపల్లి నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి చేతులమీదుగా సుజనరంజని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది. ఈ సంచికలో ప్రముఖ రచయితలు అన్నమయ్య కీర్తనల గురించి వ్రాసిన అమూల్యమైన రచనలు పొందుపరిచారు. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం నేతృత్వంలో రెండవరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అన్నమయ్య సంగీత పోటీలు 3వరోజు జరిగిన నృత్య పోటీలతో పాటు 3 రోజులు సాయంత్రం వేళల్లో ఏర్పాటు చేసిన ప్రముఖ కళాకారులు గరిమెళ్ల అనిల్ కుమార్, శ్రీలక్ష్మి కోలవెన్ను, గాయత్రి అవ్వారి, జోశ్యుల సూర్యనారయణ, హలీం ఖాన్‌లతో సంగీత నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను తన్మయులను చేశాయి. ఈ 3 రోజుల ఉత్సవాలలో దాదాపు 2000 మందికి పైగా ప్రేక్షకులు పాల్గొని అన్నమయ్యకు స్వర నివాళి అందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ 611 సంవత్సరాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలు పదికాలాలు పదిలంగా ఉంచడానికి, తరువాతి తరాలకు అందించడానికే సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అమెరికా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు లక్ష అరవైవేలమందితో అన్నమయ్య లక్షగళార్చన, సహస్రగళ సంకీర్తనార్చన, నిర్విరామంగా 108 గంటలపాటు అన్నమయ్య 444 కీర్తనల ఆలాపన వంటి కార్యక్రమాలు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలో అమెరికాలో 18 వేలమందితో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం అధ్యక్షులు సంజీవ్ తనుగుల నేతృత్వంలో వంశీ నాదెళ్ల, దుర్గ దేవరకొండ, చంద్రిక తాడూరి, మృత్యుంజయుడు తాటిపాముల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, సాయి కందుల, ఫణి మాధవ్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
వారి వెనుకే మనం కూడా నడుస్తున్నాం
పూర్వం తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే...చింతచెట్టు, సంపెంగచెట్ల మార్గం అని పెద్ద పెద్ద మానులతోఉన్న ఓ మార్గం గుండా వెళ్ళేవారట. పంచవన్నెల చిలకల్ని అక్కడ పంజరాల్లో పెట్టి ఉంచేవారట. ‘కోనేటిరాయుడు లోపల ఉన్నాడు, వెళ్ళి దర్శించుకోండి, కానుకలు సమర్పించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి’ అని అవి అరుస్తుండేవట. అవి విన్నారు అన్నమాచార్యులవారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కోనేటి దగ్గర కూర్చున్నారు.గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కొద్దిసేపు గుడిమెట్ల మీద తప్పనిసరిగా కూర్చోవాలంటారు. ఎందుకంటే.. మీరు లోపల దర్శనం చేసుకున్న మూర్తిని మళ్ళీ ఒకసారి మనసులోకి ప్రతిబింబింప చేసుకుని, ధారణ చేసుకోవాలి. అన్నమాచార్యుల వారికి కూడా అలా స్వామివారి సౌందర్యం జ్ఞాపకానికొచ్చింది. చిలకపలుకులు గుర్తుకొచ్చాయి. ఆ క్షణాల్లో చేసిన కీర్తనే...‘‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు...’’. అన్నమయ్య ఆ కొండమీదే ఉండిపోయాడు. తల్లిదండ్రులు పిల్లవాడిమీది బెంగతో ఉపవాసాలు చేస్తూ వెతుక్కుంటూ బయల్దేరారు. అక్కడ ప్రవర చెబుతున్న అన్నమాచార్యులును చూసి ఘన విష్ణుయతి అనే వైష్ణవయతి ఆయనకు పంచసంస్కారాలు చేసాడు. అన్నమాచార్యులవారు పాపనాశనం వెళ్ళి స్నానం చేసి తడిబట్ట ఆరేసుకుంటే.. అది ఆరిపోయేలోపల వేంకటేశ్వర స్వామి వారి మీద శతకం చెప్పేసారు. వేంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి ‘నీవు సంకీర్తనా యజ్ఞం చేయాలి’ అని ఆదేశించినట్లు ఆయనకు అనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఎక్కడికెళ్ళినా తప్పనిసరిగా ఒక కీర్తన చేసేవారు. ‘నీ కీర్తనలతో వైరాగ్యం వచ్చేసి స్వామి నాకేసి చూడడం మానేసాడు’ అని అమ్మవారు చెప్పినట్లనిపించి..‘‘పలుకు తేనెల తల్లి పవ్వళించెను..’’ అని పాడి స్వామివారిలో కదలిక తీసుకు వచ్చాడట. ఆయన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా..’ అని పాడితే నిద్రఎరుగని వేంకటాచలపతి హాయిగా కన్నుమూసి నిద్రపోయాడట.ఈరోజుకు కూడా ఉదయం సుప్రభాతం జరిగితే అన్నమాచార్య వంశీయులు వస్తారు. తాంబూలంలో వెన్నపెట్టి ఇస్తారు వారికి. రాత్రి మళ్ళీ ఊయల సేవ జరిగేటప్పడు కూడా వారు వచ్చి కీర్తనలు చేస్తారు. 95 సంవత్సరాల నిండు జీవితం గడిపిన అన్నమయ్య 90వ సంవత్సరం వచ్చిన తరువాత కూడా తంబుర పట్టుకుని శరీరం వణుకుతున్నా గుడి మెట్లమీద కూర్చుని ధ్వజస్తంభం కనబడుతుంటే..‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభ/శరణు రాక్షసగర్వ సంహార శరణు వేంకట నాయకా. ’’ అని శరణాగతి చేస్తుంటే–పురంధరదాసు గారు ఎదురొచ్చి‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శ్రీపతి సేవిత శరణు పార్వతీ తనయ శరణు సిద్ధి వినాయక...’’ అని ఆయన కీర్తన చేసారు. ‘మహానుభావా, మీ కీర్తన వింటేనే గానీ వేంకటేశ్వరుడు నిద్రపోడు. మీ పాట వింటేనే గానీ నిద్రలేవడు’’ అని పురంధర దాసు అంటే..దానికి ‘‘నీవేం తక్కువ వాడివా ! వేన్నీళ్ళు తీసుకు రాలేదని పండరీపురంలో నీవు సేవకుడి రూపంలో వచ్చిన స్వామివారి వీపుమీద చరిస్తే పాండురంగడి వీపు వాచిపోయింది. అంతగా భగవంతుడిని వశం చేసుకున్నవాడివి’’ అని అన్నమాచార్యుల వారంటూ ‘నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆశీర్వదించారట.ఇద్దరు మహాపురుషులు, ఇద్దరు వాగ్గేయకారులు రాజద్వారం దగ్గర కలుసుకున్న మహత్తర క్షణాలవి. వారు నడిచిన చోట, ఆది శంకరులు నడిచిన చోట, భగవద్ రామానుజులు నడిచిన చోట మనం నడుస్తున్నాం. -
తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్ : తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. దిలీప్‌కుమార్ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది. ముఖ్య అతిథి తులసిరెడ్డి మాట్లాడుతూ పద కవితకు అన్నమయ్య ఆద్యుడని, ఆయన సాహిత్యం నిండా సామాజిక స్పృహ నిండి ఉంటుందని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి గురుంచి మాట్లాడుతూ 179 పుస్తకాలకు పైగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథాన్ని రచించారని, జ్యోతిష్య అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువ జ్యోతిష్య శాస్త్రవేత్త వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిషోర్ తదితరులు మాట్లాడారు. భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భాగంగా గాయకుడు దిలీప్‌కుమార్ స్వరపరిచిన సంకీర్తనలను గాయనీమణులు టీవీఎస్ శ్రీదేవి, జ్యోతి, కొమ్మినేని రత్నకుమారి ఆలపించారు.