మదనపల్లిలో బుస కొడుతున్న కాల్‌ నాగులు | Call Money Racket Exposed In Madanapalle, Check Out More Details | Sakshi
Sakshi News home page

మదనపల్లిలో బుస కొడుతున్న కాల్‌ నాగులు

Jun 25 2025 9:57 PM | Updated on Jun 26 2025 12:13 PM

Call Money Racket Exposed In Madanapalle

సాక్షి, అన్నమయ్య జిల్లా: కాల్‌ నాగులు మళ్లీ బుస కొడుతున్నారు. మదనపల్లిలో వడ్డీ జలగలు రెచ్చిపోతున్నాయి. కాల్ మనీ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీల పేరుతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటున్నారు. లక్ష అప్పు ఇచ్చి.. పది లక్షలు వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్నారు.

అప్పు తీర్చకుంటే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్‌లు పెడుతూ వేధింపులకు దిగుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు గౌరీ ఆవేదన వ్యక్తం చేశారు.

కాల్ మనీ బాధితుల్లో టీడీపీ కార్యకర్త నాగమణి కూడా  ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోతుంది. కాల్‌మనీపై హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇంత వరకు చర్యలు లేవని బాధితురాలు నాగమణి అంటున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement