ఉద్యోగులకు భారీ మోసం.. రెండేళ్లుగా జీతాలు పెరగలేదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments On Nadu-Nedu Aarogyasri And Govt Employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు భారీ మోసం.. రెండేళ్లుగా జీతాలు పెరగలేదు: వైఎస్‌ జగన్‌

Feb 19 2026 4:53 PM | Updated on Feb 19 2026 6:18 PM

YS Jagan Key Comments On Nadu-Nedu Aarogyasri And Govt Employees

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గిందని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.4000 కోట్లు అవసరం. రెండేళ్లలో ఆర్యోగ్రశ్రీకి రూ.3,141 కోట్లు బకాయిలు పడ్డారు. మేము పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే.. బాబు తీసేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌.. ఐఆర్‌, పీఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35వేలు బకాయి పడ్డారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ సూల్స్‌లో నాడు-నేడుకు చంద్రబాబు ఉరేశారు. స్కూల్స్‌లో నాడు-నేడు కింద మేము రూ.8,524 కోట్లు ఖర్చు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2024-25లో ఖర్చు చేసింది రూ.285 కోట్లు మాత్రమే. 2025-26లో బాబు ఖర్చు చేసింది రూ.259 కోట్లు మాత్రమే ఉంది. నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించింది.

మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నాడు. ఇప్పుడు వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. మా హయాంలో వైఎస్సార్‌ ఆసరా కింద రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.2229 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1876 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.19,198 కోట్లు ఇచ్చాం. మేము లక్షలాది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.35210 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49,926 కోట్లకు పోతే.. చంద్రబాబు హయాంలో 30,698 కోట్లకు పడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

Advertisement
 
Advertisement
Advertisement