లోకేష్‌.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Satirical Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్‌ జగన్‌

Feb 19 2026 3:21 PM | Updated on Feb 19 2026 3:43 PM

YS Jagan Satirical Comments On Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ జల్సాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ చూడటానికి మంత్రి లోకేష్‌.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శలు చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. మంత్రి నారా లోకేష్‌కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. సీఎం కొడుకు లోకేష్‌ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్‌లో ఉంటాడు. క్రికెట్‌ మ్యాచ్‌ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.

చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్‌ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్‌ చూశాను. రాష్ట్రం​ అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement