వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
సాక్షి,తాడేపల్లి: 2026-2027కు సంబంధించిన బడ్జెట్‌లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజలు ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు.
ప్రజల్ని మోసం చేస్తూ వారి వంచిస్తూ చంద్రబాబు ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్
మూడో బడ్జెట్‌లో చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర సెవన్,మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయి.
అన్నీ వర్గాల్ని మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది
చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర సెవన్ విషయంలో ప్రజల్ని అన్నీ రకాల మోసం చేయాలని నిర్ణయించుకున్నారు
పదేపదే అబద్ధాలు చెబుతూ సూపర్ క్విట్ అంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు
మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే
అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబే
రాష్ట్ర ప్రగతి వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటాతాయి
చంద్రబాబు పాలనలో పర్ఫామెన్స్ వీక్.. పబ్లిక్ సిటీ పీక్
రాష్ట్ర వృద్ధి రేటు అంటే రాష్ట్రంలో అన్నీ రంగాలు వృద్ధిసాధిస్తున్నాయని అర్ధం
వృద్ధి రేటు పెరిగిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు
వృద్ధిరేటు పెరిగితే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి
కొనుగోలు శక్తి పెరగాలి
ఇలా జరిగిందా? లేదా? అని పరిశీలిస్తే
గ్రోత్ రేటు పెరిగితే.. తలసరి ఆదాయం పెరగాలి కదా చంద్రబాబు
2024-25లో లక్షా 19వేల 927కోట్లు వస్తుందన్నారు
కానీ వచ్చిన ఆదాయం 94వేల 937కోట్లు
10నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964కోట్లు
కాగ్ 23 రాష్ట్రాల సొంత ఆదాయాల పురోగతి జాబితా విడుదల చేసింది.
23 రాష్ట్రాల్లో ఏపీ 22 వ స్థానంలో న్నాం
చంద్రబాబు పాలనలో చివరి రెండో స్థానంలో ఉన్నాం
మిగితరాష్ట్రాల దరిదాపుల్లో లేము
కానీ చంద్రబాబు జీఎస్టీ వృద్ధి రేటులో దూసుకుపోతున్నాం అని అంటారు
2024-25లో 11.75శాతంతో దూసుకుపోతున్నాం అని అంటున్నారు
చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. తగ్గిపోతున్నాయి
రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు
రాష్ట్ర సంబంధిత ఆదాయాలు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది
దోచుకో.. దాచుకో.. పంచుకో అన్న చందంగా
మరో వైపు చంద్రబాబుకు విమానం, హెలికాఫ్టర్
నారాలోకేష్‌కు విమానం, హెలికాఫ్టర్
పవన్ కల్యాణ్‌కు విమానం, హెలికాఫ్టర్
అందరూ గాల్లోనే
నారా లోకేష్ ఒకపూట విజయవాడ.. మరో పూట హైదరాబాద్
క్రికెట్ మ్యాచ్ కోసం విజయవాడ నుంచి ఢిల్లీ
ఢిల్లీ నుంచి కొలంబోకు మ్యాచ్ చూడాటానికి వెళ్లారు
టీవీలో క్రికెట్ చూస్తే సరిపోతుందిగా కోలంబోకే పోవాలా
బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయాలకు ప్రజలకు తెలిసిపోతాయని రాష్ట్ర అప్పుల వివరాల్ని పూర్తిగా తొలగించారు
2024-2025 చంద్రబాబు మీరే ప్రజెంట్ చేసిన తొలి బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులు ఎంతున్నాయి చెప్పారు
కాగ్,రాష్ట్రానికి వచ్చే ఆదాయా రిపోర్టులు చూస్తే ఆదాయాలు రావడం లేదు
కానీ చంద్రబాబు మాత్రం ఆదాయాలు వస్తున్నాయని అంటున్నారు
చంద్రబాబు టేప్‌రికార్డర్ ఆన్.. గోబెల్స్ ప్రచారం ఆన్
బాబు దిగిపోయే నాటికి 3లక్షల 90వేల 247 కోట్ల అప్పులు
మేం ఐదేళ్లలో చేసిన అప్పు 3లక్షల 31వేల 671కోట్లు
ఎన్నికల ముందు తాను సీనియర్‌నని,సంపద సృష్టిస్తామని, అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలించలేమన్నారు
అప్పుల్లో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్దలు కొడుతున్నారు
మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చే హామీలు నీటిమీద రాతల్లా మిగలకూడదని
కోవిడ్ -19 సంక్షోభంలో మేనిఫెస్టోని మనసా వాచా అమలు చేశాం
మేనిఫెస్టోని అమలు చేసి ప్రజల్లోకి వెళ్లాం
కానీ చంద్రబాబుకి మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అని నిరూపించారు
ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికి వెళ్లి బాండ్లు పంచారు
బాండ్లు పంచి ఏ పథకం కింద ఎంత వస్తుందో చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు
ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు
చంద్రబాబు తన మేనిఫెస్టోతో ప్రజల్ని ఏవిధంగా మోసం చేశారో చూడండి
ఎన్నికల ముందు తన కరపత్రాలైన ఈనాడులో ఎలా ప్రచారం చేశారో మీరూ చూశారు
ఎస్సీ,ఎస్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు
ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవకింద ఏడాదికి 20వేలు
ప్రతి మహిళలకు 1500
స్కూల్‌కు వెళ్లే ప్రతి పిల్లాడికి ఏడాదికి 15వేలు
మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు
మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం



