విజయవాడ: ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు ఉన్న సంబంధం., హెరిటేజ్‌కు బోలేబాబాకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని తాము చర్చకు కోరితే కూటమి నేతల ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఈరోజు(ఫిబ్రవరి 19వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు ఉన్న సంబంధంపై చర్చకు సిద్ధమని బయట చెప్పుకునే నేతలు.. మండలిలో చర్చకు రమ్మంటే భయపడుతున్నారన్నారు. అసలు టీడీపీ నేతలు ఎందుకు చర్చకు భయపడుతున్నారని వరుద కల్యాణి నిలదీశారు.
‘మూడు రోజుల నుంచి వాయిదా తీర్మానం ఇస్తున్నాం. చర్చ పెట్టండి.. ఇందాపూర్ వెనుక ఉన్న గుట్టు బయటపెడతాం. నెయ్యికి ఛీజ్ కు తేడా తెలియదని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. మేం ఏం మాట్లాడామో తెలుసుకుని అచ్చెన్నాయుడు మాట్లాడితే మంచిది. ఇందాపూర్ తమ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ అని హెరిటేజ్ ప్రకటించింది. బోలేబాబా కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. మొన్నటి వరకూ తక్కువ ధరకు ఇందాపూర్,నందిని నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు ఇందాపూర్ రూ. 658కి , నందిని రూ. 710కి ఎలా సప్లై చేస్తున్నాయి
టిటిడి చరిత్రలో ఇంత ఎక్కువ ధరకు నెయ్యి టెండర్లు కట్టబట్టలేదు. లడ్డూ పై తప్పుడు ప్రచారం చేసి తమ సంస్థలకు ఎక్కువ ధరకు నెయ్యి టెండర్లు కట్టబెట్టారు. రెండు రూపాయలు పాల ధర పెరిగితే నెయ్యి ధర రెండొందల శాతం పెరుగుతుందా?, సిబిఐ జాబితాలో ముద్దాయిలుగా ఉన్న వారిని ఎక్స్ పర్ట్ కమిటీలో వేశారు. టీటీడీ నిబంధనలు సడలించి ఇందాపూర్‌కు టెండర్లు కట్టబెట్టారు. మా నాయకుడు వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి లడ్డూ పై చంద్రబాబు,పవన్ తప్పుడు ప్రచారం చేశారు. పందికొవ్వు ,జంతువుల కొవ్వు,యఫిష్ ఆయిల్ కలిసిందని నోటికొచ్చినట్లు మాట్లాడారు. సిబిఐ రిపోర్టులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేలింది. ఇప్పుడు బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని మరో ప్రచారం మొదలు పెట్టారు. ఇందాపూర్ , బోలేబాబా పై చంద్రబాబు, పవన్ చర్చకు ఒప్పుకోవాలి. చర్చకు ఒప్పుకునే వరకూ మేం పోరాడుతూనే ఉంటాం
మేం అన్ని ఆధారాలు చూపించాం. చర్చకు ఒప్పుకుంటే చంద్రబాబు బండారం బయటపడుతుందని భయం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. పాలనా వైఫల్యం కూడా స్పష్టంగా ఉంది. స్టీల్ ప్లాంట్ ను ముక్కలు ముక్కలు చేసి ప్రైవేట్ కు అప్పగించేస్తున్నారు. తమ స్వార్ధం కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం మానేశారు’ అని ధ్వజమెత్తారు.


