చర్చ అంటే బాబు సర్కార్‌కు భయమెందుకు?: బొత్స | Legislative Council: Botsa Satyanarayana Challenges Minister Atchannaidu | Sakshi
Sakshi News home page

చర్చ అంటే బాబు సర్కార్‌కు భయమెందుకు?: బొత్స

Feb 19 2026 11:30 AM | Updated on Feb 19 2026 12:50 PM

Legislative Council: Botsa Satyanarayana Challenges Minister Atchannaidu

సాక్షి, అమరావతి: మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం చేసింది. హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ వాయిదా తీర్మానం ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ తిరస్కరించారు. హేరిటేజ్‌, ఇందాపూర్‌ అంశంపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. ఇందాపూర్, తిరుపతి లడ్డూ ప్రసాద అంశంపై చర్చించాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇందాపూర్‌పై చర్చకు ఎందుకు అనుమతించడం లేదంటూ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.

చర్చకు భయపడి టీడీపీ ఎదురు దాడికి దిగింది. డైవర్షన్‌ కోసం మంత్రి అచ్చెన్నాయుడు.. భారతి సిమెంట్స్ గురించి ప్రస్తావించారు. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడంటూ బొత్స మండిపడ్డారు. ఇవిగో మా దగ్గరున్న ఆధారాలు చూపిస్తున్నాం. దేవదేవుడిని అడ్డంపెట్టుకుని దోపిడీ చేస్తారని ఎవరూ ఊహించరు. మీ వెబ్ సైట్‌లోనే  ఆధారాలున్నాయ్ రండి చర్చిద్దాం’’ అంటూ అచ్చెన్నాయుడికి బొత్స సవాల్‌ విసిరారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement