‘అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం’ | Remove Civil Aviation Minister Of Tdp Till Probe Ends: Rohit Pawar | Sakshi
Sakshi News home page

‘అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం’

Feb 19 2026 10:35 AM | Updated on Feb 19 2026 11:28 AM

Remove Civil Aviation Minister Of Tdp Till Probe Ends: Rohit Pawar

ముంబై: అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఎన్సీపీ నేత రోహిత్‌ పవార్‌ సంచలన ఆరోపణలు చేశారు. విమానయాన సంస్థ వీఎస్‌ఆర్‌ యజమాని రోహిత్‌ సింగ్‌కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని.. విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రామ్మోహన్‌ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని రోహిత్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు.

అజిత్‌ పవార్‌ది ప్రమాదం కాదు.. ప్రణాళిక  ప్రకారం జరిగిన హత్య. రోహిత్‌సింగ్‌ను కాపాడే ప్రకటనలు చేస్తున్నారు. దర్యాప్తు నిష్ప్రక్షపాతంగా జరగాలంటే రామ్మోహన్‌నాయుడిని తప్పించాల్సిందేనని రోహిత్‌ పవార్‌ అన్నారు. ఈ కుట్రలో భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా దాగి ఉందన్న రోహిత్‌.. రూ. 35 కోట్ల విలువచేసే విమానానికి రూ.210 కోట్లతో బీమా వెనుక మర్మమేంటి? అంటూ ప్రశ్నించారు.

ప్రమాద సమయంలో ఫ్లైట్‌లోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారని.. పైలట్‌ను బ్లాక్‌మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు అంటూ రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. విచారణ పూర్తికాకముందే రోహిత్‌ సింగ్‌ను దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారు?. బ్లాక్‌ బాక్స్‌ సేఫ్‌గా ఉన్నా పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ రోహిత్‌ పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్‌ పవార్‌కు రోహిత్‌ పవార్‌ మేనల్లుగు. గతంలో అజిత్ పవార్‌తో  కలిసి పని చేశారు.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement