ఢిల్లీ : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. ఏఐ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌లు పాల్గొన్నారు.
నేటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ముఖ్య విశేషాలు..
- ఉ. 11 గంటలకు వివిధ దేశాల స్టాళ్లను పరిశీలించనున్న ప్రధాని మోడీ, దేశాధినేతలు
- మ.12 నుంచి లీడర్స్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
- లీడర్స్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రపంచ దేశాధినేతలు, మంత్రులు , బహుళ జాతి సంస్థల ప్రతినిధులు
- ఏఐ రంగంలో గ్లోబల్ ప్రాధాన్యతలు, పరిపాలన, మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం పై చర్చలు జరుపనున్న ప్రపంచ దేశాధినేతలు
- సా5:30 కు సీఈఓ లతో ప్రధాని నరేంద్ర మోడీ రౌండ్ టేబుల్ మీటింగ్
- ఈ కార్యక్రమంలో పాల్గొననున్న గ్లోబల్ టెక్నాలజీ ,ఇండస్ట్రీ లకు సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు
- పెట్టుబడులు , పరిశోధన , సప్లై చైన్స్, ఏఐ సిస్టమ్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చ
- సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్
- పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు స్తంభాల ఆధారంగా 7 వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు
- వివిధ రంగాలలో ఏఐ ప్రభావం పై చర్చలు జరుపనున్న వర్కింగ్ గ్రూప్స్

ఏఐ వర్కింగ్ గ్రూప్‌లు..
1. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి కోసం ఏఐ
2. వనరుల ప్రజాస్వామికరణ
3. సామాజిక సాధికారిత
4. సురక్షితమైన విశ్వసనీయ ఏఐ
5. మానవ మూలధనం
6. సైన్స్
7. స్థితిస్థాపకత ,ఆవిష్కరణ, సామర్థ్యం
అంశాలపై వర్కింగ్ గ్రూప్ ల ఏర్పాటు
500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, వందమంది సీఈవోలు , 100 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 20 దేశాధినేతలు, 60 మంది మంత్రులను ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్న సదస్సు


