ఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొంటారా.. లేదా అనేది ఇప్పటివరకూ ఉన్న సందిగ్థత. అయితే ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 19 వ తేదీ) ఏఐ కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో బిల్ గేట్స్ కు ద్వారాలు మూసుకుపోయాయి. ఏఐ సదస్సలో ఆయన ప్రసంగించడం లేదనే విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ ఇండియా వెల్లడించింది.
— Gates Foundation India (@BMGFIndia) February 19, 2026
బిల్ గేట్స్ స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా ఇండియా అధ్యక్షుడిగా ఉన్న అంకుల్ ఓరా ప్రసంగించనున్నార. అన్ని అంశాలన పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకన్నట్లు గేట్స్ ఫౌండేషన్ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇప్పటికే బిల్ గేట్స్ క్విటి ఇండియా హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న తరుణంలో కూడా బిల్ గేట్స్‌ను.. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు దూరంగా ఉంచాలని ఆది నుంచి కూడా ఓ వాదన తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అనేక తర్జనభర్జనల అనంతరం బిల్ గేట్స్‌ను.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి దూరం పెట్టారు. గత మూడు రోజుల నుంచి బిల్ గేట్స్ ను దూరం పెడతారని కాసేపు, లేదు ఆయన ప్రసంగిస్తారని కాసేపు ఇలా హైడ్రామా నడిచింది. ఎట్టకేకలకు బిల్ గేట్స్‌ను దూరం పెడుతూ గేట్స్ ఫౌండేషన్ ఇండియా ప్రకటించిన తరుణంలో దీనికి ముగింపు పలికినట్లు అయ్యింది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో బట్టబయలు
అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు అత్యంత ప్రముఖంగా బయటపడింది. అభం శుభం తెలియని చిన్నారులను తమ వికృత లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారని వెలుగులోకి వచి్చంది. బిల్ గేట్స్‌కు ఆయన భార్య మెలిందా గేట్స్ కొంతకాలం క్రితం విడాకులు కూడా ఇచ్చారు. ఆయన అక్రమ, అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేక ఆమె విడాకులు ఇచ్చారు.
కాగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు బయటపడటంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ బాగోతంపై ఓటీటీ చానల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక సీరీస్ కూడా చిత్రీకరించారు. దాంతో బిల్‌గేట్స్ తదితరులు ఎంతటి తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారన్నది తెలుసుకుని యావత్ ప్రపంచం కంపించిపోయింది.


