India AI Impact Summit 2026
-
ఇంగ్లీష్... ఈజీగా!
ఇంగ్లీష్ అనేది హిందూ మహాసముద్రమంత పెద్దది. ఎంత నేర్చుకున్నా.... నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కొద్దిమందికి ఇంగ్లీష్ బాగానే అర్థం అవుతుంది. కాని రెండు మూడు వాక్యాలు కూడా ధైర్యంగా మాట్లాడలేరు. కొందరు ఏదో రకంగా ఇంగ్లీష్ మాట్లాడతారుగానీ, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్పిత్ మిట్టల్ ‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రూపకల్పన చేశాడు. తొలి అడుగుతోనే ఆదరణను సొంతం చేసుకున్నాడు...‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రెండు లక్షల సంఖ్యలో మంత్లీ యూజర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చిన్న చిన్న పట్టణాలకు చెందినవారే. గూగుల్ ప్లేలో ఈ యాప్ డౌన్లోడ్లు కోటి దాటాయి. ‘స్పేస్ఎక్స్.ఏఐ’ ఫౌండర్ హోదాలో దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నాడు అర్పిత్.‘ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఏఐని ఫీచర్లా ఉపయోగిస్తున్నాయి. మా ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే ఏఐ అనేది యాంత్రికంగా ఉండదు. టీచర్‌లాగే వ్యవహరిస్తుంది’ అంటాడు అర్పిత్ మిట్టల్.ప్రాక్టికల్‌గా మాట్లాడేలా...యాప్ ఓపెన్ చేయగానే సుదీర్ఘమైన గ్రామర్ పాఠాలు వినిపించవు. ఇతరులతో సహజంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సంక్లిష్టమైన గ్రామర్ పాఠాలతో కాకుండా ప్రాక్టికల్‌గా, సులభంగా ఇంగ్లీష్ మాట్లాడేలా చేస్తుంది. ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్, వర్క్‌ప్లేస్ డిస్కషన్స్, కస్టమర్ కాల్...మొదలైన వాటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఏ రకంగా చూసినా గురువుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రాక్టిస్ టైమ్‌పై పరిమితిని తొలగించడం ద్వారా గుడ్ టీచింగ్‌కు ఇది సరిౖయెన వేదిక అవుతుంది’ అంటున్నాడు అర్పిత్. అందరికి ఒకేలా అని కాకుండా ప్రతి సెషన్ పర్సనల్ యూజర్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ లెర్నింగ్ యాప్ కోర్ లాజిక్ విషయానికి వస్తే....‘రిపిటీషన్ ద్వారా మాట్లాడడం అనేది మెరుగుపడుతుంటే, రిపిటేషన్లు కొనసాగనివ్వండి’ మరొకటి...‘ప్రతి లెర్నర్కు అపరిమితంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రాక్టిస్ గ్యాప్ లేకుండా చూడడం’ఏ యాసలో మాట్లాడినా సరే!→ మన దేశంలో ఇంగ్లీష్ నేర్చుకునేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు మూడు మాటలు ఇంగ్లీష్‌లో మాట్లాడలేని వారి నుంచి, అనర్గళంగా మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యాసకుల స్థాయికి అనుగుణంగా మా జనరేటివ్ ఏఐ తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. శ్రద్ధగా నేర్చుకునేలా చేస్తుంది. వారు మాట్లాడే విధానం, ఉచ్చారణ, ఉపయోగించే పదాలు...మొదలైన వాటిని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు... ఒక లెర్నర్ ప్రాథమిక వాక్యాలను సులభంగా చెప్పగలుగుతుంటే కొత్త పదాలు, జాతీయాలను ఉపయోగించి సంక్లిష్టమైన వాక్యాలు రాయడానికి ప్రయత్నించమని ఏఐ వారికి సలహా ఇస్తుంది. మన దేశంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. అవి ఒకే రాష్ట్రంలో కూడా విభిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి సేకరించిన నిజమైన స్వరాలతో సిస్టమ్‌కు శిక్షణ ఇచ్చాం. దీనివల్ల లెర్నర్స్ పంజాబీ, బెంగాలీ, తమిళం, మరాఠీ... ఏ యాసలో మాట్లాడినా సరే, అది అర్థం చేసుకొని కచ్చితమైన ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది.→ పది మిలియన్ల డౌన్లోడ్ల స్థాయికి చేరుకోవడం రాత్రికి రాత్రి జరగలేదు. ఒకే ఒక్క చానెల్ ద్వారా సాధ్యపడలేదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి లెర్నర్లు ఎదుర్కొంటున్న సమస్యలను 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకొని, విశ్లేషించుకొని ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేశాం. భయంభయంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడేలా చేశాం. మన దేశంలో స్పోకెన్ ఇంగ్లీష్ సాధనాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఎంత ఎక్కువమందికి చేరువ అవుతామనేదే అసలు సిసలు విజయం. మౌత్‌టాక్ మా విజయానికి ప్రధాన కారణం.→ మేము కేవలం కొన్ని భాషలను నేర్పించడానికో లేదా ప్రజలను ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం కోసం సిద్ధం చేయడానికో ప్రయత్నించడం లేదు. నిజజీవిత సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదాహరణకు ఆఫీసులో మేనేజర్‌తో ఎలా మాట్లాడాలి, డాక్టర్‌కు అనారోగ్య లక్షణాలను ఎలా వివరించాలి, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలి...మొదలైనవి. నిజజీవిత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాఠాలను డిజైన్ చేయడం వల్ల లెర్నర్లు తమకు అలవాటైన వాతావరణంలో ఉన్నట్లు భావిస్తారు. దీంతో వారు ఉత్సాహంగా, వేగంగా నేర్చుకుంటారు.– అర్పిత్ మిట్టల్, ఫౌండర్, స్పేస్ఎక్స్.ఏఐ -
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్‌తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్‌కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్‌ఫామ్‌లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్‌ఫామ్‌ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్‌ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్‌లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్‌చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్‌ఫామ్ ‘ఫార్మర్‌చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్‌చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్‌చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్‌చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్‌చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అది ముస్లిం లీగ్–మావోయిస్టు కాంగ్రెస్
జైపూర్/సనంద్: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల ఎదుట మనదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదని మండిపడ్డారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) నేడు ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందంటూ ధ్వజమెత్తారు. ముస్లిం లీగ్ వల్ల భారతదేశం ముక్కలైందని చెప్పారు. నేడు కాంగ్రెస్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మావోయిస్టుల దారిలోనే నడుస్తూ దేశంపై దాడి చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్‌లోని అజీ్మర్లో పర్యటించారు. రూ.16,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా జరిగే హ్యూమన్ ప్యాపిలో మా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం విదేశీయుల ఎదుట భారతదేశాన్ని కించపర్చడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే ఉందన్నారు. అది తట్టుకోలేక దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రతీకా రం తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని కించపర్చడం, సైనిక దళాలను బలహీనపర్చడం కాంగ్రెస్‌కు అలవాటేనని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, పేపర్ లీక్ వార్తలు నిత్యం వచ్చేవని గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని, ప్రజలకు ఎనలేని మేలు చేస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేడు పేపర్ లీక్‌లు లేవని, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. నేడు తిరుప్పరకుండ్రంలో మోదీ పూజలు ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఆదివారం మదురై, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. తిరుప్పరకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్వేర్ రంగంలో భారత్ తన సత్తాను ఇప్పటికే నిరూపించుకుందని ఆయన చెప్పారు. అలాగే హార్డ్‌వేర్ రంగంలోనూ శరవేగంగా దూసుకెళ్తోందని, ప్రత్యేక గుర్తింపును సాధిస్తోందని తెలిపారు. అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్లాంట్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య బలమైన మైత్రికి ఇదొక ఉదాహరణ అని వివరించారు. ఇది ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్. భారత్‌లో ఈ తరహా ప్లాంట్లలో ఇదే మొదటిది కావడం విశేషం. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వ్యాపార వృద్ధికి ఇక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయని సూచించారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత శతాబ్దాన్ని చమురు శాసించిందని, ఇప్పుటి శతాబ్దాన్ని మైక్రోచిప్ శాసించబోతోందని తేలి్చచెప్పారు. -
చేలు.. ఏఐ మేలు
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉపకరించే ఏఐ ఆధారిత సాంకేతికతలపై వెలువడిన సంకలనం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏఐ–అగ్రిటెక్ ఇన్నోవేషన్ సెంటర్, వాధ్వానీ ఏఐ, ప్రపంచ బ్యాంకు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో రూపొందిన ఈ సంకలనంలో 13 దేశాల్లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న 260 ఆవిష్కరణల్లోంచి 26 ఉత్తమ ఏఐ వ్యవసాయ ఆవిష్కరణలను పొందుపరిచారు. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చేందుకు 13 ఏఐ సాంకేతికతలు, కోత అనంతరం, ట్రేసబిలిటీ, మార్కెట్ అవకాశాలపై 4, రుణ పరపతికి సంబంధించినవి 2, కార్బన్ మార్కెట్లపై 2, మరో 5 అభివృద్ధి దశలో ఉన్న ఏఐ సాంకేతికతల గురించి ఇందులో వివరించారు.కొన్ని ఏఐ వ్యవసాయ సాంకేతికతలు.. వాటి పనితీరు ఇలా..⇒ మహారాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ‘మహా విస్తార్’ మొబైల్ అప్లికేషన్లు, వెబ్ ప్లాట్‌ఫామ్స్, వాయిస్ బేస్డ్ సరీ్వసులను రైతులకు అందిస్తోంది. పంటల సాగు, పశువులు/ కోళ్లు/ చేపల రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను స్థానిక భాషలో అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ యాప్‌ను ఇప్పటికే 22 లక్షల రైతులు డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. రైతులు అడిగిన 15 లక్షల ప్రశ్నలకు ఏఐ సహకారంతో జవాబులు ఇచ్చారు.⇒ డిజిటల్ జ్ఞానం తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే త్రీ–ఇన్–వన్ ఏఐ డిజిటల్ వ్యవస్థ ‘ఫామ్బెటర్’. కెన్యా రూపొందించగా ఆఫ్రికా దేశాల రైతులు వాడుతున్నారు. 30% వరకు దిగుబడి పెరిగింది. 15% వరకు కోత అనంతర నష్టాలు తగ్గాయి. ⇒ తెలంగాణలో విత్తనోత్పత్తి రైతులకు ఉపయోగపడుతున్న ఏఐ ఆధారిత సీడ్ ఇంటెలిజెన్స్ డాష్‌బోర్డ్ వ్యవస్థ ‘సీడ్‌వర్క్స్ కోపైలట్’. దీని ద్వారా 8 వేల హైబ్రిడ్ వరి విత్తన రైతులు లబ్ధి పొందారు.⇒ 17 ఏళ్ల అనుభవంగల డిజిటల్ గ్రీన్ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వైజరీ ప్లాట్‌ఫామ్ ‘ఫార్మర్‌చాట్’. 4 లక్షల మంది భారతీయ రైతులతోపాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్ రైతులు వాడుతున్నారు. దీని సాయంతో రైతులకు వ్యవసాయ విస్తరణ వ్యయం 35 డాలర్ల నుంచి ఒక డాలర్‌కు తగ్గింది. ⇒ కాలిఫోర్నియా (అమెరికా)కు చెందిన ‘స్పోర్కామ్’గాలిలోని క్రిములను కనిపెట్టి రానున్న చీడపీడల గురించి రైతులకు ముందస్తు సూచనలిస్తుంది. 4 కోట్ల ఎకరాల్లో వాడుతున్నారు.⇒ తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో 1.2 కోట్ల మంది రైతులకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ‘ఫీల్డ్వైజ్’ఏఐ సేవలందిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా దోహదపడుతోంది. ⇒ పశువుల మెడలో సెన్సార్‌ను అమర్చడం ద్వారా జబ్బులను ముందే పసిగట్టేందుకు ‘కౌ నెక్లెస్ సెన్సార్స్’సంస్థ ఏఐ సేవలందిస్తోంది. ⇒ గుజరాత్‌కు చెందిన పరేఖ్ అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్ డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. రైతులు తమ ధాన్యానికి 5% నుంచి 7% అధిక ధర పొందుతున్నారు. ⇒ పండ్ల నాణ్యతను గుర్తించి గ్రేడింగ్ చెయ్యడంలో 95% కచ్చితత్వంతో ఏఐ ఆధారిత పరికరం పంజాబ్ రైతులకు సేవలందిస్తోంది. ⇒ సింగపూర్‌కు చెందిన ‘టీఆర్‌ఎస్‌టీ01’సంస్థ దక్షిణాసియా దేశాల్లోని లక్షన్నర మంది రైతులకు ట్రేసబిలిటీ సేవలందిస్తోంది. ⇒ ‘ఖేత్స్కోర్’సంస్థ రైతు పరపతి సామర్థ్యాన్ని తెలియజెప్పే స్కోర్‌ను అందిస్తోంది. ఈ స్కోర్ ఆధారంగా రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. ⇒ గులాబి పురుగు నుంచి పత్తిని కాపాడే ఏఐ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ టెక్నాలజీని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ రూపొందించింది. దీని సాయంతో 39% పురుగుమందుల వాడకం తగ్గింది. 18% దిగుబడి పెరిగింది. ⇒ ఐసీఏఆర్ రూపొందించిన ఏఐ ఆధారిత సాయిల్ టెస్టింగ్ వ్యవస్థ ‘వసుధ’. ⇒ ద్రాక్ష తదితర పండ్ల తోటల్లో పురుగుమందుల పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడే ఏఐ ఆధారిత ‘ఫామ్ గార్డియన్ రోవర్’వ్యవస్థ మహారాష్ట్రలో వినియోగిస్తున్నారు.⇒ దేశంలో 86% మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన మొబైల్ యాప్ ఆల్ట్ కార్బన్. నేలలోని 25 స్థూల, సూక్ష్మ పోషకాల స్థాయిని, వాతావరణ పరిస్థితులను మిళితం చేసి రైతులకు స్పష్టమైన సూచనలు చేసే విలక్షణ యాప్ ఇది. పశ్చిమ బెంగాల్లో 2,847 మంది వరి, తేయాకు రైతులు దీన్ని వాడటం ద్వారా 18% ఎరువుల వాడకం తగ్గించుకొని 20% నుంచి 32% మేరు దిగుబడి పెంచుకున్నారు. ఏఐతో సాగుకు సాయం...వ్యవసాయ సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో, ఒడిదుడుకులను తట్టుకుంటూ దిగుబడులను పెంచుకోవడంలో కృత్రిమ మేధ దోహదపడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులతో కలసి ఆచరణాత్మక శాస్త్రీయ దృష్టితో రూపొందించే ఏఐ వ్యవస్థలు ప్రయోజనకరమైన డిజిటల్ సూచనలను అందించగలుగుతున్నాయి. కానీ సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతలను సక్రమంగా అమలు చేస్తే వాతావరణ మార్పులను, ఒడిదుడుకులను తట్టుకునేందుకు దోహదపడతాయి. – డాక్టర్ ఎం.ఎల్. జాట్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ -
నిందితులకు మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలోని కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ముగ్గురి కస్టడీని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకోగా, 24 గంటలపాటు చోటుచేసుకున్న నాటకీయ పరిణామా ల మధ్య వారిని ఢిల్లీ పోలీసులు దేశరాజధానికి తరలించారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించినప్పటికీ హిమాచల్ పోలీసులు ఢిల్లీ పోలీసులను దాదాపు ఐదు గంటలపాటు దిగ్బంధించారు. ఎట్టకేలకు నిందితులతోపాటు వారు ఢిల్లీకి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గురువారం పోలీసులు ముగ్గురినీ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మృదుల్ గుప్తా ఎదుట హాజరు పరిచారు. విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. నిందితుల్లో యూపీ వాసులైన సౌరభ్, అర్బాజ్ ఖాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ అవధూత్లు అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్టులో దాక్కున్నారని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. బుధవారం ఉదయం 6.40 గంటల వేళ వారిని అదుపులోకి తీసుకుని, అదే రోజు మధ్యా హ్నం 1.40కి సిమ్లాలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి, ట్రాన్సిట్ రిమాండ్‌కు కోరామన్నారు. అనుమతించిన కోర్టు.. వారిని 18 గంటల్లోగా సంబంధిత కోర్టులో హాజరుపర్చాలని షరతు పెట్టిందని వివరించారు. ఇంపాక్ట్ సమిట్ వద్ద నిరసన తెలిపేందుకు వాడిన టీషర్ట్‌ను సిద్ధార్థ్ డిజైన్ చేయగా, సౌరభ్ నిరసనకు పిలుపునిచ్చే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడని, సౌరభ్, అర్భాజ్లు నిరసనలో పాల్గొన్నారని లాయర్ పేర్కొన్నారు. నిరసన కోసం లక్షకు పైగా టీషర్టులను ప్రింట్ చేశారని, వీటిని ఎక్కడ ప్రింట్ చేశారు? దీని వెనుక ఎవరెవరున్నారో తెల్సుకునే ప్రయత్నా ల్లో ఉన్నామన్నారు. అయితే, నిరసన తెలిపారనే సాకుతో ఢిల్లీ పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారని, ఇదంతా రాజకీయ పేర్రేపితమని నిందితుల తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న మేజి్రస్టేట్ నిందితుల ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటో తేదీన తిరిగి వారిని తమ ఎదుట హాజరుపర్చాలని కోరారు. వీరితోపాటు ఈ కేసులో అంతకుముందే అరెస్ట్ చేసిన అజయ్ కుమార్, రాజా గుజార్ అనే వారి రిమాండ్ గడువు ముగియడంతో వారిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో, వారి రిమాండ్‌ను మరో మూడు రోజులకు పొడిగిస్తున్నట్లు మేజి్రస్టేట్ తెలిపారు. -
పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అరెస్ట్ కారణంగా ఢిల్లీ పోలీసులు, హిమాచల్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో, సిమ్లాలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరకు మేజిస్ట్రేట్ నుంచి రిమాండ్ ఆర్డర్ రావడంతో ఈ వివాదానికి తెరపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. వీరిలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యూత్ కాంగ్రెస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని ఒక హోటల్లో ఉన్న సౌరభ్, సిద్ధార్థ్, అర్బాజ్‌లను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు.. బుధవారం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులు మఫ్టీలో రావడంతో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అలాగే, ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి విధి విధానాలు పాటించలేదని హిమాచల్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. #WATCH | Additional Chief Judicial Magistrate (ACJM-II) court in Shimla granted transit remand to three accused arrested by the Delhi Police from Rohru in Shimla district.The three accused, Saurav, Arbaaz and Siddharth, were produced at around 1.00 am at the residence court of… pic.twitter.com/VSyEK2Mr1u— ANI (@ANI) February 25, 2026అనంతరం, ఢిల్లీ పోలీసులు.. ముగ్గుర్ని రాత్రి అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. వారికి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని రాజధానికి తీసుకెళ్లే అనుమతి పొందారు. అనంతరం, ఢిల్లీ వెళ్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి వారిని హిమాచల్ పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసులు సీజ్ మెమో కాపీని చూపించడంతో హిమాచల్ పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణంగానే ఇలా జరిగిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. Delhi police went to arrest IYC members from Shimla and Himachal police arrested them in the morning, they got court order and got released and again arrested in the evening 😂😂👏🏼pic.twitter.com/mSezH1H96b— Vijay Thottathil (@vijaythottathil) February 25, 2026VIDEO | Shimla: A jurisdiction dispute has erupted after the Delhi Police detained three Youth Congress workers in connection with an AI Summit protest pic.twitter.com/H7o7eaYOb8— Press Trust of India (@PTI_News) February 25, 2026 -
కాంగ్రెస్ నిరసనపై.. మాజీ న్యాయమూర్తుల ధ్వజం
ఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై దేశవ్యాప్తంగా దుమారం చేలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటనను మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన జాతిద్రోహ చర్యగా అభివర్ణించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ చర్యలపై 270కి పైగా మాజీ న్యాయమూర్తుులు, అధికారులు కలిసి సంయుక్తంగా కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇది అకస్మికంగా జరిగింది కాదు. ఈ కుట్రను ముందుగానే ప్లాన్ చేశారు. ప్రపంచ సాంకేతికతకు చెందిన నాయకులకు, అంతర్జాతీయ ప్రతినిధులకు అతిథ్యం ఇస్తున్న తరుణంలో ఇలాంటి నిరసన చేయడం సరికాదు. ఇది జాతిద్రోహం. ఇది భారత దేశ ప్రతిష్ఠకు తీరని భంగం అని అన్నారు.ప్రపంచస్థాయికి కార్యక్రమాలు జరుగుతున్న వేదికలపై నిరసన తెలిపితే.. భారతదేశం ప్రపంచస్థాయి పెట్టుబడులకు మార్గంగా కాకుండా నిరసనలు జరిగే దేశంగా గుర్తింపు పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల భారత్‌కు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు మన దేశ శాస్త్రవేత్తల కృషిని, ఇంజనీర్ల కోరికను, 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలను అపహాస్యం చేస్తుందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంగా నిరసన తెలపడమనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ, దేశాన్ని బహిరంగంగా ఇబ్బంది పెట్టే విధంగా అది ఉండకూడదన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే "మేధోపరమైన కఠినత్వం మరియు పార్లమెంటరీ చర్చ" ద్వారా వాటిని వ్యక్తపరచాలని పేర్కొన్నారు. ఇటువంచి చర్యల వల్ల హానీ ప్రభుత్వాలకు కలగదని... ప్రజలకు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సంయుక్త ప్రకటనలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ఎన్ ధింగ్రా, త్రిపుర మాజీ డిజీపీ బీఎల్ వోహ్రా తదితర ప్రముఖులున్నారు.అయితే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన చేపట్టడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? అని ప్రశ్నించారు. కాగా గ్లోబల్ సమ్మిట్‌లో భారత ప్రతిష్ఠ దిగజార్చేలా కాంగ్రెస్ నిరసన చేపట్టిందని పలువురు విమర్శలు చేస్తున్నారు. -
అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?
మీరట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. సొంత దేశాన్ని కించపరుస్తారా? ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయమా? కాంగ్రెస్ తీరుతో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్‌సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి. మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఢిల్లీ–మీరట్ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్ కాలేఖాన్, న్యూ అశోక్‌నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి శతాబ్దినగర్ స్టేషన్ దాకా మెట్రో సెక్షన్‌ను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్ సౌత్ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. -
‘అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత’
న్యూఢిల్లీ: ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకొనే దిశగా కీలకమైన ముందడుగు పడింది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ(అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషం) అనే స్ఫూర్తితో భారత్ రూపొందించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్’ను ప్రపంచ దేశాలు ఆమోదించాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా శనివారం ఈ డిక్లరేషన్‌పై 86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. మానవాళి బాగు కోసం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ ప్రయోజనాలను అందరూ సమానంగా పంచుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ నిర్దేశిస్తోంది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, బహుళ భాగస్వాముల మధ్య అనుసంధానం, దేశాల జాతీయ సార్వ¿ౌమత్వాన్ని గౌరవించడం, ఏఐని మరింత ముందుకు తీసుకెళ్లడం, ఏఐ టెక్నాలజీ వినియోగంలో భద్రమైన, విశ్వసనీయమైన ఫ్రేమ్‌వర్క్ నిర్మించడం డిక్లరేషన్ ప్రధాన లక్ష్యం. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఏఐ సాంకేతికతను అందించడమే ధ్యేయం. అంతర్జాతీయ సహకారమే పునాది ఏడు కీలకమైన మూలస్తంభాల ఆధారంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపొందించారు. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి–సామాజిక సంక్షేమం, భద్రమైన–విశ్వసనీయమైన ఏఐ, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఏఐ, సామాజిక సాధికారత సాధన, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, సుస్థిరమైన, ప్రభావవంతమైన, నూతన ఏఐ వ్యవస్థల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. డిక్లరేషన్‌కు అంతర్జాతీయ ఏఐ సహకారమే పునాదిగా నిలుస్తోంది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’శనివారం ఈ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సదస్సులో పాల్గొన్న దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక పరివర్తనలో ఏఐ పోషించబోయే పాత్రను డిక్లరేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ ఎకోసిస్టమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తక్కువ ఇంధనంతో పనిచేసే ఏఐ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైన్స్, పరిపాలన, ప్రజాసేవల పంపిణీలో ఏఐ వినియోగం పెంచుకోవాలని స్పష్టంచేశారు. ఈయూ, ఐఎఫ్ఏడీ ఆమోదం న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన వాటిలో రష్యా, ఆ్రస్టేలియా, బెల్జియం, భూటాన్, బ్రెజిల్, కెనడా, డెన్మార్క్, ఇస్తోనియా, ఇథియోపియా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, ఇండోనేసియా, ఇరాన్, హంగేరీ, గ్రీస్, జర్మనీ, ఫిన్లాండ్, మెక్సికో, యూఏఈ, ఉక్రెయిన్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, టాంజానియా, స్విట్జర్లాండ్, నార్వే, ఒమన్, ఫిలిప్పైన్స్, పెరూ, రొమేనియా, నేపాల్, మయన్మార్, న్యూజిలాండ్ తదితర దేశాలున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్(ఐఎఫ్ఏడీ) సైతం డిక్లరేషన్‌ను ఆమోదించాయి. సమతుల్యం అత్యంత కీలకం: అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘మానవ కేంద్రీకృత ఏఐ దార్శనికత’ను ప్రపంచదేశాలు ఆమోదించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కృత్రిమ మేధ వనరులను ప్రజాస్వామీకరించడం వల్ల ఏఐ సేవలు, సదుపాయాలు, సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమాన్ని సమతుల్యం చేసుకోవడం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆర్థిక ప్రగతిని మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంలో భద్రత, విశ్వాసం ముఖ్యమైన అంశాలేనని చెప్పారు. భద్రమైన, విశ్వసనీయ, బలమైన ఐఏ ప్రేమ్‌వర్క్‌ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ పరస్పరం కలిసి పని చేయడానికి ముందుకొచ్చాయని వైష్ణవ్ స్పష్టంచేశారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ సూక్తిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఆమోదించాయని స్పష్టంచేశారు. -
సుందర్ పిచాయ్‌తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలు
న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో గూగుల్ ఉద్యోగి సీఈఓ సుందర్ పిచాయ్‌ను కలవడం గురించి చేసిన హృదయపూర్వక పోస్ట్ ఆన్లైన్లో అందరినీ ఆకట్టుకుంది. గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అయిన తనుషి గుప్తా సుందర్ పిచాయ్ కలవాలనే తన చిరకాలకలను సాకారం చేసుసుకున్న వైనం గురించి లింక్డ్ఇన్లోపోస్ట్ చేసింది.గుర్గావ్ కార్యాలయంలో సుందర్ పిచాయ్‌తో తన సంభాషణను సంగ్రహించిన వీడియో క్లిప్‌తో పాటు, ఆ భావోద్వేగ క్షణాన్ని ఆ ఒక కలగా అభివర్ణించింది. తన చిన్ననాటినుంచి తనకు 'రోల్ మోడల్' అయిన వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ ఎన్కౌంటర్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలిపింది. అలాగే తాను గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ని మాత్రమే కాదనీ, మేకప్ కంటే యంత్రాలను ఎంచుకున్న చిన్న అమ్మాయినని పేర్కొంది. టెక్ గురించి అంతులేని ఆసక్తి ఉన్న విద్యార్థిని. వస్తువులను కొనడం కంటే వస్తువులను నిర్మించడం ముఖ్యమని నమ్మిన అమ్మాయి నంటూ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశంసోషల్ మీడియా స్పందనఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 259,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు తాము ఆరాధించే ప్రజా వ్యక్తులను కలిసిన అనుభవాలను పంచుకున్నారు.> తనుషి కథతోపాటు మరో యువకుడి సరదా సంభాషణ కూడా నెట్టింట సందడిగా మారింది. యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిన అనంత్ లథా స్టోరీ ఇది. ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’ అను యూట్యూబ్ ని రన్ చేస్తున్న అనంత్ ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేయడంతోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేశాడు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం వచ్చిన తాను నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ పలకరించానని చెప్పుకొచ్చాడు. దీనికి ఆశ్చర్యపోయిన పిచాయ్ ఎలా అని ప్రశ్నించారట. తానొక యూట్యూబర్నిని, మీ మూలంగానే నెలనెలా యూట్యూబ్ నుంచిఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన సరదాగా నవ్వేశారంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234) -
AI సమ్మిట్‌లో నిరసనలు.. యూత్ కాంగ్రెస్‌పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో యూత్ కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అంటూ మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే AI సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అంటూ.. నిరసనలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. It is absolutely deplorable that members of the Youth Congress chose the AI Impact Summit 2026 as a venue for petty political theatricsUsing such a global platform for protests will project our great nation India in a poor light internationallyWhile difference of opinion is… pic.twitter.com/sM3MmIb8UJ— KTR (@KTRBRS) February 21, 2026 -
ఏఐ: ఆల్ ఉమెన్ ఇంటెలిజెన్స్
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనేది సిలికాన్ వ్యాలీ వాసుల, బడా కంపెనీల వ్యవహారం’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. మారుమూల పల్లెలోని పార్వతమ్మకు కూడా ఇప్పుడు ‘ఏ.ఐ.’పై ఆసక్తి పెరిగింది. స్వయం సహాయక బృందాల నుంచి వ్యాపారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనుకునే చిన్న స్థాయి మహిళా వ్యాపారుల వరకు ఏ.ఐ. సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026’ అనేది సాంకేతిక దిగ్గజాల సదస్సు మాత్రమే కాదు, సామాన్య మహిళలు సైతం ఆసక్తి చూపే సదస్సు అయింది...వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తేనున్నది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ హైలెట్ చేసింది. అట్టడుగు స్థాయిలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయంలో భాష, మార్కెట్ యాక్సెస్, పరిమిత వనరులలాంటి అడ్డంకులను అధిగమించడంలో గ్రామీణ మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతోంది.బహుళ ప్రయోజన శిక్షణ‘షీ లీడ్స్ భారత్’లాంటి ఏఐ ఇన్నోవేటివ్ ప్లాట్‌ఫామ్‌లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగసామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇస్తోంది షీ లీడ్స్. ఎలాంటి వస్తువులకు అధిక డిమాండ్ ఉందో గుర్తించడం నుంచి వాటికి సరిౖయెన ధరలను నిర్ణయించడం, కస్టమర్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి... మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, ‘మేరీ సహేలి’ యాప్‌లో విలీనం చేసిన ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ‘మహిళల నేతృత్వంలోని గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడానికి, ఏఐకి సంబంధించిన బాధ్యతాయుతమైన, ఆచరణాత్మక ఉపయోగాల అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది షీ లీడ్స్ భారత్.గల్లీ నుంచి దిల్లీ వరకుఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లా నవహానిపూర్ గ్రామానికి చెందిన రుచిసింగ్ స్వయం సహాయక బృందంలో సభ్యురాలు. స్మార్ట్‌ఫోన్ ల నుంచి ఏఐ–ఎనేబుల్డ్ ఫ్లాట్‌ఫామ్‌ల వినియోగం వరకు ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా రుచిసింగ్లాంటి మహిళలకు దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులోని విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ‘ఏఐ సమ్మిట్’లో తమకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్–ఆమెదిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026లో వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ సదస్సులో ‘ఏఐ కాలంలో మహిళలకు ఎదురవుతున్న భద్రతా సమస్యలు–డిజిటల్ ప్రపంచంలో అసమానతలు’... మొదలైన వాటి గురించి నటి, రచయిత్రి సోహ అలీఖాన్ ప్రసంగించారు. ఏఐ టూల్స్ విస్తృతస్థాయి ఉపయోగాలతో పాటు దుర్వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.‘ఏఐ సాంకేతికత వల్ల ఫేక్ ఇమేజ్‌లను సృష్టించడం నుంచి డాటా దుర్వినియోగం వరకు హానికరమైన పనులు అత్యంత వేగంగా జరుతున్నాయి’ అని ఏఐలోని ప్రతికూలతల గురించి ప్రస్తావించారు సోహ అలీఖాన్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భయాలు, అపోహలు ఉన్నాయి. అవి నిజం కాదు’ అంటూ వైద్య రంగానికి ఏఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... అనివార్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్యుల అవసరాన్ని లేకుండా చేసేది కాదు. వైద్యుల భారాన్ని తగ్గించేది. ఏఐ సాంకేతికతపై రకరకాల భయాలు, అపోహలు ఉన్నాయి. అయితే ఇది నిజం కాదు. వైద్య సమాజానికి ఏఐ సాంకేతికత అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నిపుణులు కాని వారు ఏఐ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. మన దేశంలోని విస్తారమైన జనాభా, ప్రాంతాల మధ్య వైవిధ్యాలు, వైరు«ధ్యాలు, గ్రామీణ–పట్టణ విభజన, సవాళ్లు విసురుతున్న అంటువ్యాధులు... ఈ నేపథ్యంలో సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివార్యమైన సహాయకారిగా మారుతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. – అనుప్రియ పటేల్, కేంద్రమంత్రిపవర్ హిట్టర్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతికతను మాత్రమే కాదు వ్యూహాలు, నాయకత్వం, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా పునర్నిర్వచిస్తోంది. ఏఐ అనేది టీ 20 క్రికెట్లో ‘పవర్ హిట్టర్’లాంటిది. టీ 20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ను చూశారు. ఇలాంటి పవర్ హిట్టరే ఏఐ. సంస్థలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచించే సామర్థ్యం ఏఐకి ఉంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కొత్త శక్తితో, కొత్త దారులలో సంస్థలు పయనిస్తాయి. వ్యాపార నమూనాలు మారుతాయి. వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ నైపుణ్యంతో పనిచేస్తారు. ఏఐ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేది ముఖ్యం కాదు ఎంత బాధ్యతతో ఉందనేది ముఖ్యం. బాధ్యతాయుతమైన ఏఐ అనివార్యం.– రోహిణి నాడర్ మల్హోత్రా, చైర్పర్సన్, హెచ్సీఎల్ఏఐ... ఎన్నో ద్వారాలు!లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పని చేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్లైన్ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతులు ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీరి విజయగాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళా సాధికారతకు ఆన్లైన్ టూల్స్ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి.– సోహా అలీఖాన్, నటి, రచయిత్రి -
ఏఐ సదస్సు ద్వారా 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా వివిధ దేశాల నుంచి 250 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు రాబట్టినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే మరో 20 బిలియన్ డాలర్ల మేర డీప్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ సదస్సు పూర్తి స్థాయిలో విజయవంతమైందని శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయల రంగంలో ఈ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రతిపాదిత ఢిల్లీ డిక్లరేషన్‌కు 70 దేశాలు ఇప్పటికే మద్దతు పలికాయని అన్నారు. శనివారం కల్లా ఈ సంఖ్య 80కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డిక్లరేషన్‌పై శనివారం సంతకాలు జరుతాయని వివరించారు. సదస్సును 5 లక్షల మందికిపైగా ప్రజలు సందర్శించారని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని స్పష్టంచేశారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై పూర్తి వివరాలను సదస్సు ముగిసిన తర్వాత బహిర్గతం చేస్తామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇండియా ఏఐ మిషన్ 2.0లో భాగంగా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పష్టంచేశారు. -
సీఈఓలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్‌టెక్ స్టార్టప్‌ల వ్యవస్థాపకులతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్గులాం, లీచెన్‌స్టైన్ రాకుమారుడు అలోయిస్‌తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. గుటెరస్‌తో సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్‌కు హామీ ఇచ్చారు. -
పాక్స్ సిలికాలోకి భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్‌సిలికా కూటమిలో భారత్ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్బర్గ్ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. కూటమి మరింత బలోపేతం: గోర్ 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్‌సిలికా కూటమి పునర్ నిర్వచిస్తుందని గోర్ జోస్యం చెప్పారు. భారత్ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్‌కూ బాగా తెలుసు’’అని గోర్ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్‌సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కీలక నిర్ణయం: వైష్ణవ్ పాక్స్‌సిలికా కూటమిలో చేరికను భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్ చిప్స్‌ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్‌కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు. ఏమిటీ పాక్స్‌సిలికా? ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్లో పాక్స్‌సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్‌కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్‌లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్‌సిలికా కూటమిలో చేరేలా భారత్‌ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్‌ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి తెలుసా?
గత రెండు దశాబ్దాల్లో డ్రోన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. మన దేశం కూడా ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వ్యవసాయం, పాలన, అభివృద్ధి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా డ్రోన్ల వాడకం చిన్నగా ప్రారంభమైనా ఇప్పుడు ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది. నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద 1,094 డ్రోన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను, జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. న్యూఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా డ్రోన్ల హవాపై ఫోకస్...మన దేశంలో ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంతో పాటు భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల తనిఖీ, విపత్తు నిర్వహణ, రైల్వే, హైవేల పర్యవేక్షణ వంటి పనుల కోసం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల తయారీదారులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, ధ్రువీకృత పైలట్ల కృషితో డ్రోన్ల వినియోగం ప్రభుత్వ నిబంధనలకు లోబడి నానాటికీ విస్తరిస్తోంది.కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026 నాటికి దేశంలో 38,500కు పైగా నమోదిత డ్రోన్లు(యూఐఎన్) వాడుకలో ఉన్నాయి. 39,890 డీజీసీఏ–ధ్రువీకృత పైలట్లు సేవలందిస్తున్నారు. 244 శిక్షణా సంస్థలు డ్రోన్ సంబంధిత నైపుణ్యాలను అందిస్తున్నాయి. స్వమిత్వ పథకం కింద డ్రోన్లను ఉపయోగించి 3.28 లక్షల గ్రామాలను సర్వే చేశారు. 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను రూపొందించారు.సరళీకృత విధాన నిర్ణయాలు డ్రోన్ వ్యవస్థ విస్తరణకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ రంగం ఇంతగా అభివృద్ధి చెందింది. సరళీకృతమైన డ్రోన్ నియమాలు, ‘డిజిటల్ స్కై’ సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్, తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, లక్షిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్ వినియోగాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో డ్రోన్లను చేర్చడం వల్ల పనులు మరింత వేగంగా, పారదర్శకగా జరుగుతున్నాయి.నమో డ్రోన్ దీదీ సేవలునవంబర్ 2023లో ప్రారంభించిన ‘నమో డ్రోన్ దీదీ’ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.డ్రోన్ దీదీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ ఎరువుల కంపెనీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నమో డ్రోన్ దీదీ పథకం కింద అందించినవి 500కు పైగా డ్రోన్లు ఉన్నాయి.నమో డ్రోన్ దీదీ పథకం (Namo Drone Didi Scheme) శ్రమతో కూడిన పాత పిచికారీ పద్ధతులకు స్వస్తి చెప్పి.. కచ్చితమైన ఫలితాలు సాధించే కృషి దిశగా వ్యవసాయంలో గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఒక డ్రోన్ దీదీ మాట్లాడుతూ డ్రోన్ శిక్షణ తనను శక్తివంతం చేసిందన్నారు. స్వయం సహాయక సంఘం తరఫున నానో ఎరువులు, పురుగు మందుల పిచికారీ సేవలను అందిస్తూ ఆదాయం పొందుతున్నానని వివరించారు.డ్రోన్ల నిబంధనలు మీకు తెలుసా?దేశంలో డ్రోన్ల వినియోగం వేగవంతంగా విస్తరిస్తోంది. డ్రోన్ల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, ఆర్థిక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి, స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది.డ్రోన్ రూల్స్ 2021ను 2022, 2023లలో సవరించారు. ఈ సవరణలు మన దేశ డ్రోన్ వ్యవస్థను సరళీకరించాయి.నియంత్రణ విధానాలు సులభతరమయ్యాయి. ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5కి తగ్గించారు. అనుమతుల అవసరాలను 72 నుంచి కేవలం 4కు తగ్గించారు.ఫీజుల హేతుబద్ధీకరణ జరిగింది. డ్రోన్ పరిమాణంతో సంబంధం లేకుండా ఫీజుల నిర్ణయం జరిగింది.పౌర డ్రోన్ కార్యకలాపాల్లో 500 కేజీల బరువు వరకు ఉన్న డ్రోన్ల వాడకానికి అనుమతి లభించటంతో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగం పెరిగింది. గగనతలంలో దాదాపు 90%ను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ప్రభుత్వం అనుమతిస్తున్నది.‘సాంప్రదాయ పైలట్ లైసెన్స్‌కు బదులుగా డీజీసీఏ జారీ చేసే ‘రిమోట్ పైలట్ సర్టిఫికేట్’ను ప్రవేశపెట్టారు.పాస్‌పోర్ట్ అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ, అడ్రస్ ప్రూఫ్ ఉంటే డ్రోన్లను నడపడానికి సరిపోతుంది.మొత్తంగా ఈ సంస్కరణలు డ్రోన్ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి గల అడ్డంకులను గణనీయంగా తగ్గించాయి. డ్రోన్ సేవల అందుబాటును గ్రామాల్లో పెంచడానికి దోహదపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి పీఎల్ఐ పథకానికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించింది. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, దేశీయ డ్రోన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది.సెప్టెంబర్ 2025లో డ్రోన్లపై జీఎస్టీని ఏకరీతిగా 5 శాతానికి తగ్గించారు. అంతకుముందు 18%, 28% పన్ను రేట్లు ఉండేవి.డ్రోన్ రిజిస్ట్రేషన్, రిమోట్ పైలట్ సర్టిఫికేషన్, టైప్ సర్టిఫికేషన్, ఆర్టీపీఓ అధికారాల వంటి నియంత్రణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్ నుంచి ఈజీసీఏకి మార్చారు. విమాన ప్రణాళిక, ఎయిర్‌స్పేస్ మ్యాప్ వంటి కార్యాచరణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానితమై కొనసాగుతున్నాయి.చదవండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?మన దేశంలో డ్రోన్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టుల స్థాయి నుంచి ఆవిష్కరణ–ఆధారిత ప్రధాన స్రవంతి రంగంగా ఎదిగింది. మహిళా సాధికారత, గ్రామీణ సదుపాయాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో ప్రభుత్వం సాంకేతిక ఆవిష్కరణలను, విస్తృత డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయం, భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు అంచనా, పౌర సేవల పంపిణీ వంటి కీలక రంగాలలో భాగమయ్యాయి. పంట నష్టాల సేకరణ సులువుదేశంలో అనేక రంగాల్లో డ్రోన్లు వివిధ రంగాలలో సామాజిక–ఆర్థిక అభివృద్ధి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయంలో వీటి వినియోగం మహిళా రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా పంట నష్టాల అంచనా పనులను మెరుగుపరిచింది. మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలో ఇవి చురుకైన పర్యవేక్షణ, మెరుగైన వనరుల నిర్వహణకు వీలు కల్పించాయి. భూ వివాదాల పరిష్కారానికి డ్రోన్లుసర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రువైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వమిత్వ) పథకంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. దీన్ని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడానికి, బ్యాంకు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత మ్యాపింగ్ చేపట్టారు.డిసెంబర్ 2025 నాటికి 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అన్ని హైవే ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా డ్రోన్–వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరి చేసింది.విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ యూఏవీలు/డ్రోన్లను ఉపయోగిస్తోంది. అదేవిధంగా, దేశ రక్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. – నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
AI ఇంపాక్ట్ సమ్మిట్ : వాటికోసం ఎగబడిన జనం వీడియో వైరల్
న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో మరో అంశం నెట్టింట చర్చకు దారి తీసింది. ఉచిత క్యాలెండర్లు పంపిణీ చేప్పడంతో ఒక్కసారిగా సందర్శకులు ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇండియా AI సమ్మిట్‌లో భారత్ మండపం వద్ద ఉన్న కౌంటర్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఉచితంగా అందిస్తున్న క్యాలెండర్ల కోసం క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను ఎక్స్ యూజర్ డాక్టర్ రంజన్ షేర్ చేయడంతో చర్చకు తెరలేచింది. హై-ప్రొఫైల్ టెక్ ఈవెంట్లో కనీస మర్యాద పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూ కమెంట్ చేశారు. క్యాలెండర్లో ఉపయోగకరమైన సమాచారం ఉండి ఉండవచ్చు,అలాంటి బహుమతులు కంపెనీలకు బ్రాండింగ్‌గా కూడా పనిచేస్తాయి కదా అన్నారు. మరోవైపు వీడియోలో కనిపించే వారిలో చాలామంది నిజమైన AI నిపుణులు లేదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవచ్చు అని కమెంట్ చేయడం గమనార్హం.Visitors queuing up for FREE CALENDARS at the India AI Summit.They'll never change their DEHATI MENTALITY. Poor Beggars. pic.twitter.com/eoBrdPJG0V— Dr Ranjan (@Doc_RGM) February 19, 2026 -
ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన.. బీజేపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది. ఈ సమ్మిట్ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి నినాదాలు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. చివరి రోజు సమ్మిట్‌లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం, చర్చలు-రాజనీతిలో ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. -
ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..
భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దిగ్గజ సీఈవోలు, ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రముఖ నాయకులు విచ్చేసిన ఈ సదస్సులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అందరి ప్రసంగాలు పూర్తి అయ్యాక ఎనిమిదేళ్ల రణ్వీర్ సచ్‌దేవా అతి పిన్న వయస్కుడైన ‘కీ నోట్ స్పీకర్’గా వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా గది అంతా నిశబ్దంగా మారిపోయింది. విప్లవాత్మక అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి తన వయసుకి మించిన జ్ఞానంతో అలవోకగా మాట్లాడి అందర్ని నిశ్చేష్టులయ్యేలా చేశాడు. ఆ బాలుడి ప్రసంగం అక్కడున్న వారందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే భారతీయ తత్వశాస్త్రం కృత్రిమ మేధస్సు (AI)తో ఎలా జతకడుతుంది, AI పట్ల తనకున్న తన ప్రత్యేక ఆసక్తిని, దృక్పథాన్ని పంచుకున్నాడు. ఈ ఏఐ సాంకేతికతకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడుతూ..సాంకేతికత పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రణవీర్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌లను కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా, ఈ ఏఐ విప్లవం వెనుకున్న ఇద్దరు ప్రముఖులతో ఎనిమిదేళ్ల బాలుడు కలిసి పనిచేయడం, అక్కడున్న టెక్ దిగ్గజాలతో సంభాషించడం తదితరాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లలో ఒకదానిలో మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. అయితే రణ్వీర్ టెక్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతను మూడేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు, గతంలో ప్రపంచవ్యాప్తంగా కీనోట్స్‌లో మాట్లాడాడు. తన వయస్సుకు మించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను అధ్యయనం చేశాడు. అప్పటి నుండి అతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్షలాది మందికి ప్రేరణగా మారుతున్నాడు. పైగా టెక్నాలజీకి వయోపరిమితి లేదని రణ్వీర్ ప్రపంచానికి చాటి చెప్పాడు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending) (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
గ్లోబల్ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్‌లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్‌జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్‌లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్‌సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్‌ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్‌ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్‌కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్‌పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్‌గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్‌ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్‌నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్‌లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్. ఏఐ రంగంలో ఢీ అంటే ఢీ అంటున్న ప్రత్యర్థులు. వాటి సీఈఓలు శామ్ ఆల్ట్‌మన్, దరియో అమొదెయ్ గురువారం ఒకే వేదికపైకి వచ్చారు. కానీ చేతులు కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు! ఈ ఇబ్బందికర క్షణాలకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికైంది.ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టెక్ దిగ్గజాలంతా వేదికపైకి వెళ్లారు. గ్రూప్ ఫొటో సందర్భంగా అందరూ చేతులు కలిపి పైకెత్తారు. యాదృచ్ఛికంగా పక్కపక్కనే నిలబడ్డ ఆల్ట్‌మన్, అమొదెయ్ మాత్రం అందుకు నిరాకరించారు. ఎవరికి వారు విడిగా పిడికిళ్లు బిగించి పైకెత్తి సరిపెట్టారు. పైగా నిలబడ్డంతసేపూ ఇద్దరూ చాలా అసౌకర్యంగా కూడా కన్పించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం ఈ ఉదంతంపై ఆల్ట్‌మన్ స్పందించారు. ‘నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. మోదీ నా చేతిని పట్టుకుని పైకెత్తారు. దాంతో ఏం జరుగుతోందో కాసేపటిదాకా అర్థమే కాలేదు’ అని చెప్పుకొచ్చారు."I didn't know what was happening on stage. I was confused. Modi grabbed my hand and put it up, and I just wasn't sure what we were supposed to be doing." - Sam Altman pic.twitter.com/Hs6nlRuSsP— Mini Nagrare (@MiniforIYC) February 20, 2026మాజీ సహోద్యోగులే..కాగా, ఆల్ట్‌మన్, అమొదెయ్ ఒకప్పుడు సహోద్యోగులే కావడం విశేషం. ఆల్ట్‌మన్‌తో పాటు అమొదెయ్ కూడా ఓపెన్ ఏఐలోనే పని చేశారు. ఆయనతో విభేదాల నేపథ్యంలో 2020లో కంపెనీని వీడారు. ఇక, అంతకుముందు శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా అని కుండబద్దలు కొట్టారు. ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్‌మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు. -
ఏఐ ‘విండోస్’!
ఒకట్రెండేళ్లలో ‘ఏఎస్ఐ’: ఆల్ట్‌మన్ ‘‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా’’అని దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఏఐ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్వత్రా చర్చనీయంగా మారిన ఆరి్టఫిíÙయల్ సూపర్ ఇంటలిజెన్స్ (ఏఎస్ఐ) తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి మరో ఒకట్రెండేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాల్లోనూ మానవ మేధను మించిపోయే ఏఎస్ఐని కృత్రిమ మేధ ప్రస్థానంలో కీలకమైన తదుపరి అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం’’అని స్పష్టం చేశారు. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్‌మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.మా పెట్టుబడుల గమ్యస్థానం భారతే: మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్‌కు అతి పెద్ద ఏఐ పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్‌ది అగ్ర స్థానమని సంస్థ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు. ఏఐ వినియోగంలో గ్లోబల్ సౌత్ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఈ విషయంలో గ్లోబల్ సౌత్ చేయాల్సింది ఎంతో ఉంది. డేటా సెంటర్లతో పాటు కనెక్టివిటీ, విద్యుత్... ఇలా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నీ ఎంతగానో మెరుగవ్వాలి. ఇందుకు భారీ పెట్టుబడులు కావాలి. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగమూ ముందుకొస్తేనే ఇది సాధ్యం. గ్లోబల్ సౌత్‌లో ఏఐ విస్తరణకు వచ్చే పదేళ్లలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడానికి కారణం కూడా అదే’’అని వెల్లడించారు. తమ పెట్టుబడి ప్రణాళికల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ అంతరాలను పూడ్చేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ముఖ్యమే అయినా మానవ నైపుణ్యాలే అత్యంత కీలకమని స్మిత్ చెప్పారు.ఏఐ దుర్వినియోగ కట్టడిలో భారత్‌దే కీలకపాత్ర: దరియో ఏఐ వాడకం ఎన్నో సవాళ్లను తెరపైకి తెస్తోందని ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్ అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్ల స్వతంత్ర ప్రవర్తన మరిన్ని సమస్యలకు దారితీస్తోందన్నారు. ‘‘వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారనుంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. దాన్ని కట్టడి చేయడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. చారిత్రకంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అన్ని విషయాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలాలు ఆయా దేశాలకు అందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచి్చందన్నారు. ‘‘తొలి ఏఐ సదస్సు 2023లో జరిగింది. ఈ మూడు నాలుగేళ్లలోనే ఏఐ రంగం అనూహ్య ప్రగతి సాధించింది. వాణిజ్యపరంగానే గాక సామాజికంగా కూడా ఏఐ వాడకాన్ని దేశాలన్నీ పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు నైతిక సమస్యలు, సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి తక్షణం సమాధానాలు కనిపెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ సాంకేతికత పలు విషయాల్లో మానవ మేధను అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏఐ మోడళ్లు సూపర్ హ్యూమన్ సామర్థ్యాలతో పనులు చక్కబెట్టనున్నాయి. దేశాల మేధో సామర్థ్యమంతా ఇకపై డేటా సెంటర్లలో నిక్షిప్తం కానుంది. కనీవినీ ఎరగని ఈ పరిణామాలు మానవాళికి అవకాశాలతో పాటు మరెన్నో సవాళ్లను కూడా తేనున్నాయి. ఏఐతో అందివచ్చే అవకాశాల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా చికిత్స లేని రోగాలకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఏఐ వ్యవస్థల స్వతంత్ర పనితీరు విపరిణామాలకు దారి తీయవచ్చు. వ్యక్తులు, వ్యవస్థలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా వాటిని దుర్వినియోగం చేయవచ్చు’’అని అమొదెయ్ హెచ్చరించారు.గ్లోబల్ లీడర్‌గా భారత్: రషీద్ ప్రేమ్‌జీ ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగే సువర్ణావకాశం భారత్ ముందు ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ అన్నారు. ఈ విషయమై వచ్చే కొన్నేళ్లలో భారత్ తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలు కీలకమని అభిప్రాయపడ్డారు. దానిపైనే దేశ ఆర్థిక ప్రగతి, 140 కోట్ల ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారాలు ఆధారపడతాయన్నారు. ‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఏఐ టాలెంట్ పూల్ భారత్ సొంతం. ఇది తిరుగులేని సానుకూలత. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐకి, టాలెంట్‌కు మన దేశం గమ్యస్థానంగా మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా ఏకంగా 6.5 లక్షల మంది నిపుణులు ఏఐ, సంబంధిత రంగాల్లో నిత్యం కృషి చేస్తున్నారు. మరో ఏడాదిలో వారి సంఖ్య రెట్టింపు కానుంది. యూపీఏ పేమెంట్ల విధానం భారత్‌లో ఎంతగా సక్సెస్ అయిందో ప్రపంచమంతా చూస్తోంది. డీప్‌టెక్, ఏఐ స్పేస్‌లో 4,000 పై చిలుకు స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఏఐ పటిమను పెంచుకోగలిగితే అద్భుతాలు సాధ్యపడతాయి’’అని ప్రేమ్‌జీ చెప్పారు.ఏఐ ఎడ్యుకేషన్‌లో భారత్ భేష్: యాక్సెంచర్ విద్యా వ్యవస్థలో ఏఐని అంతర్భాగంగా తీర్చిదిద్దడంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘‘ప్రాథమిక విద్యలోనే ఏఐని భాగంగా చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని అన్ని దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది’’అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఐ వర్క్‌ఫోర్స్ విషయంలో కూడా భారత్ అగ్ర స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘అభ్యసన నిరంతర ప్రక్రియ అన్నది ఏఐ రాకతో మరింత వాస్తవంగా మారింది. సంస్థలైనా, దేశాలైనా కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటేనే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయి’’అని స్పష్టం చేశారు.భారత ఏఐ మోడల్స్ ప్రపంచానికి ఆదర్శం: ఫిలిప్స్ వైద్య రంగంలో భారత్ తయారు చేస్తున్న ఏఐ మోడళ్లు ప్రపంచానికి ఆదర్శమని రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ అన్నారు. ఈ రంగంలో గ్లోబల్ మోడల్స్‌లో సంస్కరణలకు దారి చూపగల సత్తా వాటి సొంతమని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ సాంకేతికత అత్యంత ప్రభావం చూపగల రంగాల్లో ఆరోగ్యం కీలకమైనది. ఈ రంగంలో ఏఐ వాడకంలో భారత్ చాలా ముందుంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటివి నిదర్శనం. ఆరోగ్య రంగంలో భారత్‌ను గ్లోబల్ ఇన్నొవేషన్ ఇంజన్‌గా ఫిలిప్స్ పరిగణిస్తోంది’’అని చెప్పారు.దూకుడైన వ్యూహాలే మార్గం: మెటా ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే సరైన విధానాలు, భారీ పెట్టుబడులతో పాటు దూకుడైన వ్యూహాలు కూడా చాలా కీలకమని టెక్నాలజీ దిగ్గజం మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ అన్నారు. దేశాలన్నీ దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ టూల్స్ అన్ని అవసరాలనూ తీర్చేందుకు అనువుగా రూపొందాలి. అంతే తప్ప అన్నింటికీ ఒకే టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాంతం, భాష, సంస్కృతి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రజలంతా ఏఐ టెక్నాలజీని సులువుగా వాడుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఒక్కతాటిపైకి వస్తేనే అది సాధ్యం’’అన్నారు. ఇందుకోసం ‘పర్సనల్ సూపర్ ఇంటలిజెన్స్’దిశగా మెటా కృషి చేస్తోందని గుర్తు చేశారు. మనుషుల బిజీ జీవితాలను చక్కగా ప్లాన్ చేయడం తదితరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.ఇన్నొవేషన్‌కు భారత్ సారథ్యం: ష్నీడర్ ‘‘దేశాల ప్రగతి ప్రస్థానంలో కృత్రిమ మేధతో పాటు ఇంధన మేధ (ఎనర్జీ ఇంటలిజెన్స్–ఇంధన మేధ) పాత్ర కూడా నానాటికీ కీలకంగా మారుతోంది. ఆ రెండు రంగాలూ పరస్పరం అవిభాజ్యంగా రూపొందుతున్నాయ. అలాంటి ఈ కీలక రంగాల్లో గ్లోబల్ ఇన్నొవేషన్‌కు సారథ్యం వహించే సువర్ణావకాశం భారత్ ముందుంది’’అని ష్నీడర్ ఎలక్ట్రిక్ సీఈఓ ఒలివియర్ బ్లుమ్ అభిప్రాయపడ్డారు. ఆ రంగాలకు ప్రభుత్వ, పరిశ్రమపరంగా లభిస్తున్న బలమైన మద్దతే ఇందుకు కారణమని చెప్పారు. ఏ రంగంలోనైనా భారత్‌లో నిలదొక్కుకోగలిగిన సంస్థ ప్రపంచంలో మరెక్కడైనా రాణించవచ్చని చెప్పారు. ‘‘వ్యయ నియంత్రణ, ఇన్నొవేషన్, తిరుగులేని నైపుణ్యం, అపార మానవ వనరులతో ఏఐ విప్లవానికి భారత్ సారథిగా మారుతోంది. ఇంధనం, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ తదితరాల్లో తిరుగులేని సామర్థ్యాలు ఆ దేశానికి ఎంతగానో కలిసొస్తున్నాయి’’అని చెప్పారు.వికటించే రిస్కుతో జాగ్రత్త: నీలేకని ‘‘ఏఐ రంగంలో శరవేగంగా సాధిస్తున్న ప్రగతి అన్ని రంగాలకూ విస్తరించేలా చూడటం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు అది ఉపయోగపడాలి’’అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏదో ఒక దశలో ఏఐ టెక్నాలజీ వికటించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ తదితర వృత్తి నిపుణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ ఇండియా సదస్సులో భాగంగా ఏఐ ప్రభావం తదితరాలపై ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్తో నీలేకని ముచ్చటించారు. డీప్‌ఫేక్ సమస్య వంటి ఏఐ తాలూకు ప్రతికూల పార్శా్వలను కూడా ఆయన ఉదాహరించారు. -
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు. -
ఏఐ.. ఆవిష్కరణలకు అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ఏరోడైనమిక్స్గా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. నియంత్రణలు లేకుండా సాధించే వేగవంతమైన వృద్ధి త్రైమాసిక నివేదికల్లో అద్భుతంగా కనిపించవచ్చు.., కానీ, సరైన భద్రతా చర్యలు లేకుంటే జరిగే ఒక్క చిన్న పొరపాటు దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్–2026లో.. గురువారం డిజిటల్ గవర్నెన్స్ అడ్వైజరీ, ఆల్ బ్రైట్ స్టోన్బ్రిడ్జ్ గ్రూప్ (డీజీఏ–ఏఎస్జీ) లాంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వైజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు. కీలకమైన కూడలిలోనే ఉన్నాం... ఈ సందర్భంగా ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ మాటలను మంత్రి శ్రీధర్ బాబు ఉటంకించారు. ‘ఖ్యాతిని గడించడానికి 20 ఏళ్లు పడితే, దానిని కోల్పోవడానికి కేవలం 5 నిమిషాలు చాలు‘అని బఫెట్ చెప్పినట్లుగానే నేడు ఏఐ విషయంలో మనం అలాంటి కీలక కూడలిలోనే ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విమానయాన రంగం ప్రారంభ దశలో భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. సీటు బెల్టులు, రాడార్ వంటి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఆ రంగాన్ని ఆపలేదని, మరింత ఎత్తుకు ఎదగడానికి అవి అవకాశాన్ని కల్పించాయని గుర్తుచేశారు. ఏఐకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు.‘ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న హైదరాబాద్ వృద్ధిలో సగానికి పైగా మన టెక్ నిపుణుల కృషితోనే సాధ్యమైంది. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే మా లక్ష్యం’అని చెప్పారు. ప్రొయాక్టివ్ గవర్నెన్స్‌లో భాగంగా 2027 నాటికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సరీ్వసెస్ ప్లాట్‌ఫారమ్ (ఐడీఎస్పీ) ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నామని చెప్పారు. -
ఏఐకి మానవ్ విజన్!
న్యూఢిల్లీ: ‘‘మానవాళి చరిత్రలో అతి గొప్ప పరివర్తనశీల అధ్యాయానికి ఏఐ నాంది పలికింది. అందులో భారత్ కేవలం ఒక భాగస్వామిగా మిగిలిపోలేదు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది’’అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి ఇప్పుడు కీలక కూడలి వద్ద నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తామన్నది మన రేపటిని, అంటే మానవాళి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) వెల్లువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. జీపీఎస్ వంటి నావిగేషన్ టూల్స్ మనం ఏయే దారుల్లో వెళ్లొచ్చో సూచిస్తాయి. వాటిలో ఏ దారిని ఎంచుకోవాలన్న నిర్ణయం మాత్రం మనమే తీసుకుంటాం. అలాగే ఏఐ వాడకానికి ఆకాశమే హద్దు కావాలి. కానీ దాని నియంత్రణ మాత్రం నిత్యం మన చేతుల్లోనే ఉండాలి. అది జరగాలంటే ఏఐ వాడకాన్ని ప్రజాస్వామీకరించాలి. మనిషే ప్రధాన కేంద్రంగా దాని వినియోగం ఉండేలా సమగ్ర విధానాలు రూపొందించుకోవాలి’’అని పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలు, పలు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేశారు. ఏఐని అపారమైన శక్తి సామర్థ్యాలతో కూడిన పెన్నిధిగా ఆయన అభివరి్ణంచారు. ‘‘ఏఐ వాడకం ఆశించిన దిశగా సాగకుండా దారి మళ్లితే లక్ష్యసాధనకు బదులు వినాశనానికే దారితీస్తుంది. సజావుగా వాడినప్పుడు మాత్రమే మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రగతికి బాటలు పరుస్తుంది. అలా జరగాలంటే టెక్నాలజీ మనపై పెత్తనం చేయకూడదు. మనమే టెక్నాలజీని నియంత్రించాలి. అందుకోసం అన్ని రంగాల్లోనూ నానాటికీ కీలకంగా మారుతున్న అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమగ్ర విధానాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం’’అని సూచించారు. ఇందుకోసం ‘మానవ్’విజన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. అంటే ‘నైతిక వ్యవస్థలు (మోరల్, ఎథికల్ సిస్టమ్స్–ఎం), జవాబుదారీతనంతో కూడిన పాలన (అకౌంటబుల్ గవర్నెన్స్–ఏ), దేశాల సార్వ¿ౌమత్వం (నేషనల్ సావర్నిటీ–(ఎన్), అందుబాటులో, సమ్మిళిత (యాక్సిసబుల్, ఇంక్లూజివ్–ఏ), ఆమోదయోగ్య, చట్టబద్ధ (వాలీడ్ అండ్ లెజిటిమేట్–వీ)’అని వివరించారు. ఈ విలువలు ఏఐ సమర్థ వాడకానికి దేశాలన్నింటికీ దారి చూపుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సార్వత్రిక సంక్షేమం, అందరికీ ఆనందమే ఏఐ వినియోగం విషయంలో భారత్ నిర్దేశించుకున్న ప్రమాణమని పేర్కొన్నారు. కనుకనే దాన్ని సదస్సు ఇతివృత్తంగా ఎంపిక చేసినట్టు వివరించారు. ‘‘ఏఐ అన్నివిధాలుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అప్పు డు మాత్రమే అది సర్వ మానవాళికీ మేలు చేస్తుంది. ఇది నా నిశి్చతాభిప్రాయం’’అని స్పష్టం చేశారు. భారత్ సిద్ధం ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ ఏ మాత్రమూ వెనకాడటం లేదని మోదీ చెప్పారు. పైగా ఈ టెక్నాలజీని ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా పరిగణిస్తోందని దేశాధినేతలతో పాటు సభికులందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏఐ రంగంలో సూపర్ పవర్‌గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్ సొంతమని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత సదస్సులోనే మూడు భారత కంపెనీలు తమ సరికొత్త ఏఐ మోడళ్లను, యాప్‌లను ఆవిష్కరించాయి. భారత యువతలో దాగున్న ప్రతిభకు ఇదే నిదర్శనం’’అని వివరించారు. ‘‘ఏఐ మన వ్యవస్థలన్నింటినీ మరింత తెలివైనవిగా, సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇన్నొవేషన్లకు, పారిశ్రామికతకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఒక గొప్ప అవకాశంగా ఏఐ నిలుస్తోంది. ఏఐ టూల్స్‌ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది మా విధానం. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారు. తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది మా విశ్వాసం’’అని మోదీ వివరించారు. ‘‘మన భావి తరాలకు ఎటువంటి ఏఐ నమూనాను అందిస్తమన్నది చాలా ముఖ్యం. అది సాధికారత, సమ్మిళిత భావనతో కూడుకుని ఉండేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది’’అంటూ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రాంగులామ్, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్జాండర్ వుకిక్, సీషెల్స్ ప్రధాని సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓర్పో తదితర దేశాధినేతలు ఏఐ సదస్సులో పాల్గొన్నారు.ఏఐ.. మేలిమలుపు ‘‘మానవ చరిత్రలో పలు కీలక మైలురాళ్లున్నాయి. శతాబ్దాల పాటు అవి మన చరిత్రను తీర్చిదిద్దాయి. మన నాగరికతలను, అభివృద్ధి వేగాన్ని నిర్దేశించాయి. ఏఐ కూడా అలాంటి కీలక మార్పే’’అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఇక్కడే ఉంది. టెక్నాలజీపరంగా అతి పెద్ద టాలెంట్ పూల్‌కు భారత్ నిలయం. కనుక ఏఐ ఇంపాక్ట్ సదస్సు భారత్‌లో జరుగుతుండటం చాలా సముచితంగా ఉంది’’అని మోదీ అన్నారు.సైగల భాషలో ప్రత్యక్ష తర్జుమా! న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. గురువారం సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏఐ ఆధారిత సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటేషన్ పరిజ్ఞానం సాయంతో 11 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అంతేగాక ప్రసంగాన్ని సైగల భాషలోకి కూడా అనువదించి వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ప్రదర్శించడం విశేషం. -
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్- ఫ్రాన్స్‌ల మధ్య రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్‌ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్‌కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్ భారత్‌ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.ఇటీవల భారత్- ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్‌లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. -
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్‌ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్‌నగర్‌లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్‌లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్‌ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.డ్రైవర్‌లెస్ కార్లపై పని..టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్‌తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్‌లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలుగత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.యూఎస్-ఇండియా కనెక్ట్ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. -
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026 -
ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ ఏఐ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌లు పాల్గొన్నారు. ఉదయం 9:40 గంటలకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఐఏ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వంటి టాప్ టెక్ సీఈవోలు ప్రసంగిస్తారు. వీళ్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ పరిశ్రమ నాయకులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తదితరులు కూడా ప్రసగించనున్నారు. మరి ఈ అతిరథమహారథుల కోసం విందు భారత్ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ఆ నాయకుల లంచ్ మెనూలో ఏయే వంటకాలు సిద్ధంగా ఉన్నాయంటే..లంచ్‌లో అలెర్జీ రహిత వంటకాలను సర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా పాలు, గోధుమ, నట్స్ లేకుండా రెసీపీలు సిద్ధం చేశారు. ఈమెనూలో వందగ్రాముల కేలరీలు,పోషక విలువలు ఉండేలా కేర్ తీసుకున్నారు పాకనిపుణులు. ఇంతకీ ఏమేమి వంటకాలు ఉన్నాయంటే..స్టార్టర్స్ నిమోనా కబాబ్జీలకర్ర, ఆసాఫోటిడాతో టెంపర్ చేసిన పాన్-గ్రిల్డ్ గ్రీన్ బఠానీ కబాబ్. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ప్రసిద్ధి చెందిన తాజా పచ్చి బఠానీల చేసే శీతాకాలపు వంటకం. వంద గ్రాముల కబాబ్‌లకు 113 కిలో కేలరీలుఖమ్ ఖతైసున్నితమైన ఆకుపచ్చ మూంగ్ పప్పు ప్యాటీలను తీపి మామిడి చట్నీతో నింపి పాన్-గ్రిల్డ్ చేస్తారు. ఈ శాఖాహార కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి. ప్రతి వందగ్రాములకు 116 కిలో కేలరీలుకాశ్మీరీ నద్రు కుర్కురిసుగంధ ద్రవ్యాలతో చల్లిన క్రిస్పీ ఫ్రైడ్ లోటస్ స్టెమ్ చిప్స్. ఇది కాశ్మీర్ లోయ నుంచి వచ్చిన ప్రసిద్ధ, క్రంచీ స్నాక్. ఇందులో కూడా ప్రతి వంద గ్రాములకు 143 కిలో కేలరీలుప్రధాన కోర్సుజాఫ్రానీ సబ్జ్ పులావ్కాలానుగుణ కూరగాయలు, కుంకుమపువ్వుతో సువాసనగల బాస్మతి బియ్యం. ఇది కుంకుమపువ్వు (జాఫ్రాన్), నట్స్, నెయ్యితో తయారు చేసిన గొప్ప, సుగంధ పులావ్ వంటకం. దీనిని తరచుగా హైదరాబాద్‌లో విలాసవంతమైన, వేడుక లేదా "నవాబీ" భోజనంలో భాగంగా వడ్డిస్తారు. వందగ్రాములకు 152 కిలో కేలరీలుతందూరీ సలాడ్టమోటాలు, బెల్ పెప్పర్స్, పైనాపిల్‌లను తందూర్‌లో మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తారు.వంద గ్రాములకు 78 కిలో కేలరీలుథెప్లామెంతులతో రుచిగల గ్రామ్ పిండి ఫ్లాట్‌బ్రెడ్, మామిడి రుచిగల క్రీమ్ చీజ్‌తో సర్వ్ చేస్తారు. థెప్లా అనేది గుజరాతీ గృహాల్లో ప్రధానమైన, ప్రసిద్ధమైన, మృదువైన సన్నని ఫ్లాట్‌బ్రెడ్.వంద గ్రాములకు 138 కిలో కేలరీలుడెజర్ట్లుగులాబీ అండ్ కొబ్బరి పుడ్డింగ్ఫింగర్ మిల్లెట్ క్రంబుల్తో గులాబీ, కొబ్బరి పాలు పుడ్డింగ్ (ఖీర్). శక్తివంతమైన గులాబీ రంగును కలిగి ఉన్న క్రీమీ డెజర్ట్.వంద గ్రాములకు 167 కిలో కేలరీలురామదాన అంజీర్ లడూపఫ్డ్ మిల్లెట్, ఎండిన అంజూరతో చేసే లడ్డూ. ప్రతి వంద గ్రాములకు 172 కిలో కేలరీలుకాగా ఈ ఐఏ ఇంపాక్ట్ సదస్సు సుమారు 20కి పైగా రాష్ట్రాల అధిపతులు, దాదాపు వంద మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులతో సహా 500 మంది అగ్ర నాయకులను ఒక చోటకు చేర్చింది.ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల అధిపతులను మరియు 100 మంది CEOలు మరియు వ్యవస్థాపకులతో సహా 500 కంటే ఎక్కువ ప్రపంచ AI నాయకులను ఒకచోట చేర్చింది.(చదవండి: ఆ తాతగారి లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..! జిమ్ లేదు, కనీసం..) -
ముంబై, బెంగళూరుల్లో ఓపెన్ఏఐ కార్యాలయాలు
ప్రముఖ జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ తన భారతీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలో తన కార్యాలయం ప్రారంభించిన సంస్థ ఈ ఏడాది చివర్లో ముంబై, బెంగళూరుల్లో రెండు కొత్త కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆల్ట్‌మన్ స్పందిస్తూ.. భారతదేశంలో ఏఐని వేగంగా స్వీకరిస్తుండడంపై సామ్ ఆల్ట్‌మన్ ప్రశంసలు కురిపించారు. ‘భారతదేశం ఇప్పటికే ఏఐ వినియోగంలో ప్రపంచ దేశాల కంటే ముందు వరుసలో ఉంది. ఇక్కడి అద్భుతమైన సాంకేతిక ప్రతిభ, ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆశావాదం, ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐని ఎలా అభివృద్ధి చేయవచ్చో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారనుంది’ అన్నారు.ముంబై, బెంగళూరు కార్యాలయాల ద్వారా స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, భారతీయ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘భారతదేశం కోసం, భారతదేశంలో, భారత్‌తో కలిసి ఏఐని నిర్మించడమే మా సంకల్పం’ అని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు.. -
కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు.ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్‌కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్‌కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు. -
ఢిల్లీలో ఇండియా ఏఐ సదస్సు ప్రారంభం
ఢిల్లీ : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. ఏఐ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌లు పాల్గొన్నారు. నేటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ముఖ్య విశేషాలు..ఉ. 11 గంటలకు వివిధ దేశాల స్టాళ్లను పరిశీలించనున్న ప్రధాని మోడీ, దేశాధినేతలుమ.12 నుంచి లీడర్స్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీలీడర్స్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రపంచ దేశాధినేతలు, మంత్రులు , బహుళ జాతి సంస్థల ప్రతినిధులుఏఐ రంగంలో గ్లోబల్ ప్రాధాన్యతలు, పరిపాలన, మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం పై చర్చలు జరుపనున్న ప్రపంచ దేశాధినేతలుసా5:30 కు సీఈఓ లతో ప్రధాని నరేంద్ర మోడీ రౌండ్ టేబుల్ మీటింగ్ఈ కార్యక్రమంలో పాల్గొననున్న గ్లోబల్ టెక్నాలజీ ,ఇండస్ట్రీ లకు సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పెట్టుబడులు , పరిశోధన , సప్లై చైన్స్, ఏఐ సిస్టమ్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చసర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు స్తంభాల ఆధారంగా 7 వర్కింగ్ గ్రూపుల ఏర్పాటువివిధ రంగాలలో ఏఐ ప్రభావం పై చర్చలు జరుపనున్న వర్కింగ్ గ్రూప్స్ఏఐ వర్కింగ్ గ్రూప్‌లు..1. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి కోసం ఏఐ 2. వనరుల ప్రజాస్వామికరణ 3. సామాజిక సాధికారిత4. సురక్షితమైన విశ్వసనీయ ఏఐ 5. మానవ మూలధనం 6. సైన్స్ 7. స్థితిస్థాపకత ,ఆవిష్కరణ, సామర్థ్యం అంశాలపై వర్కింగ్ గ్రూప్ ల ఏర్పాటు500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, వందమంది సీఈవోలు , 100 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 20 దేశాధినేతలు, 60 మంది మంత్రులను ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్న సదస్సు -
ఏఐ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం..!
ఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొంటారా.. లేదా అనేది ఇప్పటివరకూ ఉన్న సందిగ్థత. అయితే ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 19 వ తేదీ) ఏఐ కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో బిల్ గేట్స్ కు ద్వారాలు మూసుకుపోయాయి. ఏఐ సదస్సలో ఆయన ప్రసంగించడం లేదనే విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ ఇండియా వెల్లడించింది. pic.twitter.com/tGJtEQS97E— Gates Foundation India (@BMGFIndia) February 19, 2026బిల్ గేట్స్ స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా ఇండియా అధ్యక్షుడిగా ఉన్న అంకుల్ ఓరా ప్రసంగించనున్నార. అన్ని అంశాలన పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకన్నట్లు గేట్స్ ఫౌండేషన్ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే బిల్ గేట్స్ క్విటి ఇండియా హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న తరుణంలో కూడా బిల్ గేట్స్‌ను.. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు దూరంగా ఉంచాలని ఆది నుంచి కూడా ఓ వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక తర్జనభర్జనల అనంతరం బిల్ గేట్స్‌ను.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి దూరం పెట్టారు. గత మూడు రోజుల నుంచి బిల్ గేట్స్ ను దూరం పెడతారని కాసేపు, లేదు ఆయన ప్రసంగిస్తారని కాసేపు ఇలా హైడ్రామా నడిచింది. ఎట్టకేకలకు బిల్ గేట్స్‌ను దూరం పెడుతూ గేట్స్ ఫౌండేషన్ ఇండియా ప్రకటించిన తరుణంలో దీనికి ముగింపు పలికినట్లు అయ్యింది. ఎప్స్టీన్ ఫైల్స్‌తో బట్టబయలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు అత్యంత ప్రముఖంగా బయటపడింది. అభం శుభం తెలియని చిన్నారులను తమ వికృత లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారని వెలుగులోకి వచి్చంది. బిల్ గేట్స్‌కు ఆయన భార్య మెలిందా గేట్స్ కొంతకాలం క్రితం విడాకులు కూడా ఇచ్చారు. ఆయన అక్రమ, అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేక ఆమె విడాకులు ఇచ్చారు. కాగా ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు బయటపడటంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ బాగోతంపై ఓటీటీ చానల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక సీరీస్ కూడా చిత్రీకరించారు. దాంతో బిల్‌గేట్స్ తదితరులు ఎంతటి తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారన్నది తెలుసుకుని యావత్ ప్రపంచం కంపించిపోయింది. -
ఏఐ ‘విండోస్’!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్స్ ఎక్స్‌పోకు సందర్శకులు పోటెత్తుతున్నారు. వారితో పాటు పలు అంతర్జాతీయ దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులతో బుధవారం ఎక్స్పో వేదిక, స్టాళ్లు కళకళలాడాయి. ఏఐ భవితవ్యంతో పాటు పలు కీలక అంశాలపై ఔత్సాహికులతో ప్రముఖులంతా తమ అభిప్రాయాలను పంచుకుంటూ కని్పంచారు. అంతేగాక సరికొత్త స్టార్టప్‌లు, పెట్టుబడులు తదితరాలకు సంబంధించి పలు ఏఐ కంపెనీల సీఈఓలు ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. సముద్రగర్భంలో ఇండో–యూఎస్ కేబుల్ రూ.272 కోట్లతో ఏఐ సైన్స్ చాలెంజ్ ∙గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన భారత్‌లో దాగున్న అపారమైన ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే తమ లక్ష్యమని ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని మరింత పెంపొందించే లక్ష్యంతో సముద్రగర్భంలో కేబుల్ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ ఎక్స్పో వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కర్మయోగి భారత్ పథకంలో గూగుల్ భాగస్వామి కానుంది. అంతేగాక 1.1 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య సాధనలో మద్దతుగా నిలుస్తుంది. గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ కోర్సులు అందజేస్తుంది. దీనికోసం 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో సమన్వయంతో గూగుల్ పని చేస్తుంది’’అని వెల్లడించారు. కృత్రిమ మేధను మన జీవితకాలాల్లో చోటుచేసుకుంటున్న అతి పెద్ద పరిణామంగా పిచాయ్ అభివరి్ణంచారు. అలాంటి కీలక రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందంటూ పిచాయ్ ప్రశంసించారు. భిన్న రంగాల్లో ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.272 కోట్లతో ‘ఏఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్’చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలను మరింతగా ఒడిసిపట్టేందుకు గూగుల్ డీప్‌మైండ్ సాయంతో ఐఐటీ మద్రాస్‌తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. గూగుల్ ఏఐ మోడ్ ఇప్పటికే 200 దేశాల్లో 35 పై చిలుకు భాషల్లో అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. మున్ముందు వాయిస్, కెమెరా ఆధారిత రియల్‌టైమ్ లైవ్ సెర్చ్ వంటి అధునాతన ఆప్షన్లను కూడా తేనున్నట్టు వెల్లడించారు. మోదీతో పిచాయ్ భేటీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో పిచాయ్ భేటీ అయ్యారు. భారత్‌లో వ్యవసాయం, ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి ఏఐ వాడకంలో గూగుల్ పోషిస్తున్న కీలక పాత్రపై మోదీతో చర్చించా. సమాచారాన్ని అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తేవడం, స్టార్టప్‌లకు దన్నుగా నిలవడం వంటివి కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏఐలో భారత్ చేస్తున్న కృషి, ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగుల నైపుణ్యాల పెంపులో గూగుల్ పాత్ర గురించి చర్చించాం’’అని వివరించారు. పిచాయ్‌తో భేటీ ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టులో మోదీ పేర్కొన్నారు.పదేళ్లలో రూ.45 లక్షల కోట్లు! మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడి ప్రణాళికలు కృత్రిమ మేధ రంగంలో వచ్చే పదేళ్లలో గ్లోబల్ సౌత్‌లో ఏకంగా రూ.45 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్ల) మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటన చేసింది. గ్లోబల్ సౌత్‌లో ఏఐ యాక్సెస్‌ను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చిస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, సంస్థ వైస్ చైర్మన్ నటాషా క్రాంప్టన్ ఈ మేరకు వెల్లడించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో వారు మాట్లాడారు. ‘‘గ్లోబల్ సౌత్‌తో పోలిస్తే ఉత్తరార్ధ గోళంలో ఏఐ వాడకం దాదాపు రెండింతలుగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’అని తెలిపారు. కీలకమైన ఈ సవాలును ఏఐ సదస్సు అజెండాలో కీలకంగా ఉంచడం అభినందనీయమని స్మిత్ అన్నారు. తద్వారా సరైన సమయంలో దీన్ని తెరపైకి తేవడం తీసుకొచ్చారన్నారు. విద్యుత్ సదుపాయం విషయంలో కూడా దక్షిణ, ఉత్తరార్ధ గోళాల నడుమ శతాబ్దానికి పైగా అంతరాలు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. ఏఐ అంతరాలు పెరిగితే వర్ధమాన దేశాలకు ఆర్థిక వృద్ధి తదితర అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్య పెంపు, భిన్న భాషల్లో ఏఐ అభివృద్ధి, స్థానిక ఇన్నొవేషన్లు, ఏఐ అడాప్షన్ మెజర్మెంట్... ఇలా తమ భారీ పెట్టుబడులను ఐదంచెల్లో వెచ్చిస్తామని స్మిత్ వెల్లడించారు.ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్, మెక్సికో సహా మొత్తం గ్లోబల్ సౌత్‌లో మౌలిక సదుపాయాల డేటా సెంటర్లపై మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.72 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. క్లౌడ్, ఏఐ, డిజిటల్ స్కిల్లింగ్ తదితరాలపై ఈ ఏడాది రూ.18 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 2 లక్షల సంస్థలకు చెందిన 20 లక్షల మంది టీచర్లకు ఏఐ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ఎలివేట్ ఫర్ ఈక్వేటర్స్’కార్యక్రమాన్ని కూడా స్మిత్ ఈ సందర్భంగా ప్రకటించారు.వర్సిటీలతో జట్టు: ఓపెన్ఏఐ కృత్రిమ మేధ విస్తృతిని రెండు చేతులతోనూ అందిపుచ్చుకునేందుకు భారత్‌కు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో కలిసి పని చేస్తామని ఐఏ దిగ్గజం ఓపెన్ఏఐ ప్రకటించింది. ‘‘మేనేజ్మెంట్, ఆరోగ్యం, ఇంజనీరింగ్ వంటి పలు రంగాల్లో యువతలో, విద్యార్థుల్లో ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా పెంపొందించడమే మా లక్ష్యం. ఇందుకోసం ఆయా ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం అవుతాం’’అని ఓపెన్ఏఐ విద్యా విభాగం సారథి రాఘవ్ గుప్తా వెల్లడించారు. తొలి దశలో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్–న్యూఢిల్లీ, మనిపాల్ అకాడెమీ, యూపీఈఎస్, పెరల్ అకాడెమీతో జట్టు కట్టనున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి పైగా విద్యార్థులు, బోధన సిబ్బందిని ఏఐ, సంబంధిత టూల్స్ వాడకంల నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ‘‘ప్రస్తుతం మానవ వనరులపై ఆధారపడుతున్న కోర్ స్కిల్స్‌లో కనీసం 40 శాతం 2030 నాటికి ఏఐ ఆధారితంగా మారిపోతాయని పలు అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి. కనుక అందుకు తగ్గట్టుగా మన భావి తరాలను ఏఐ నైపుణ్యాలతో తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఇందులో విద్యా సంస్థలదే కీలక పాత్ర’’అని గుప్తా అభిప్రాయపడ్డారు. తమతో భాగస్వామ్యానికి ఓపెన్ఏఐ ముందుకు రావడం పట్ల ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్ ఢిల్లీ హర్షం వెలిబుచ్చాయి. ఎడ్టెక్ వేదికల రూపకల్పన నిమిత్తం ఫిజిక్స్‌వాలా, అప్‌గ్రేడ్ వంటి విద్యా సంస్థలతో కూడా ఓపెన్ఏఐ జట్టు కట్టనుందని గుప్తా తెలిపారు.నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదుఎయిర్బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వాడకానికి అవకాశాల అన్వేషణ తదితరాలకు భారత అంతరిక్ష రంగ కంపెనీ ఇన్‌స్పేస్ రూ.6 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. ఇన్‌స్పేస్ తాలూకు సీడ్ ఫండ్ పథకం ‘ఏఐ ఇన్‌సై్పర్డ్’(ఇన్నొవేటింగ్ స్పేస్ ప్రోగ్రాం విత్ ఇంటలిజెంట్ రెజీలియంట్ ఇంజన్స్ డెవలప్మెంట్) కింద ఈ నిధులను అందజేయనున్నట్టు సంస్థ డైరెక్టర్ వినోద్‌కుమార్ వెల్లడించారు. ఎంపిక చేసిన సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా దేశ ప్రాథమ్యాలకు అవసరమైన ఏఐ పరిష్కరాలను అభివృద్ధి చేసే సంస్థలకు గ్రాంట్ అందిస్తాం. కనీసం ఆరు సంస్థలను ఎంపిక చేస్తాం. ఒక్కో సంస్థకు గరిష్టంగా రూ.కోటి మేరకు చెల్లిస్తాం’’అని ఆయన వివరించారు.భారత యువతకు సువర్ణావకాశం డీప్‌మైండ్ సీఈఓ హస్సబిస్ కృత్రిమ మేధ వృద్ధికి సారథులుగా మారే సువర్ణావకాశం భారత యువత ముందుందని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సబిస్ అభిప్రాయపడ్డారు. సరికొత్త ఏఐ టూల్స్‌లో తిరుగులేని నైపుణ్యం సాధించడమే అందుకు కీలకమని సూచించారు. వచ్చే పదేళ్లలో ఇది భారత్‌ను అన్ని రంగాల్లోనూ సూపర్ పవర్‌గా నిలుపుతుందని జోస్యం చెప్పారు. ఇండియా ఏఐ ఎక్స్పో వేదికగా ఔత్సాహికులతో ఆయన ముచ్చటించారు. సాంకేతికత నానాటికీ అనూహ్య మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో యువత తమ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘భారత్‌లో దాగున్న ఎనలేని శక్తి సామర్థ్యాలు చూసి ఎంతో ముచ్చటేస్తోంది. ముఖ్యంగా ఏఐ విషయంలో ఇక్కడి యువత సానుకూల భావనతో ఉరకలెత్తుతోంది. రానున్న దశాబ్దాల్లో ఇది భారత్‌కు గొప్ప సానుకూలత కానుంది’’అని అభిప్రాయపడ్డారు. -
నేడు ఏఐ కీలక సదస్సు
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ కీలక సదస్సు గురువారం ఢిల్లీలో జరగనుంది. రంగాలవారీగా ఏఐ ప్రభావం, దాని సమర్థ వినియోగం, ప్రతికూల ప్రభావాల కట్టడి తదితరాలపై పలువురు దేశాధినేతలు, దిగ్గజ ఏఐ కంపెనీల సారథులు, విద్యావేత్తలు, పరిశోధకులు సదస్సు వేదికగా లోతుగా మేధోమథనం జరపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ సౌత్‌లో జరగనుండటం ఇదే తొలిసారి. గురువారం ఉదయం ఢిల్లీలోని భారత్ మండపంలో సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అందులో పాల్గొంటున్న పలువురు దేశాధినేతలు, ప్రముఖులతో విడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా సదస్సులో మాట్లాడతారు. పలు ఏఐ దిగ్గజ సంస్థల సీఈఓలు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’నినాదంతో సదస్సు జరగనుంది. ప్రధానంగా ఏడు వర్కింగ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు. అవి ఆర్థిక ప్రగతి, సామాజిక హితానికి ఏఐ; ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ; సామాజిక సాధికారతకు చోటు; సురక్షిత, విశ్వసనీయ ఏఐ; మానవ వనరుల పెట్టుబడి; సైన్స్; పుంజుకునే సత్తా, ఇన్నొవేషన్, సామర్థ్యం. ఈ చర్చలన్నీ ‘ప్రజలు, భూమి, ప్రగతి’ప్ర«దానాంశాలుగా సాగుతాయి. పలువురు దేశాధినేతలతో పాటు 500 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి ఏఐ సారథులు, 100 మందికి పైగా సీఈఓలు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీఓలు, ఉపాధ్యక్షులు, దాతలు సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఏఐ రంగంలో భారత్‌ను సారథ్య స్థానంలో నిలిపే లక్ష్యసాధనలో భాగంగా ఈ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది. బిజీ బిజీగా మోదీ సదస్సును ప్రారంభించి అనంతరం పలువురు దేశాధినేతలు, సీఈఓలు, ప్రముఖులతో కలిసి ఏఐ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను మోదీ సందర్శిస్తారు. సోమవారం భారత్ మండపంలో ప్రారంభమైన ఎక్స్‌పోకు విశేష ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి అదే వేదిక వద్ద లీడర్ల సదస్సులో ప్రధాని పాల్గొంటారు. దేశాధినేతలు, పలు దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు ఇందులో భాగస్వాములు కానున్నారు. పాలన, మౌలిక సదుపాయాలు, సహకారంతో పాటు పలు అంశాలకు సంబంధించి ఏఐలో జాతీయ, అంతర్జాతీయ ప్రాథమ్యాలపై వారంతా మేధోమథనం జరుపుతారు. సాయంత్రం 5:30 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు, సీఈఓలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఏఐ, సంబంధిత వ్యవస్థల్లో పెట్టుబడులు, పరిశోధనలు, కొలాబరేషన్, సరఫరా వ్యవస్థలు తదితరాలపై వారితో చర్చిస్తారు.ఎల్లుండి దాకా ఎక్స్పో ఏఐ సదస్సుకు దేశాధినేతలు, సీఈఓలు, వీఐపీల రాక నేపథ్యంలో ఏఐ ఇండియా ఎక్స్పోను గురువారం మూసేయనున్నారు. అయితే ఎక్స్ పోకు లభిస్తు న్న విశేష ఆదరణ నేపథ్యంలో దాన్ని శనివారం దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఎక్స్పో శుక్రవారం ముగియాల్సి ఉంది. అధినేతలకు మోదీ స్వాగతం న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని భారత్ మండపం వద్ద స్వయంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోతకిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓప్రో, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్ గులాం, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, గయానా ఉపాధ్యక్షుడు భారత్ జగ్దేవ్ తదితరులు వీరిలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియెవా తదితరులను కూడా ప్రధాని ఆప్యాయంగా స్వాగతించారు. ఆహూతులందరికీ ఈ సందర్భంగా మేళతాళాలు, పూలు, అక్షింతలతో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం లభించింది. -
చైనా రోబో డాగ్ వివాదం.. ప్రొఫెసర్ నేహా సింగ్ ఉద్యోగానికి ఎసరు!
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబోడాగ్ వివాదంలో అబాసుపాలైన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ యూనివర్సిటీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా రోబో డాగ్ తామే తయారు చేశామని ప్రచారం చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇపాక్ట్ సదస్సును నిర్వహిస్తోంది. అయితే, ఈసదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అదికాస్తా వివాదం కావడంతో సదస్సు నుంచి గెంటివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. ఆ రోబోట్‌ను తామే తయారు చేశామని గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్ డీడీ న్యూస్‌తో మాట్లాడారు. యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రోబోడాగ్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు.ఓరియన్ (orion) అనే పేరు పెట్టామని దానిని ప్రదర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు, ప్రదర్శనకు ఉంచిన రోబోటిక్ డాగ్ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఆ వీడియోల్లో చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన యూనిట్రీ జోవో2 రోబోటిక్ డాగ్‌గా గుర్తించారు. అందుకు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ రోబోటిక్ డాగ్‌లను పలు కార్యాక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏఐ ఇంపాక్ట్ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు సైతం స్పందించారు. వెంటనే సదస్సును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు సదస్సును ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఏఐ సదస్సులో జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్లో యూనివర్సిటీ గురించి వివాదం తలెత్తడానికి కారణం ప్రొఫెసర్ నేహాసింగ్‌ది తప్పు. యూనివర్సిటీ తరుఫున సదస్సులో స్టాల్ నిర్వహిస్తున్న మా ప్రతినిధుల్లో ఆమె ఒకరు. సదస్సు గురించి, రోబోటిగ్ డాగ్ గురించి సరైన సమాచారం లేదు. మీడియాతో మాట్లాడే అధికారం కూడా ఆమెకు లేదు’అని పేర్కొంది. ఇదే అంశంపై మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రోబోట్ డాగ్‌ను మా యూనివర్సిటీ తయారు చేయలేదని స్పష్టం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీ పరువు పోవడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రొఫెసర్ నేహాసింగ్‌ను యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. లింక్డిన్ ప్రొఫెల్ సైతం ఆమె మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. People like Galgotias University "professor" Neha Singh are the face of "artificial" intelligence who make a fool of themselves and the entire country. Will talk about the absolute collapse of "cute little and naughty" DD News as India's public broadcaster in the next debate. pic.twitter.com/UdW0psuum6— Piyush Rai (@Benarasiyaa) February 17, 2026 -
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందడుగు
కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్‌లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్ఫార్మ్లు, డెవలప్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్లు, మల్టీలింగ్వల్ ఇంటెలిజెన్స్ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్‌ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్‌ఫార్మ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
భారత్‌లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్ సర్వీసులో చాట్‌బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్వేర్ కోడింగ్‌ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్‌లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000 -
‘యూపీఐ’ నిరసనలు.. ఔత్సాహికులకు చేదు అనుభవాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026' సందర్శకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికత, డిజిటల్ వృద్ధి మేళవింపుగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ఫుడ్ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) చెల్లింపులను నిలిపివేయడం సందర్శకులను షాక్‌నకు గురిచేస్తోంది. క్యూఆర్ కోడ్లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటంతో అతిథులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విదేశీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు, 13 దేశాల పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అయితే కనీసం యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘యూపీఐ’తో చెల్లించే వీలు లేనప్పుడు ఇది డిజిటల్ ఇండియా ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక ‘ఎక్స్’ యూజర్ ప్రశ్నించగా, మరొకరు ఈ సమిట్‌ను ‘అస్తవ్యస్త నిర్వహణకు నిదర్శనం’ అని అభివర్ణించారు. కనీసం వైఫై సదుపాయం కూడా లేకపోవడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.నియోసేపియన్ సహ వ్యవస్థాపకునికి చేదు అనుభవంనియోసేపియన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ధనంజయ్ యాదవ్, భారతదేశ సాంకేతిక రంగానికి తన వంతు సహకారం అందించాలనే ఆశయంతో 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు వచ్చారు. తన స్టార్టప్ రూపొందించిన ‘వేరబుల్ స్మార్ట్ ఏఐ’ పరికరాన్ని ప్రదర్శించడానికి ఒక చిన్న స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రధాని మోదీ రాక సందర్భంగా.. భద్రతా కారణాలతో అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు. Bro is Dhananjaya YadavBro is co-founder and CEO of NeoSapienBro came to the AI Impact SummitBro wanted to do something for IndiaBro came to support India’s tech scene and believed in the governmentBro is building a smart AI wearable at NeoSapienBro set up a small… pic.twitter.com/1WFIPTerah— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) February 17, 2026అతని ల్యాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను అక్కడే వదిలి వెళ్ళాలని, సెక్యూరిటీ సిబ్బంది వాటికి బాధ్యత వహిస్తుందని వారు చెప్పడంతో వారి మాటలను నమ్మి బయటకు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ధనంజయ్ యాదవ్ తిరిగి వచ్చి చూసేసరికి అతని పరికరాలన్నీ మాయమయ్యాయి. దీంతో విమాన ప్రయాణం, హోటల్ వసతి, స్టాల్ ఏర్పాటు కోసం భారీగా ఖర్చు చేసిన ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన ప్రోటోటైప్‌ను కూడా ఆయన కోల్పోయారు. ఈ సంఘటన అక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపడమే కాకుండా, భారత్‌లో ఆవిష్కర్తలకు ఎదురయ్యే సవాళ్లకు ఉదాహరణగా నిలిచింది. Day 1 at the AI Summit:We’re apparently building the future.Meanwhile:– No water.– Traffic like it’s a festival + protest + wedding baraat combined.– AQI doing live demo of “real world simulation.”– Queues so long they need their own breakout session.– Cash only food…— Yavanika Shah (@yavanikashah) February 16, 2026 -
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్‌లో ఏఐ ప్రభావంపై మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు బుధవారం భారతదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత మాతృభూమికి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడ లభించిన సాదర స్వాగతం నా మనసుని తాకింది’ అంటూ పిచాయ్ తన 'ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ‘ఇండియా ఏఐ మిషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సామాన్యుల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురావచ్చనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టెక్ సీఈఓలు, దేశాధినేతలు పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు.ఈ సదస్సు ప్రారంభానికి ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సుందర్ పిచాయ్.. భారత్‌తో ఏఐ రంగంలో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ దేశాల్లో భారత్ ఒకటి అని, ఇక్కడ ఏఐ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన ఇంధన వనరుల పెట్టుబడులు, ఓపెన్ డేటాసెట్స్, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తదితర అంశాల్లో భారత్‌కు గూగుల్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ మెగా సదస్సులో సుందర్ పిచాయ్‌తో పాటు ప్రపంచ స్థాయి దిగ్గజాలు తమ గళాన్ని వినిపించనున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోడై తదితర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న ఉదయం 9:30 గంటలకు సుందర్ పిచాయ్ తన కీలక ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు, దీనిపై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి. Nice to be back in India for the AI Impact Summit - a very warm welcome as always and the papers looked great too:) pic.twitter.com/szM9g2wB4d— Sundar Pichai (@sundarpichai) February 18, 2026 -
‘ఏఐ సమ్మిట్’లో ‘చైనా డాగ్’ లొల్లి.. స్టాల్ తొలగింపు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ప్రదర్శించిన ఒక రోబో డాగ్ విషయమై వివాదం తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించిన ఆ రోబో డాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన యూనిట్రీ (Unitree) సంస్థ తయారు చేసిన రోబోను తామే తయారు చేశామని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ తీరును తప్పుబడుతూ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గల్గోటియా యూనివర్శిటీ స్టాల్‌కు కరెంట్ కట్‌చేసిన నిర్వాహాకులు వెంటనే దానిని ఖాళీ చేయించారు. చైనా రోబోను భారత్ రోబోగా చెప్పుకోవడాన్ని చైనా మీడియా తప్పుబట్టింది.ఈ వివాదానికి ప్రధాన కారణం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ఈ రోబో పేరు ‘ఓరియన్’ (Orion) అని, దీనిని గల్గోటియాస్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపొందించిందని నేహా సింగ్ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఇది నిఘా, పర్యవేక్షణ పనులను సమర్థవంతంగా చేయగలదని, క్యాంపస్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతుందని ఆమె వివరించారు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు అది చైనా కంపెనీ యూనిట్రీకి చెందిన రోబోగా గుర్తించి, యూనివర్శిటీ సొంతంగా తయారు చేసిందన్న వాదనను తప్పుబడుతున్నారు. This has been developed by the Centre of excellence at Galgotiyas University.“Also we are the first private university that has invested around 350 crores in Artificial Intelligence”. 🧘 https://t.co/NJfDzL7lG2 pic.twitter.com/TMqfSB6K0v— Harsh Kumar (@itsmeharsh_09) February 17, 2026సోషల్ మీడియాలో చైనా రోబో డాగ్ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ఎట్టకేలకు దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ రోబోను తాము తయారు చేయలేదని, అలాగే తాము రూపొందించినట్లు ఎక్కడా చెప్పలేదని యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మేము ఈ రోబోను తయారు చేయలేదు. అయితే భవిష్యత్తులో భారత్‌లోనే ఇలాంటి సాంకేతికతను రూపొందించేలా మా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం’ అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే చైనా, సింగపూర్, అమెరికా వంటి దేశాల నుండి పరికరాలను తెప్పిస్తున్నట్లు వెల్లడించింది.చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూనిట్రీ’ ఈ క్వాడ్రపెడ్ (నాలుగు కాళ్ల) రోబోలను తయారు చేస్తుంది. జంతువుల కదలికలను పోలి ఉండే ఈ రోబోలు అడ్డంకులను అధిగమించడంలో, వివిధ తనిఖీల్లో వినోద రంగంలో ఉపయోగపడుతున్నాయి. బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థల రోబోలతో పోలిస్తే, యూనిట్రీ రోబోలు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండటం విశేషం.ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్’తో దూకుడు.. -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్‌ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్‌కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్‌పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్‌ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్‌కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్‌పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్‌ఫేక్‌లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్‌పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్‌కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
ఏఐ సమ్మిట్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను!
న్యూఢిల్లీ: భారత్ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నాగం పన్నారనే నిఘా వర్గాల సమాచారంలో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సును సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్తల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ అయ్యారు. ప్రధానంగా డీఫేక్ టెక్నాలజీ ఆధారంగా సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేసుకుని ఈ పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం.ప్రభుత్వాధికారులు చెబుతున్నట్లుగా, ప్రపంచ నాయకులపై తప్పుడు లేదా ఫేక్ ప్రకటనలను వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి పథక రచన చేశారనే వార్తలు ప్రధాన సవాల్‌గా మారింది. అలాగే, హ్యాకర్లు ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా లోపాలను కనుగొని వైరస్‌లను ప్రవేశపెట్టే మాల్వేర్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రతినిధుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల సెషన్ టోకెన్లు దొంగిలించే అవకాశం ఉంది. నకిలీ వై-ఫై హాట్స్పాట్ల ద్వారా సమాచారం లీక్ చేసే ప్రమాదం ఉంది. ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను స్థంభింపజేయడానికి DDoS దాడులు జరగవచ్చు. కీలక మౌలిక వసతులను దెబ్బతీయడానికి రాన్సమ్వేర్ దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం(ఫిబ్రవరి 16వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సదస్సుపై తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి పలు ఆన్లైన్ ఫ్లాట్‌ఫారమ్‌లు క్షుణ్ణంగా పర్యవేక్షణలో నిమగ్నమయయాయి. -
టెకీల ప్రైమరీ జాబ్ కోడింగ్ కాదు: నందన్ నీలేకని
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్‌కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. -
వీడిన ఉత్కంఠ.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్‌గేట్స్
ఢిల్లీ: భారత్ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ హాజరుకాకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో బిల్‌గేట్స్ హాజరుకానున్నట్లు గేట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఢిల్లీలో ‘భారత్ మండపం’లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. అయితే, ఈ సమ్మిట్ అధికారిక వెబ్సైట్ అతిథుల లిస్టులో బిల్‌గేట్స్ పేరు లేదు. కేంద్రం సైతం ఆయన్ను ఆహ్వానించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు దుమారం రేపుతున్న ఎప్స్టిన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు ఉండడమే కారణమని తేలింది. దీంతో సమ్మిట్ వెబ్సైట్లో గేట్స్ పేరు లేకపోవడం వల్ల ఆయనకు ఆహ్వానం రద్దయిందంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘బిల్ గేట్స్ ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొని తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు’ అని వెల్లడించారు.ఎప్స్టిన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు.. తాజాగా అమెరికాలో బయటపడిన ఎప్స్టిన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో బిల్‌గేట్స్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్స్టిన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు రష్యా మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని, ఈ కారణంగా సుఖవ్యాధులకు గురైన ఆయన.. తన భార్యకు అవి సంక్రమించకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేవారని బయటపడింది. ఈ వివాదం కారణంగానే తాను బిల్ గేట్స్‌కు విడాకులు ఇచ్చినట్లు.. ఎప్స్టిన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు వెలుగులోకి వచ్చిన వేళ ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బిల్‌గేట్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. -
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. జియో పెవిలియన్ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -
ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ?
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్‌కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్‌గేట్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్‌గేట్స్‌పై ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్‌లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్‌కు బిల్ గేట్స్‌కు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బిల్‌గేట్స్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్‌గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్‌గేట్స్‌కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్ తన పొడ్రక్ట్స్కు భారత్ ల్యాబ్‌గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో బిల్‌గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్టాగ్లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. -
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేటికి(మంగళవారం) రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘కృత్రిమ మేధ (ఏఐ)ప్రయోజనాలు ప్రతి పౌరుడికీ అందాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలివితేటలు, హేతుబద్ధత, నిర్ణయాత్మక సామర్థ్యం మొదలైనవాటిని ఏఐ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గ్లోబల్ సౌత్’లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా ఏఐ నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ఒక ప్రకటనలో ఈ సదస్సు ఇరు దేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేసే కీలక వేదికగా అభివర్ణించింది. बुद्धिमत्ता, तर्कशीलता और निर्णय-क्षमता विज्ञान और टेक्नोलॉजी को जन-जन के लिए उपयोगी बनाती हैं। India AI Impact Summit का उद्देश्य भी यही है कि कैसे एआई का इस्तेमाल सर्वजन के हित में हो।शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा।ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥ pic.twitter.com/qytLZxv1uh— Narendra Modi (@narendramodi) February 17, 2026సదస్సు రెండో రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చోటు చేసుకునే కలిగే సామాజిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం, ప్రజారోగ్యం, పిల్లల భద్రత తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమన్‌దీప్ సింగ్ గిల్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. అలాగే, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. సదస్సుతో పాటు నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు తమ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించేందుకు సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారనే అంచనాలున్నాయి.ఇది కూడా చదవండి: ‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్ -
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!
ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్లోనే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.బెంగళూరుకు చెందిన గౌరవ్ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.తాజా అప్డేట్లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్ అగర్వాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, మెటా ఛీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, టీసీఎస్ సీఈవో కృతివాసన్ తదితరులు ఉన్నారు.Unsurprisingly, I am at the AI Summit this entire week with folks from my team and colleagues. Come visit us - we are all excited to share a glimpse of what all is cooking in our kitchen!Divided by companies, United by Mission - Let's build AI for Bharat 🙏 pic.twitter.com/eg7QDCDEVZ— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026 -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్‌కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్‌లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!


