ఏఐ సమ్మిట్‌పై సైబర్‌ నేరగాళ్ల కన్ను! | Cyber ​​attackers target AI summit | Sakshi
Sakshi News home page

ఏఐ సమ్మిట్‌పై సైబర్‌ నేరగాళ్ల కన్ను!

Feb 17 2026 8:03 PM | Updated on Feb 17 2026 8:12 PM

Cyber ​​attackers target AI summit

న్యూఢిల్లీ:  భారత్‌ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు పన్నాగం పన్నారనే నిఘా వర్గాల సమాచారంలో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సును సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారనే వార్తల నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్‌ అయ్యారు. ప్రధానంగా డీఫేక్‌ టెక్నాలజీ ఆధారంగా సోషల్‌ మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్‌ చేసుకుని ఈ పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రభుత్వాధికారులు చెబుతున్నట్లుగా, ప్రపంచ నాయకులపై తప్పుడు లేదా ఫేక్‌ ప్రకటనలను వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి పథక రచన చేశారనే వార్తలు  ప్రధాన సవాల్‌గా మారింది. అలాగే, హ్యాకర్లు ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా లోపాలను కనుగొని వైరస్‌లను ప్రవేశపెట్టే  మాల్వేర్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

ప్రతినిధుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల సెషన్ టోకెన్లు దొంగిలించే అవకాశం ఉంది. నకిలీ వై-ఫై హాట్‌స్పాట్‌ల ద్వారా సమాచారం లీక్ చేసే ప్రమాదం ఉంది.  ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను స్థంభింపజేయడానికి DDoS దాడులు జరగవచ్చు. కీలక మౌలిక వసతులను దెబ్బతీయడానికి రాన్సమ్‌వేర్ దాడులు జరిగే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో సోమవారం(ఫిబ్రవరి 16వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సదస్సుపై తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి పలు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు క్షుణ్ణంగా పర్యవేక్షణలో నిమగ్నమయయాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement