జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష! | Jio Aarogya AI Enables Health Screening in Minutes AI Clinic Model Unveiled | Sakshi
Sakshi News home page

జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!

Feb 17 2026 6:05 PM | Updated on Feb 17 2026 6:16 PM

Jio Aarogya AI Enables Health Screening in Minutes AI Clinic Model Unveiled

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో.. జియో పెవిలియన్‌ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.

వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.

రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.

ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement