టీసీఎస్‌తో ఏఎండీ బంధం బలోపేతం | AI Impact Summit 2026 TCS AMD partnership headline developments | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌తో ఏఎండీ బంధం బలోపేతం

Feb 17 2026 8:23 AM | Updated on Feb 17 2026 9:32 AM

AI Impact Summit 2026 TCS AMD partnership headline developments

అమెరికన్‌ దిగ్గజం ఎన్‌విడియాకి భారత మార్కెట్లో దీటుగా పోటీనిచ్చేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్,  అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ (ఏఎండీ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాయి. టీసీఎస్‌ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్‌ ఏఐ డేటా సెంటర్‌ లిమిటెడ్‌తో కలిసి అమెరికన్‌ సంస్థ ఏఎండీ తమ హీలియోస్‌ ప్లాట్‌ఫాం ఆధారంగా పెద్ద కంపెనీలకు అవసరమయ్యే ‘ర్యాక్‌–స్కేల్‌ ఏఐ’ మౌలిక సదుపాయాలను డిజైన్‌ చేయనుంది. పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు, ఎంటర్‌ప్రైజ్‌ ఏఐని అమలు చేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌ సందర్భంగా కంపెనీలు దీన్ని ప్రకటించాయి. భాగస్వామ్యం ప్రకారం ఏఎండీ తమ ఫుల్‌–స్టాక్‌ ఏఐ కంప్యూట్‌ ప్లాట్‌ఫాంను, టీసీఎస్‌ తమ డేటా సెంటర్‌ ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్‌ సామర్థ్యాలను ఉపయోగించనున్నాయి. లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ మోడల్స్, ఏఐ శిక్షణ మొదలైన వాటి కోసం కంపెనీలు, ప్రభుత్వాలు కంప్యూట్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఏఐ మౌలిక సదుపాయాల సెగ్మెంట్లో ఏఎండీ నేరుగా జీపీయూల తయారీ దిగ్గజం ఎన్‌విడియాతో పోటీపడనుంది.

ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement