ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్‌పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదు
ఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్‌మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్‌వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.
శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్’
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.
‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.
The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.
In rapidly changing times like this, here is a framework I use:
1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026
సాంకేతికత పరిష్కరించలేని సమస్యలు
లండన్‌లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.
ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..


