breaking news
AI News
-
మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్)లో పని చేసేందుకు మెటా కళ్లు చెదిరిపోయే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. యాపిల్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆంత్రోపిక్..వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రపంచంలోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులను ఆకర్షించడమే లక్ష్యంగా రూ.800 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల పరిహార ప్యాకేజీలను అందిస్తోంది.ఇటీవల మెటాలో చేరిన యాపిల్‌కు చెందిన రుమింగ్ పాంగ్‌కు రూ.1,600 కోట్లు (సుమారు 200 మిలియన్ డాలర్లు) పరిహార ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెటా మాజీ ఓపెన్ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సాల్‌కు రూ.800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్లు తెలిసింది. కంపెనీ ‘ఓ-సిరీస్’ మోడళ్లను సృష్టించడంలో బన్సాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మెటా ఈ ప్యాకేజీలను ధ్రువీకరించనప్పటికీ వేతనం, పరిహార బోనస్‌లు, స్టాక్ గ్రాంట్లు కలిపి కొన్ని కంపెనీల సీఈఓలు సంపాదించే వేతనంతో సమానంగా, అంతకుమించి ఉన్నాయని తెలుస్తుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు ఎంత ప్యాకేజీ చెల్లించేందుకైనా వెనుకాడడం లేదని సమాచారం. -
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
ఎలాన్‌మస్క్‌కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్‌లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్‌లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్‌కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఈ ప్లాన్‌లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్‌బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్‌లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్‌కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్‌లో గ్రోక్‌ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
షిప్‌రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్‌రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్‌ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్‌లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్‌రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్‌రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్‌గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్‌తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్‌గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
‘మెటాలో పని.. క్యాన్సర్ అంత ప్రమాదం’
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు. -
ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?
సాంకేతిక పరిశ్రమలో పెరుగుతున్న కృత్రిమమేధ కోడింగ్ భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తోంది. ‘ఏఐ ఇప్పటికే తన కోడ్‌ను తానే వేగంగా, తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యతతో రాయగలుగుతోంది. అలాంటప్పుడు పిల్లలకు ఈ నైపుణ్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి?’ అనే ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రుల్లో అధికమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో టెక్ విద్య కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు అపారమైన సమయం, డబ్బు, శ్రమ, భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది కేవలం విద్యగా మాత్రమే కాకుండా ఉన్నత జీవనానికి నాందిగా చూస్తున్నారు.తల్లిదండ్రుల్లో భయంఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో భయం పేరుకుపోతోంది. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాలు చేసే సమయానికి వారు ప్రస్తుతం నేర్చుకునే నైపుణ్యాలకు అప్పటి మార్కట్లో గిరాకీ ఉంటుందా?అనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సంక్లిష్టమైనది. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏటా భారతదేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాపొంది బయటకు వస్తున్నారు. కానీ 2025 నాటికి, వారిలో కేవలం 10% మందికే అర్థవంతమైన ఉద్యోగాలు దక్కుతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.ఊహాత్మక సంక్షోభమే..అంతేకాకుండా, గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కోడింగ్ డిమాండ్ లేకపోవడం కారణమేమీ కాదు. మనం బోధిస్తున్న కోడింగ్ విధానం, ముఖ్యంగా ఆలోచనా సరళి మార్కెట్‌కు తగిన విధంగా లేదు. ఇది కంటెంట్ సంక్షోభం కాదు, ఊహాత్మక సంక్షోభమే. మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళదాం. కాలిక్యులేటర్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు గణితం బోధించటం ఆపామా? గూగుల్ వచ్చినప్పుడు రాయడం నేర్పించటం మానామా? కాదుకదా. మనం బోధించే విధానాన్ని మార్చుకున్నాం. పఠనం కాకుండా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. కోడింగ్‌లో కూడా ఇదే మార్పు అవసరం అవుతుంది.కోడింగ్ కనుమరుగవ్వదు..భవిష్యత్తులో సరైన ప్రశ్నలు అడగడం, మానవులకు అనుగుణంగా ఉండేలా కోడింగ్ రూపొందించడం, బాధ్యతాయుతంగా మెలగడం, మెషీన్ వ్యవస్థలు ఎక్కడ తక్కువ పడుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, ఎన్విరాన్మెంట్, డిజైన్, గవర్నన్స్, సాహిత్యం ఇంకా అనేక రంగాల్లో విస్తరించనుంది. కోడింగ్ కనుమరుగవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..అయితే భవిష్యత్తులో రాబోయే కోడింగ్ కేవలం సూచనలను అనుసరించే వారికే పరిమితం కాదు. ఇది విమర్శనాత్మకంగా ఆలోచించే, త్వరగా స్వీకరించే, సృజనాత్మకంగా రూపొందించే వ్యవస్థలకు విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనుసరిస్తున్న లెర్నింగ్ విధానాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనే లక్ష్యాలు ఇకపై సరిపోవు.విద్య ఉపాధి సాధనం కాదు..ఇంజినీరింగ్ డిగ్రీ వల్ల పిల్లలకు ఉద్యోగం రాకపోవచ్చనే తల్లిదండ్రుల ఆందోళన తప్పేమీ లేదు. కానీ అందుకు పరిష్కారం కోడింగ్‌ను వదిలేయడం కాదు. విజయాన్ని నిర్వచించే సంకుచిత ప్రమాణాల నుంచి బయటపడటమే అసలు పరిష్కారం. విద్యను కేవలం ఉపాధి సాధనంగా పరిగణించే దశ దాటిపోయింది. ఇప్పుడు అంచనాలను పెంచాల్సిన సమయం వచ్చింది. ‘ఎలా?’ అని మాత్రమే కాదు, ‘ఎందుకు?’ అని కూడా ప్రశ్నించే ధోరణి, ఆసక్తిని పిల్లల్లో పెంపొందించాలి. కోడింగ్‌ను సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం లేదా భాషాశాస్త్రంతో కలిపి అన్వేషించాలనుకుంటే వారికి ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్తులో వీటికి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంటుంది.‘ఇంటెలిజెన్స్’ అంటే..‘ఇంటెలిజెన్స్’ అంటే ఫార్ములాలను జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షలు పాస్ అవడం కాదు. ఇవి పిల్లల తెలివితేటలకు సూచికలు కావు. కేవలం క్రమశిక్షణకు సంకేతాలు మాత్రమే. అయితే, నిజమైన మేధస్సు అనేది వివరణాత్మకమైనది. ఇది మనం నేర్చుకునే అంశాలను లోతుగా ఆలోచించమని, మెషీన్లు చేయలేని పనులను పూర్తి చేయాలని తెలుపుతుంది. ఇప్పటికే ఏఐ తెలిసిన అంశాలను క్షణ్లాలో ముందుంచుతుంది. క్రియేటివిటీతో ఎవరికీ తెలియని కొత్త అంశాలను అన్వేషించేలా నైపుణ్యాలు మలుచుకోవాలి. క్రియేటివిటీతో తెలియని సమస్యలకు అసలైన పరిష్కారాలు కనుగొనాలి. ఇప్పటివరకు ఎవ్వరూ రూపొందించని దాన్ని డిజైన్ చేయాలి.ఇతర దేశాల్లో ఇలా..జర్మనీలోని ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ను భాషాశాస్త్రం, మీడియా అధ్యయనాలతో మిళితం చేస్తోంది. ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థులకు డేటా సైన్స్‌ను తత్వశాస్త్రం(ఫిలాసఫీ)తో కలిపి అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. స్వీడన్, డెన్మార్క్‌లో ఏఐ ప్రోగ్రాముల్లో విభిన్న మార్పులు చేస్తున్నారు. ఇవి కేవలం ప్రయోగాత్మక ఆలోచనలు కావు. ఇవే భవిష్యత్తు విద్యా మోడళ్లకు మార్గదర్శకాలు.భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి..భారతదేశానికి ఇదో గొప్ప అవకాశం. అవుట్సోర్స్ కోడింగ్ సర్వీసులు అందించేలా ఎదిగేందుకు మార్గం ఉంది. లేదా రాబోయే కాలానికి సిద్ధంగా ఉన్న మేధావులను పెంపొందించే ప్రయోగశాలగా మారవచ్చు. అందుకోసం పిల్లల్లో పటిష్ట నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐ యుగంలో లోతుగా ఆలోచించగలిగే, నిర్మాణాత్మకంగా క్రియేటివిటీ కలిగిన వారే విజయం సాధిస్తారు. పిల్లలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.కరుణ్ తాడేపల్లి, సీఈఓ బైటెక్సెల్(హైదరాబాద్‌లోని స్టార్టప్ సంస్థ). -
త్వరలో 50 శాతం వైట్‌కాలర్ జాబ్స్ కనుమరుగు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్సన్తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్‌లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్‌ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు. -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్‌ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్‌హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్‌గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ చెప్పింది. ఈ లేఆఫ్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.పనితీరుతో సంబంధం లేదు..ఇటీవల టౌన్హాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్‌ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..ఉద్యోగులపై ప్రభావంమైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్‌లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్‌ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫామ్స్‌తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్‌ఫోర్స్ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్‌లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్‌లో పనిచేస్తున్నారు. -
గూగుల్ సంచలన యాప్.. ఇంటర్నెట్ లేకుండా ఏఐ..
విస్తృతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్‌ను మొబైల్స్‌లో ఆఫ్‌లైన్‌లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్‌లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్‌ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.ప్రస్తుతానికి ఈ యాప్‌ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్‌గా ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. -
మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు
న్యూఢిల్లీ: భారత్‌లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్ ప్లాట్‌ఫాం అయిన శక్తి క్లౌడ్‌లో మైక్రోసాఫ్ట్ తమ అజూర్ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్‌లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్‌ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్‌కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి. -
టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్ చెప్పారు.భవిష్యత్తులో ‘హ్యూమన్ ప్లస్ ఏఐ‘ మోడల్ కింద సర్వీసులు అందిస్తామని షేర్హోల్డర్లకు టీసీఎస్ మాతృ సంస్థ టాటా సన్స్‌కి కూడా చైర్మన్ అయిన చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.హార్డ్‌వేర్ ప్రొవైడర్లు, సొల్యూషన్స్ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్‌లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ‘టీసీఎస్ విజ్డంనెక్ట్స్’ పేరిట కంపెనీల కోసం జెన్ ఏఐ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.👉 ఇది చదివారా? జాబ్ చేంజ్ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి.. -
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్‌లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్‌లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్‌లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్‌కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్‌స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. -
కథన రంగంలో ఏఐ చిందులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఏఐ సినిమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతుండడంతోపాటు సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. సృజనాత్మక ప్రక్రియలను మెరుగుపరచడం, వర్క్‌ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడం, వీక్షకుల అనుభవాలను విశ్లేషించడం ద్వారా ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. కృత్రిమ మేధ సినిమా ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఆడియన్స్ ఇంటరాక్షన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్స్క్రిప్ట్ రైటింగ్, కాస్టింగ్, స్టోరీబోర్డింగ్.. వంటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఏఐ సాయం చేస్తోంది. స్క్రిప్ట్‌బుక్, ప్లాటగాన్ వంటి సాధనాలు స్క్రిప్ట్‌ను విశ్లేషించడానికి, బాక్సాఫీస్ పనితీరును అంచనా వేయడానికి, భావోద్వేగ అంశాలు, సంభాషణ ఆధారంగా కథలో మెరుగుదలను సూచించడానికి నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ)ను ఉపయోగిస్తున్నాయి. ఇది సినీ రచయితలు తమ కథలను మెరుగుపరచడానికి, నిర్మాతలు బడ్జెట్లను సమర్థవంతంగా కేటాయించడానికి సహాయపడుతుంది.కాస్టింగ్.ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు దర్శకులు ఎంచుకున్న పాత్రలకు వర్చువల్‌గా నటులను గుర్తించేందుకు వారి ముఖాల కవళికలను విశ్లేషిస్తుంది. స్టోరీబోర్డర్ వంటి ఏఐ ఆధారిత సాధనాలు స్క్రిప్ట్‌లను విశ్లేషించి విజువల్ డ్రాఫ్ట్‌లను అందిస్తాయి. ఇది దర్శకులు సన్నివేశాలను ముందుగానే విజువలైజ్ చేయడానికి, సినిమాను త్వరగా చిత్రీకరించడానికి సాయం చేస్తుంది.ప్రొడక్షన్ప్రొడక్షన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోంది. డాల్.ఈ, మిడ్‌జర్నీ వంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా వర్చువల్‌గా వాస్తవికతను జోడిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్లో ఏఐ రోటోస్కోపింగ్, మోషన్ క్యాప్చర్, డీ-ఏజింగ్(నటుల వయసు తగ్గినట్టు చూపడం) వంటి పనులను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కదలికలను ఆటోమేట్ చేస్తుంది. సీన్ ఆధారంగా లైటింగ్ సెటప్‌లను సూచించడం ద్వారా సినిమాటోగ్రఫీని మెరుగుపరుస్తుంది.పోస్ట్ ప్రొడక్షన్ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్లను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ పోస్ట్ ప్రొడక్షన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో ఆటో రిఫ్రేమ్ వంటి సాధనాలు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కృత్రిమ మేధ సాధనాలు రా-ఫుటేజీని విశ్లేషిస్తాయి. కీలక దృశ్యాలను గుర్తిస్తాయి. సరైన విధంగా ఎడిట్ చేస్తాయి. ఐజోటోప్ ఆర్ఎక్స్ వంటి ఏఐ సాధనాలు బ్యాగ్రౌండ్ సౌండ్‌ను తొలగిస్తాయి. వాస్తవిక సౌండ్ ఎఫెక్ట్స్‌ను క్రియేట్ చేస్తాయి. వాయిస్ఓవర్లను మెరుగుపరుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డబ్బింగ్ ప్లాట్‌ఫామ్‌లు సహజసిద్ధమైన ట్రాన్స్లేషన్లను అందిస్తాయి. ఇది ప్రపంచంలోని ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలి.. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయలనే అంశాలను ఏఐ పునర్నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల్లో వ్యూయర్షిప్ను విశ్లేషించడానికి ఏఐ అల్గారిథమ్‌లు ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగత వినియోగదారుల కోసం తగిన ట్రైలర్లు, పోస్టర్లను సృష్టిస్తున్నాయి. ప్రమోషన్లో భాగంగా జానర్ ప్రాధాన్యతలు లేదా ఇష్టమైన నటుల ఆధారంగా నిర్దిష్ట ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఏఐ టూల్స్ మార్కెట్ పోకడలు, సోషల్ మీడియా సెంటిమెంట్, చారిత్రాత్మక డేటాను విశ్లేషించి విడుదల తేదీలను సూచిస్తున్నాయి. దీంతోపాటు పైరసీని ఎదుర్కోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది.ఆడియన్స్ ఎంగేజ్మెంట్ఇంటరాక్టివ్ ఫార్మాట్లను రూపొందించడం ద్వారా సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునే వీలుంటుంది. ఏఐ ఆధారిత వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) వంటివి ప్రేక్షకులను సినిమాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఏఐ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషిస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడంలో స్టూడియోలకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా మధ్య డీల్..?సవాళ్లు లేవా..?ఏఐ సినిమాకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుండగా, నైతిక, సృజనాత్మక ఆందోళనలను కూడా లేవనెత్తుతుంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనుమతి లేకుండా నటుల పోలికలు లేదా స్వరాలను కాపీ కొట్టేలా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని క్రియేటివ్ ఉద్యోగులకు ఏఐ ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్‌లో ఎంట్రీ లెవల్ ఆర్టిస్టులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఏఐ ఆటోమేటెడ్ ఎడిటింగ్ వల్ల సన్నివేశాల్లోని భావోద్వేగాలు కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా ఏఐ చాలా వరకు సినీ ప్రపంచంలో ఇప్పటికీ పాగా వేసింది. ఏ రంగంలోనైనా ఏఐ ప్రభావం కొంత వరకే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్ పరిశ్రమలో నిత్యం చేసే పనులను మాత్రమే ఏఐతో ఆటోమేట్ చేయవచ్చని చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించి, మంచి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ కళామతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏఐ కంటే మానవులపైనే అధికంగా ఉందంటున్నారు. -
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
విపరీతమైన పని గంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్‌లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్‌ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్‌లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్‌లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్‌లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్‌లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్‌లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్‌లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్‌లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్‌లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్‌లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్‌లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. -
వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా కృత్రిమమేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)ప్రాథమికంగా రోగ నిర్ధారణ..ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.వైద్య సిఫారసులుఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్‌లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.పరిపాలనా విధుల్లో..హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్ట్‌లను అప్డేట్ చేయగలవు. చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్స్‌ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్‌లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.టెలిమెడిసిన్, రిమోట్ కేర్..ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్‌గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తాయి. రియల్ టైమ్‌లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.పరిశోధనలు వేగవంతంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్బాట్లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలుసవాళ్లు-పరిష్కారాలుఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం. -
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు. -
ఏఐని ఎవరెలా వాడుతున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.షాపింగ్, ఫుడ్..షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.కస్టమర్ సర్వీస్‌లో మాత్రం..రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. -
కోడింగ్‌లో కృత్రిమమేధ ఏం చేస్తుందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకుస్తోంది. కోడింగ్ ప్రక్రియలో సృజనాత్మకతను, సామర్థ్యాన్ని సమకూరుస్తోంది. కోడింగ్‌లో ఏఐ నిర్వహిస్తున్న కొన్ని అంశాలను సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.కోడ్ జనరేషన్: గిట్‌హాబ్ లాంటి కోపిలాట్ కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు నేచురల్ ల్యాంగ్వేజీ వివరణల ఆధారంగా కోడ్ స్నిప్పెట్లు, ఫంక్షన్లు, మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. ఇది మాన్యువల్ కోడింగ్‌ను తగ్గించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను వేగవంతం చేస్తుంది.బగ్ డిటెక్షన్: ఏఐ అల్గారిథమ్స్ నమూనాలను విశ్లేషించడం ద్వారా కోడ్‌లో బగ్స్, సమస్యలను గుర్తిస్తున్నారు. ఈ టూల్స్ రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తాయి.కోడ్ ఆప్టిమైజేషన్: ఏఐ ఇప్పటికే ఉన్న కోడ్‌ను విశ్లేషించగలదు. పనితీరు, రీడబిలిటీ, నిర్వహణను మెరుగుపరచడానికి ఆప్టిమైజేషన్లను సూచిస్తుంది. ఇది వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి, మెరుగైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి సాయం చేస్తుంది.టెస్టింగ్: టెస్ట్ కేసులను జనరేట్ చేయడం, ఎడ్జ్ కేసులను గుర్తించడం, పునరావృత టెస్టింగ్ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ టెస్టింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.కోడ్ రివ్యూ అసిస్టెన్స్: ఏఐ ఆధారిత కోడ్ రివ్యూ టూల్స్ పీర్ రివ్యూల సమయంలో కోడ్‌ను మెరుగుపరచడానికి, కోడింగ్ ప్రమాణాలు, ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉండేలా చూడటానికి సూచనలను అందిస్తాయి.డీబగ్గింగ్ సపోర్ట్: కోడింగ్‌లో సమస్యలకు మూలకారణాన్ని గుర్తించడం, సంభావ్య పరిష్కారాలను సూచించడం ద్వారా డీబగ్గింగ్ చేయడంలో ఏఐ టూల్స్ డెవలపర్లకు సహాయపడతాయి. ట్రబుల్ షూటింగ్ కోసం వెచ్చించే సమయాన్ని తగ్గిస్తాయి.లెర్నింగ్ అండ్ అప్ స్కిల్లింగ్: ఇంటరాక్టివ్ ట్యుటోరియల్స్‌ను సిఫార్సు చేయడం ద్వారా డెవలపర్లు కొత్త ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజీలు, ఫ్రేమ్ వర్క్‌లను నేర్చుకోవడానికి ఏఐ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..అనాలిసిస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చారిత్రాత్మక డేటాను విశ్లేషించడం ద్వారా ప్రాజెక్ట్ టైమ్ లైన్లు, వనరుల అవసరాలు, సంభావ్య ప్రమాదాలను అంచనా వేయగలదు. -
ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐ వాడకం ఎక్కువవుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో దీని ఉపయోగం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ కోడింగ్, టెస్టింగ్, ఎగ్జిక్యూటింగ్ వంటి కీలక పనులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ కోడింగ్‌కు సంబంధించి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్‌లో ఏఐ సామర్థ్యం ఏమేరకు ఉంటుందో అంచనా వేస్తూ భవిష్యత్తులో దాని పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.‘ఏఐ 90 శాతం కోడ్‌ను రాస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామర్లు రాసే వాటిలో 90 శాతం బాయిలర్ ప్లేట్లు(కాపీ చేసేందుకు వీలుగా ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు). ప్రోగ్రామింగ్ రెండు రకాల సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒకటి-ముఖ్యమైన సంక్లిష్టత.. ఇందులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కోడింగ్‌ను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రెండు ప్రమాదవశాత్తు సంక్లిష్టత-ఏదైనా అత్యసవర సమయాల్లో కోడింగ్‌లో సాయం అవసరం అవుతుంది. దాన్ని తొలగించడానికి కృత్రిమ మేధ ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మానవులు కనుగొన్న నమూనాల ప్రకారం కోడింగ్‌లో సహకారం అందిస్తుంది. ఇది పూర్తిగా కొత్త నమూనాలు సృష్టిస్తుందా..? మానవుల మాదిరిగానే ఏఐ చాలా అరుదుగా కొత్త నమూనాలను తయారు చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఇది ఏమేరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’When people say "AI will write 90% of the code" I readily agree because 90% of what programmers write is "boiler plate".There is "essential complexity" in programming and then there is a lot of "accidental complexity" (that is the boiler plate stuff) and this is very old wisdom…— Sridhar Vembu (@svembu) March 22, 2025 -
సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్‌మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్‌మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్‌మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగేకొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు. -
ఈ ఏడాది టాప్ 15 స్కిల్స్ ఇవే..
హైదరాబాద్: ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఆన్ డిమాండ్ స్కిల్స్ వేగంగా మారిపోతున్నాయి. ఉద్యోగం తెచ్చుకునేందుకు మాత్రమే కాదు.. ఆ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే కూడా ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు అవసరం. వీటిపై అగ్రగామి ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్.. ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో జాబితాను విడుదల చేసింది. వృత్తి నిపుణులు తమ ఉద్యోగ విధులలో ముందడుగు వేయడానికి నేర్చుకోవాల్సిన 15 నైపుణ్యాలను వెల్లడించింది.భారతదేశంలో 2030 నాటికి చాలా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉపయోగించే 64% నైపుణ్యాలు మారుతాయని అంచనా. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ పరిశోధన ప్రకారం.. 25% మంది వృత్తి నిపుణులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు తమకు లేవని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు 10 మందిలో నలుగురు (46%) నిపుణులు ఉద్యోగానికి తాము సరిపోతామో లేదో నిర్ణయించుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. 31% మందికి తమ నైపుణ్యాలలో ఏవి ఉద్యోగ అవసరాలకు సరిపోతాయో తెలియకపోవడంతో, ఏ నైపుణ్యాలు డిమాండ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారింది.మరోవైపు, భారతదేశంలో 69% మంది రిక్రూటర్లు నిపుణులకు ఉన్న నైపుణ్యాలకు, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య నైపుణ్య అంతరాలను నివేదిస్తున్నారు. చాలా పనులను ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, వ్యూహాత్మక ఆలోచన వంటి స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ విధుల్లో ఏఐ అక్షరాస్యత అనేది ఒక ప్రాథమిక అంచనాగా మారుతోంది.టాప్ 15 నైపుణ్యాలు1. సృజనాత్మకత, ఆవిష్కరణ2. కోడ్ సమీక్ష3. సమస్య పరిష్కారం4. ప్రీ-స్క్రీనింగ్5. వ్యూహాత్మక ఆలోచన6. కమ్యూనికేషన్7. అనుకూలత8. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)9. ఏఐ అక్షరాస్యత10. డీబగ్గింగ్11. కస్టమర్ ఎంగేజ్మెంట్12. గణాంక డేటా విశ్లేషణ13. ప్రాంప్ట్ ఇంజనీరింగ్14. మార్కెట్ విశ్లేషణ15. స్టేక్‌హోల్డర్ నిర్వహణహైదరాబాద్లో కొత్త ఉద్యోగాల అన్వేషణలింక్డ్ఇన్ నుంచి వచ్చిన తాజా పరిశోధన ప్రకారం.. హైదరాబాద్‌లోని 82% మంది వృత్తి నిపుణులు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నారు. అయితే నగరంలో 56% మంది నిపుణులు తాము గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ స్పందన మాత్రం తక్కువగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ తమ వార్షిక ‘జాబ్స్ ఆన్ ది రైజ్’ జాబితాలో భాగంగా గత మూడేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో కూడా వివరించింది.హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు1. సేల్స్ డెవలప్మెంట్ ప్రతినిధి2. కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్3. సోర్సింగ్ మేనేజర్4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్5. సేల్స్ మేనేజర్6. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్7. సోషల్ మీడియా మేనేజర్8. హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ మేనేజర్9. పైపింగ్ డిజైనర్10. కమర్షియల్ మేనేజర్ -
ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ఎన్విడియా ఏఐ సాఫ్ట్వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్‌కు వీలుంటుంది. ఎన్విడియా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్ఫ్రా, డేటా, వర్క్‌ఫోర్స్, బిజినెస్ నెట్‌వర్క్స్‌ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంఎన్విడియా జెట్సన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్ఈఐను ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్‌వర్క్‌ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది. -
ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్యం సవాలుగా మారుతోంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా కార్యకర్తలు) మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకితభావంతో ఉన్న ఈ ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాధ్వానీ ఏఐ అభివృద్ధి చేసిన ‘శిశు మాపన్’ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు.శిశువుల ఆరోగ్య పర్యవేక్షణశిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంత్రోపోమెట్రిక్ కొలతలు(ఎత్తు-నిలబడినప్పుడు కుర్చునప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత..)ను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లకు సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం అవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో కచ్చితత్వం లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ‘శిశు మాపన్’ ద్వారా ఈ సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.ఎలా పని చేస్తుందంటే..ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైమ్‌లో కచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాత స్మార్ట్ఫోన్లలోనూ పనిచేసేలా ఈ యాప్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ (హెచ్బీఎన్సీ) కార్యక్రమానికి అనుసందానం అయి ఉంటుంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్ చేసేందుకు వీలవుతుంది.శిశు మాపన్ మొబైల్ అప్లికేషన్లో ఆశా వర్కర్లు కచ్చితమైన, స్థిరమైన కొలతలను రికార్డ్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు, వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది.ఆశా వర్కర్లకు సాధికారతశిశు మాపన్ యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశావర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్‌ను తమ పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశావర్కర్లు సన్నద్ధమయ్యారు.ఇదీ చదవండి: దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా, కచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. ఏఐ కేవలం టెక్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా, స్మార్ట్ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతోంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి, మరింత మందికి సర్వీసులు అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృష్టి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ ఏఐ మిషన్ పార్లమెంట్‌తో ఒప్పందం
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో స్వావలంబన దిశగా భారతఏఐ మిషన్ భారత పార్లమెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చాట్ జీపీటీని పోలిన లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్ (ఎల్ఎల్ఎం)తో సహా స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు విస్తృతమైన బహుభాషా డేటాసెట్లను ఉపయోగించుకోవాలని ఈ సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను సృష్టించే అవసరాలను నొక్కి చెబుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైసినా డైలాగ్ 2025’ సందర్భంగా ఈమేరకు వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఏఐ మిషన్ దేశం ప్రత్యేక అవసరాలను తీర్చే ఏఐ సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వాడకం దీర్ఘకాలంలో నిలకడగా ఉండకపోవచ్చు. సొంత దేశీయ ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పార్లమెంటుతో భాగస్వామ్యం డేటా సెట్లకు అవకాశం కల్పిస్తుంది. ఇది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. దూరదర్శన్, ఆలిండియా రేడియో వంటి సంస్థల నుంచి అదనపు డేటాసెట్లు ఈ చొరవకు మరింత తోడ్పాడు అందుతుంది’ అని చెప్పారు.లాభాపేక్షలేని సంస్థ నుంచి లాభాపేక్ష సంస్థగా ఓపెన్ఏఐని మార్చడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి లాభాపేక్ష సంస్థగా మారితే ఓపెన్ఏఐ తన పేరును కూడా మార్చుకోవాలని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో సొంత జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) చిప్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని మంత్రి చెప్పారు. స్వదేశీ జీపీయూ సామర్థ్యాన్ని సాధించేందుకు పట్టే కాలపరిమితి గురించి అడిగినప్పుడు వైష్ణవ్ మాట్లాడుతూ మూడు నుంచి ఐదేళ్లలో సహేతుకమైన మంచి సామర్థ్యాన్ని పొందడానికి వీలైన జీపీయూ సాధిస్తామన్నారు.ఇదీ చదవండి: ఫస్ట్‌టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్నర్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ ధామ్ మాట్లాడుతూ జీపీయూ అభివృద్ధికి మంత్రి ఇచ్చిన గడువు చాలా సహేతుకంగా ఉందన్నారు. భారత్ తన సొంత ఏఐ మోడల్‌ను నిర్మించుకోవడానికి ఓపెన్ఏఐ వంటి ఓపెన్‌సోర్స్ మోడల్స్‌ను ఉపయోగించుకోవాలని, కానీ రహస్య కార్యకలాపాలకు పాశ్చాత్య ఏఐ నమూనాలను ఉపయోగించరాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతాయని చెప్పారు. అందుకోసం జీపీయూ వృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తరహా ఫండింగ్‌ను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వచ్చే 2-3 ఏళ్ల పాటు ఏఐకు ఇదే తరహా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.