బీమా రంగానికి ఏఐ ధీమా | how AI Revolution in Insurance sector Strategic Transformation | Sakshi
Sakshi News home page

బీమా రంగానికి ఏఐ ధీమా

Nov 8 2025 12:18 PM | Updated on Nov 8 2025 12:18 PM

how AI Revolution in Insurance sector Strategic Transformation

ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు కృత్రిమ మేధ(AI)ను కేవలం ఒక సాంకేతిక సాధనంగా మాత్రమే కాకుండా వ్యాపార వృద్ధిని నడపడానికి ఉపయోగిస్తున్నాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి వాడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ జీవిత, జనరల్‌ బీమా డొమైన్లలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది.

టెస్టింగ్ నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్ వరకు

గతంలో బీమా పరిశ్రమలో ఏఐను ప్రత్యేక డొమైన్‌ల్లో మాత్రమే పరీక్షించేవారు. కానీ ఇటీవలకాలంలో ఏఐ వాడకం పెరిగింది. జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ పర్మార్ అభిప్రాయం ప్రకారం.. ‘జీవిత బీమాలో ఏఐ పరీక్షల దశ నుంచి వ్యూహాత్మకంగా మారి విభిన్న విభాగాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దాంతో పరిశ్రమలో పట్టు సాధించింది’ అన్నారు.

పాలసీదారుల రిస్క్‌ అంచనా

విస్తృతమైన డేటాను (సాంప్రదాయ డేటా, IoT పరికరాలు, సామాజిక మాధ్యమాలు, మొదలైనవి) విశ్లేషించడం ద్వారా పాలసీదారుల రిస్క్‌ను అంచనా వేయడానికి ఏఐ సహాయపడుతుంది. దీనివల్ల మరింత కచ్చితమైన ప్రీమియం ధరలను (Pricing) నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఏఐ ఆధారిత టూల్స్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, క్లెయిమ్ ఫైలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం అవుతున్నాయి. క్లెయిమ్స్ డేటాలోని అసాధారణ నమూనాలను, మోసపూరిత స్కీమ్‌లను ఏఐ ఆధారిత టూల్స్‌ను త్వరగా గుర్తిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు నష్టాలు తగ్గుతున్నాయి.

నిరంతరం సేవ

ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు 24/7 అందుబాటులో ఉండి పాలసీ కొటేషన్లు, క్లెయిమ్‌ స్టేటస్‌, సాధారణ ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ సమయం తీసుకునే క్లెయిమ్‌లను ఏఐ ఆటోమేట్ చేయడం ద్వారా పాలసీదారులు తక్షణమే పరిహారాన్ని పొందగలుగుతారు. పాలసీదారుని వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా సరైన ప్రీమియం ధరతో (తక్కువ రిస్క్ ఉన్నవారికి తక్కువ ప్రీమియం) అతనికి సరిపోయే పాలసీలను ఏఐ సిఫార్సు చేస్తుంది. చాట్‌బాట్‌ల ద్వారా రోజులో ఏ సమయంలోనైనా తమ ప్రశ్నలకు సమాధానాలు, పాలసీ వివరాలు, సపోర్ట్‌ లభిస్తుంది. పాలసీ కొనుగోలు దగ్గరి నుంచి క్లెయిమ్ చేయడం వరకు మొత్తం ప్రక్రియలను సులభతరం చేస్తుంది.

ఇదీ చదవండి: అధిక పనిగంటలు.. ఉద్యోగుల వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement