ప్లాట్‌గా ముగిసిన మార్కెట్
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్‌పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్
క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి.
⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది.
⇒ కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్‌ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది.


