బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా! | Gold and Silver Price in A Week At India | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!

Feb 7 2026 6:39 PM | Updated on Feb 7 2026 7:21 PM

Gold and Silver Price in A Week At India

బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.

చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.

ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్‌లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్‌ ఇదే!

ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.

వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement